వరంగల్

ట్రెంచ్‌ను వేసే ప్రయత్నంలో అటవీ అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంగారం, మార్చి 26: అటవీశాఖ అధికారులు సిబ్బందితో కలసి కొత్తపొళ్లలో ట్రెంచ్ వేయబోతే గ్రామస్థులు అడ్డుకున్న సంఘటన ఆదివారం మండలంలోని గుడిపాడు సమీపాన జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మండలంలోని గుడిపాడు సమీపంలో ఉన్న మామిడితొగు వద్ద అటవీ అధికారులు జెసిబితో ట్రెంచ్ వేస్తున్నారనే సమాచారం తెలుసుకున్న గుడిపాడు, సర్పంచ్ గుంపులకు చెందిన 150మంది రైతులు పరుపరుగున వెళ్లి జెసిబికి అడ్డంతిరిగి ట్రెంచ్ వేయవద్దని ఆగ్రహంతో వాగ్వాదానికి దిగడంతో కాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తాము ఎన్నో ఎళ్ల నుండి పొడు చేసుకుంటున్న భూమిలో ట్రెంచ్ వేసి ప్రభుత్వం తమ భూములను లాక్కొవాలని చూస్తుందని ఆరోపించారు. అయితే ఈపిసిఎఎఫ్ ఆదేశాల మేరకు మామిడి తొగు వద్ద కొంతమేర ట్రెంచ్ వేశామని అటవీ సంరక్షణ కోసమే తాము ట్రెంచ్ వేస్తున్నామని ఎఫ్‌బివో శ్రీనివాస్ ఆంధ్రభూమికి తెలిపారు. హక్కుచట్టం కలిగి ఉన్న రైతుల భూముల జోలికి పోవడంలేదని లేనివాటి విషయంలో తాము ఏమి చేయలేమని ఆయన తెలిపారు.
ప్రస్తుతం రైతుల కోరిక మేరకు ట్రెంచ్ వేయడం తాత్కాళికంగా ఆపామని ఆయన తెలిపారు. అయితే తాము వెళ్లాక తిరిగి పనులు ప్రారంభిస్తారని రైతులు మహిళలతో సహా వచ్చి జెసిబి దగ్గరే బైటాయించారు. ఈ సందర్భంగా కొందరు రైతులు ఎఫ్‌ఆర్‌ఓను కలువడానికి వెళ్లారని రైతులు తెలిపారు. తాము కష్టపడి పొడుచేసుకుంటున్న భూమిని లాక్కొవడం సరికాదని గ్రామస్థులు అంటున్నారు. అటవీ అభివృద్ధి కోసమే అని అధికారులు, కాదని రైతులు పరస్వరం వాగ్వివాదానికి దిగడం మండలంలో చర్చనియాంశమైంది.

వేసవి తాపం..కారాదు శాపం...
* మృత్యువుగా మారుతున్న జలాశయాలు
* ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలంటున్న స్థానికులు
గోవిందరావుపేట, మార్చి 26: వేసవి తాపానికి తాళలేక ఈతకు వెల్లి మృత్యువాత పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. అధికారులు ఎన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నా ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. దీంతో విలువైన ప్రాణాలు పొగొట్టుకొని కుటుంబాలకు దూరమై కుటుంబ సభ్యులు పడుతున్న ఆవేదన అంతా ఇంతా కాదు. గతంలో గోవిందరావుపేట సమీపంలోని దయ్యాలవాగులో పడి పలువురు మృత్యువాత పడగా ప్రముఖ పర్యాటక కేంద్రమైన లక్నవరం జలాశయంలో సైతం అనేక మంది మృత్యువాడ పడ్డారు. ఈతకు వెల్లి కొంత మంది, సరదాగ స్నానానికి వెల్లి మరికొంత మంది, ఇలా ప్రమాదమని తెలియక ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్లు ఎంతో మంది నీటిలో పడి మరణించారు. అయితే ఇటువంటి ప్రమాదాలను నివారించడానికి స్ధానిక పోలీస్ యంత్రాంగం గతంలో జలాశయాల వద్ద పలు హెచ్చరికల బోర్డులు ఎర్పాటు చేసినా ఫలితం కనిపించడం లేదు. లక్నవరం జలాశయంలో సెక్యూరిటి సిబ్బంది హెచ్చరిస్తున్నా వారి మాటలు ఖాతరు చేయకుండా సరదాగా నీటిలోకి వెల్లి ప్రాణాలు వదిలిన వారు ఉన్నారు. ఏక్కడో పుట్టి ఉన్నత చదువులు చదవడంతోపాటు ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారు సైతం ఈ ప్రమాదాలలో మరణిస్తుండటంతో అధికారులు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లక్నవరం జలాశయం వద్ద మరింత మంది సెక్యూరిటి సిబ్బందిని ఎర్పాటు చేయడం వల్ల ప్రమాదాన్ని కొంత మేర నివారించవచ్చు. అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మండలంలోని ప్రజలు కోరుతున్నారు.