వరంగల్

ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ములుగుటౌన్, మార్చి 26: ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించుకోవడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, మహబూబాబాద్ ఎంపి అజ్మీరా సీతారాంనాయక్ సూచించారు. జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో పట్టణంలోని కూరగాయల మార్కెట్ సమీపంలో 18.50లక్షల రూపాయలతో నిర్మించే షాపింగ్‌కాంప్లెక్స్ నిర్మాణానికి వారు ఆదివారం భూమిపూజ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతుందని, ములుగు ప్రాంత అభివృద్ధి కోసం సిఎం కెసిఆర్ అనేక నిధులు విడుదల చేస్తున్నారని అన్నారు. ఇక్కడ అసంపూర్తిగా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌ను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అసంపూర్తిగా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ భవనాన్ని నూతనంగా నిర్మించనుందని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో సబ్ కలెక్టర్ విపి.గౌతం, వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ అజ్మీరా ప్రహ్లాద్, ఒడిసిఎంఎస్ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్‌రెడ్డి, తహసిల్దార్ ములుకనూరి శ్రీనివాస్, ఎంపిపి భూక్య మంజుల, సర్పంచ్ గుగ్గిళ్ల సాగర్ తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయ గోదాంను ప్రారంభించిన మంత్రి చందూలాల్
ములుగు, మార్చి 26: మండలంలోని ఇంచర్ల గ్రామశివారులోని ఎర్రిగట్టమ్మ దేవాలయం సమీపంలో రైతుల సౌకర్యార్థం రూ.40లక్షలతో నిర్మించిన వ్యవసాయ గోదాంను ఆదివారం రాష్ట్ర గిరిజన సంక్షేమ, పర్యాటక, సాంస్కృతిక మంత్రి అజ్మీరా చందూలాల్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రైతుల శ్రేయస్సు కోసం టిఆర్‌ఎస్ ప్రభుత్వం కృషిచేస్తుందని, అందులో భాగంగానే సిఎం కెసిఆర్ వ్యవసాయ ఉత్పత్తుల నిలువల కోసం గోదాంలను నిర్మిస్తున్నారని అన్నారు. ఈ గోదాంను రైతులు సద్వినియోగపరచుకోవాలని కోరారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ములుగు నియోజకవర్గం ఎంతో అభివృద్ధి జరుగుతుంటే కొన్ని పార్టీలు కావాలని రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. మంత్రి పర్యటన సందర్భంగా డిఎస్‌పి దక్షిణామూర్తి ఆధ్వర్యంలో సిఐ సాయిరమణ, ఎస్‌ఐ మల్లేష్‌యాదవ్ భారీ బందోబస్తు ఏర్పాటుచేసారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అజ్మీరా ప్రహ్లాద్, ఎంపిపి భూక్య మంజుల, సర్పంచ్‌లు ముడుతనపల్లి స్వరాజ్యంమోహన్, గుగ్గిళ్ల సాగర్, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గట్టు మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

మానుకోట అభివృద్ధికి బాటలు వేస్తాం...
* పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
* మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్

మహబూబాబాద్, మార్చి 26: కొత్తగా ఏర్పాటైన మహబూబాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తన శక్తిమేరకు కృషి చేస్తానని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. ఆదివారం మహబూబాబాద్ మండలంలోని లక్ష్మిపురం, బేతోలు గ్రామలో సిసిరోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం లక్ష్మిపురం, బేతోలు గ్రామంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందు కు పోతుందన్నారు. బంగారు తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ప్రభుత్వ పధకాలు పేదలకు అందే విధంగా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుకుగా పాల్గొని రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానానికి వెళ్లాలని ఆయన కార్యకర్తలను కోరారు. ప్రభుత్వ పనితీరును జీర్ణించుకోలేకే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ రైతులకు వరంలాంటిదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కాళేశ్వరంతో నిర్మాణ, నిర్వహణ భారం
* తెలంగాణ ఇంజనీర్ల ఫోరం కన్వీనర్ లక్ష్మినారాయణ

వరంగల్, మార్చి 26: రాష్ట్రప్రభుత్వం రిడిజైన్‌తో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుతో నిర్మాణ వ్యయం, నిర్వహణ వ్యయం విపరీతంగా పెరుగుతుందని తెలంగాణ ఇంజనీర్ల ఫోరం కన్వీనర్ దొంతుల లక్ష్మినారాయణ తెలిపారు. గోదావరి నదిలో నీటిలభ్యత కాలం, పంటల కాలం ఒకేసారి కావటంతో కాళేశ్వరం ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లలో నీటిని నిలువచేయటం ఇబ్బందికరమని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నిపుణుల కమిటీతో అధ్యయనం జరిపించాలని ఆయన రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఆదివారం అఖిల భారత రైతు సమాఖ్య తెలంగాణ రాష్టక్రమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో సాగునీటి ప్రాజెక్టులు- ఎత్తిపోతల పథకాలు-గిట్టుబాటు ధరలు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న లక్ష్మినారాయణ మాట్లాడుతు రిడిజైన్‌తో 80వేల కోట్ల వ్యయంతో చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ఆర్థికభారంగా మారుతుందని హెచ్చరించారు. కాళేశ్వరం ఎత్తిపోతలకు 4627మెగావాట్ల విద్యుత్ అవసరమని, దీనితో ఏటా ఎకరానికి 47వేల రూపాయల ఖర్చు వస్తుందని తెలిపారు. మల్లన్నసాగర్ భారీ ప్రాజెక్టుతో ప్రజాధనం వ్యథా చేయటమేనని చెప్పారు. నిపుణుల కమిటీ ద్వారా ప్రాణహిత-చేవెళ్ల, కాళేశ్వరం ప్రాజెక్టులపై అధ్యయనం చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. ఒకవైపు సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి పంటపొలాలకు నీరు ఇవ్వాలని కోరితే, దానిని వదిలి మిషన్ భగీరథ ద్వారా వేలకోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు.
అఖిల భారత రైతుసమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లెపు ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతు 60సంవత్సరాలలో రాష్ట్రానికి 65వేల కోట్లరూపాయల అప్పు ఏర్పడితే కెసిఆర్ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో 70వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి కాంట్రాక్టర్ల జేబులు నింపుతున్నారని ఆరోపించారు. రైతు ఆత్మహత్యల నివారణకు, మార్కెట్ దోపిడి నివారణకు ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు లేవని విమర్శించారు. పంటల మద్దతుధరపై మంత్రివర్గం తీర్మాణం చేసి కేంద్రానికి పంపి చేతులు దులుపుకుంటోందని చెప్పారు. ప్రభుత్వంపై గ్రామస్థాయి నుంచి రైతాంగ ఉద్యమాలను నిర్మించాలని అన్నారు. అఖిల భారత రైతుసమాఖ్య ఉపాధ్యక్షుడు సాంబయ్య, ఏఐఎఫ్‌డివై రాష్ట్ర కార్యదర్శి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకన్న, ఏఐకెఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి హంసారెడ్డి, ఏఐకెఎఫ్ రాష్ట్ర నాయకుడు కొమురయ్య తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
కేంద్ర సహాయాన్ని ఉపయోగించుకోవడంలో విఫలం
* అభివృద్ధి కార్యక్రమాలు పట్టించుకోని కార్పొరేషన్ పాలకవర్గం
* బిజెపి నేత డాక్టర్ రాజేశ్వర్‌రావు విమర్శ

వరంగల్, మార్చి 26: తెలంగాణలో హైదరాబాద్ తరువాత పెద్దనగరమైన వరంగల్ అభివృద్ధి కోసం కేంద్రప్రభుత్వం అందించే సహకారాన్ని ఉపయోగించుకోవటంలో రాష్ట్రప్రభుత్వం విఫలమయిందని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మేయర్ డాక్టర్ రాజేశ్వర్‌రావు ఆరోపించారు. నగరపాలక సంస్థ అధికారులు, పాలకవర్గ సభ్యులు కేంద్రం నిధులను సక్రమంగా వినియోగించుకోవటంలో శ్రద్ధ చూపటం లేదని అన్నారు. ఆదివారం ఇక్కడ ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు నగర సమగ్రాభివృద్ధికి సంబంధించిన డిపిఆర్‌ను రూపొందించటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. నగరాభివృద్ధికి సంబంధించి ఇప్పటివరకు నిర్ధిష్ట ప్రణాళిక లేదని, 1971నాటి మాస్టర్ ప్లాన్‌నే ఇప్పటికీ అమలు చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ఏర్పడి మూడేళ్లు కావస్తున్నా వరంగల్ అభివృద్ధిలో పురోగతి లేదని అన్నారు. ఎల్‌ఆర్‌ఎస్, బిఆర్‌ఎస్ ప్రవేశపెట్టడం కేవలం సర్కారు లబ్ధికోసమేనని, సామాన్య ప్రజల కోసం కాదని చెప్పారు. ఎల్‌ఆర్‌ఎస్, బిఆర్‌ఎస్ స్కీంల ద్వారా స్థలాలను, నిర్మాణాలను ఏకకాలంలో రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేసారు. జిఓ నెం. 58,59 ద్వారా స్వీకరించిన దరఖాస్తులలో అక్రమాలు జరిగాయని, ప్రభుత్వానికి చెందిన కోట్లాది రూపాయల విలువచేసే స్థలాలను బడాబాబులు కాజేసారని ఆరోపించారు. వరంగల్ నగర అభివృద్ధిపై అధికారులకు ఎటువంటి పట్టింపు లేదని, నగరంలో సుమారు 30వేల ఇళ్ల నిర్మాణలు అనుమతి లేకుండా జరిగాయని, కానీ వీటి విషయంలో పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విలేఖరుల సమావేశంలో పార్టీ నాయకులు రామలింగం, రావుల కిషన్, శేషగిరిరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

కంఠమహేశ్వరస్వామి, నాగేంద్రస్వామిని...
దర్శించుకున్న ఇనగాల వెంకట్రాంరెడ్డి
* సౌకర్యాలపై కలెక్టర్ దృష్టికి తీసుక వెళ్లా
* పరకాల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఇనగాల వెంకట్రాంరెడ్డి
పరకాల, మార్చి 26: పరకాల మండలంలోని మాదారం సీతారాంపురం గౌడ తాళ్లలోని కంఠమేశ్వరస్వామి, స్వయంభువుగా వెలిసిన నాగేంద్రస్వామిని ఆదివారం పరకాల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ఇనగాల వెంకట్రాంరెడ్డి దర్శించుకున్నారు. తాళ్లలో వెలిసిన నాగేంద్రస్వామి వద్దకు వచ్చే భక్తులకు ఎటువంటి సౌకర్యాలు లేవని గౌడ సంఘం పెద్దలు ఇనగాల దృష్టికి తీసుక వెళ్లారు.
ఈ సందర్భంగా ఇనగాల వెంకట్రాంరెడ్డి వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ దృష్టికి తీసుక వెళ్లగా స్పందించిన కలెక్టర్ వీటికి సంబందించి అధికారి చేత ప్రతిపాదనలు ఇవ్వాలని కోరగా ప్రతిపాదనలు కలెక్టర్‌కు అందచేసినట్లు తెలిపారు. ఏప్రిల్ మొదటి వారంలో మంజూరు చేస్తామని కలెక్టర్ హామినిచ్చినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పరకాల కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు క్రిష్ణయ్య, పసుల రమేష్, నాగరాజు, మడికొండ శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, కొయ్యడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.