వరంగల్

చెన్నకేశవస్వామిని దర్శించుకున్న ఇనగాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, మార్చి 26: దామెర మండలంలోని కొగిలివాయి గ్రామ సమీపంలో చంద్రగిరి గుట్టలపై స్వయంగా వెలిసిన చెన్నకేశవ ఆలయాన్ని సందర్శించిన కాంగ్రెస్ పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జి ఇనగాల వెంకట్రాంరెడ్డికి ఆలయ పూజారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో వెంకట్రాంరెడ్డితో పాటు పరకాల నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చరిత్రను పూజారులు ఇనగాలకు వివరించారు.గుట్టల పైన గల ఏడు గుండాలలో స్నానాలు ఆచరించినట్లయితే పాపాలు తొలిగిపోయి పుణ్యం లభిస్తుందని ఆలయ ప్రధాన పూజారి జోగచార్యులు వివరించారు.
భక్తులకు కనీస సౌకర్యాలు కరువు..
చంద్రగిరిపై వెలిసిన చెన్నకేశవ ఆలయంలో భక్తులకు త్రాగునీరు, మరుగుదొడ్లు లాంటి కనీస ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తుల పడుతున్న ఇబ్బందిని చూసిన ఇనగాల జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌కు ఫోన్‌లో వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఆలయ పాలకవర్గం, స్థానిక ఎమ్మెల్యే విఫలం అయ్యారని ఆరోపించారు. దామెర మండలం ఏర్పాటు ఎమ్మెల్యే స్వప్రయోజనం కోసమేనని, మండలం ఏర్పడి నాలుగు నెలలు గడుస్తున్న ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు.
వెంటనే స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులతో నివేధిక తెప్పించుకుని భక్తులకు సౌకర్యాలు కల్పిస్తామని హామి ఇచ్చినట్లు ఇనగాల తెలిపారు. ఈ కార్యక్రమంలో పరకాల, ఆత్మకూరు మండలాల అధ్యక్షులు కృష్ణయ్య, సాహురే రాజేశ్వర్‌రావు, ఎంపిటిసి రమేశ్, సర్పంచ్ సామెల్ తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరు, దామెర మండలాల
యూత్ కాంగ్రెస్ అధ్యక్షుల ఎన్నిక
పరకాల నియోజకవర్గంలోని మండలాలకు యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికలు ఇనగాల స్వగృహంలో నిర్వహించగా ఆత్మకూరు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అక్కంపేట గ్రామానికి చెందిన నగనబోయిన దేవరాజు, దామెర మండలానికి ఒగ్లాపూర్ గ్రామానికి చెందిన మనె్నం ప్రకాశ్‌రెడ్డి ఎంపికయ్యారు. ఈ ఎంపిక కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రమాకాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కొయ్యాడ శ్రీనివాస్, పరకాల యూత్ వర్కింగ్ ప్రసిడెంట్ క్రాంతి పాల్గొన్నారు. యూత్ అధ్యక్షలుగా ఎంపికైనవారికి ఇనగాల నియామక పత్రాలు అందజేశారు.

రైతు ఆత్మహత్యలకు ప్రభుత్వాలు బాధ్యత వహించాలి
సంగెం, మార్చి 26: రైతు ఆత్మహత్యలు నివారించలేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించి తక్షణమే పాలకులు గద్దె దిగాలని రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ చందర్‌రావు డిమాండ్ చేశారు. సంగెం మండలం మొండ్రాయి గ్రామంలో పత్తి రైతు స్వామి ఇటివల క్రిమి సంహారక మందు త్రాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతి చెందిన రైతు కుటుంబాన్ని ఆదివారం రైతు సంఘం నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండించిన పంటలకు గిట్టు బాటు ధర లేకనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో 29వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని దేశంలో 25వ స్థానంలో ఉందని అన్నారు. సమగ్ర వ్యవసాయ విధానం తక్షణమే అమలుచేయాలని, పంజాబ్, కర్ణాటక తరహాలో రైతు కమీషన్ ఏర్పాటు చేసి రైతులకు ఆదాయ భద్రత కల్పించాలని వ్యవసాయానికి ఉపాధీ హామి పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు రాజయ్య, వీరమల్లు, తదితరులు పాల్గొన్నారు.