వరంగల్

సిఎం హామీలు నీటి మూటలేనా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, మార్చి 27: ఎన్నికల సందర్భంగా సిఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని నిరసిస్తూ సిపిఐ ఆందోళనకు దిగింది. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రభుత్వం ఏర్పాటై దాదాపు మూడు సంవత్సరాలు కావోస్తున్న ఇచ్చిన హామీలు ఏఒక్కటి కూడ అమలు చేయలేదంటూ సోమవారం మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ముట్టడికి సిపిఐ పిలుపునిచ్చింది. పట్టణంలోని స్థానిక పార్టీ కార్యాలయం వీరభవన్ నుండి భారీ ప్రదర్శనతో వెళ్లి కలెక్టరేట్‌ను ముట్టడించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున మోహరించారు. ఆందోళన కారులు గేటును నెట్టుకొని కలెక్టరేట్ హాల్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఈసందర్భంగా ఇరువర్గాల మద్య తోపులాట, ఉద్రిక్తత పరిస్ధితులు నెలకొన్నాయి. ఒక దశలో పోలీసులు ఆందోళన కారులపై చేయి చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, సిపిఐ శ్రేణుల మద్య తోపులాట, వాగ్వివాదం జరిగింది. పెద్ద ఎత్తున నినాదాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారధి మాట్లాడుతూ.. కెసిఆర్ ఎన్నికల సందర్భంగా, అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామిలను తన మూడు సంవత్సరాల పాలనలో అమలుచేయలేదని అన్నారు. దళిత, గిరిజనులకు మూడెకరాల భూపంపిణీ, అర్హులైన నిరుపేదలందరికి డబుల్‌బెడ్‌రూం ఇండ్లు ఇవ్వడంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. 58జీవో ప్రకారం ఇండ్ల పట్టాలు లేనివారికి ఇంత వరకు పట్టాలు ఇవ్వకపోవడంలో రాష్ట్ర ప్రభుత్వ ఆంతార్యం ఎంటని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసి యువతి, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. హరితహారం పేరుతో 40సంవత్సరాలుగా సాగుచేసుకుంటున్న రైతుల భూములకు పట్టాలు ఇవ్వకుండా వారి భూములపై ఫారెస్ట్ అధికారులతో దాడులు చెయించి లాక్కొవడం సిగ్గుచేటన్నారు. మహబూబాబాద్ పట్టణ ప్రజల త్రాగునీటి కోసం ఎస్సారెస్పీ జలాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు సబ్సిడి రుణాలు అందించాలని బ్యాంక్ కన్సల్ట్‌లేటర్ లేకుండా ఋణాలు ఇవ్వాలని అన్నారు. గార్లలో బైరటీస్ ప్రరిశ్రమ ఏర్పాటు చేయాలన్నారు. కెసిఆర్ ప్రజలకు, రైతులకు ఇచ్చిన హామిలు అమలు చేయకపోగా ఆకలి బాధతో ఆందోళన చేస్తే అణిచివేయడం కెసిఆర్ నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతుసంఘం అధ్యక్షులు తమ్మెర విశే్వశ్వర్‌రావు మాట్లాడుతూ.. అరుగాలం కష్టపడి మిర్చి పంటను అప్పుచేసి పండిస్తే రైతులకు కనీస మద్ధతు ధర ఇవ్వకపోవడం దారుణమన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టి, ఋణాలు ఇచ్చి రైతన్నలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అన్నం పెట్టే ఆదుకోకపోవడం పట్ల టిఆర్‌ఎస్ ప్రభుత్వం యొక్క రైతు వ్యతిరేఖ విధానాలను తిప్పికోట్టాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు సూచించారు. ఈ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బి.అజయ్, నల్లు సుధాకర్‌రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు, కౌన్సిల్ సభ్యులు, మండల కార్యదర్శులు కట్లోజు పాండురంగాచారి, వరిపెల్లి వెంకన్న, తోట బిక్షపతి, మహిబూబ్‌రెడ్డి, సురేంద్రకుమార్, పెరుగు కుమార్, రేషపల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధికి కృషి
కలెక్టర్ ఆకునూరి మురళి
ఏటూరునాగారం, మార్చి 27: జయశంకర్ జిల్లాలోని మారుమూల గ్రామాలు సైతం అభివృద్దిచెందేలా అధికారులు కృషిచేయాలని కలెక్టర్ ఆకునూరి మురళి అధికారులను ఆదేశించారు. సోమవారం స్ధానిక ఐటిడిఎ కార్యాలయంలో తహశీల్దార్‌లు, మండల అభివృద్ది అధికారులు, ఐసిడిఎస్, అగ్రికల్చర్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ... ఏజన్సీ ప్రాంతాలలోని ఎస్సి, ఎస్టీలకు గొర్రెల రుణాలను అందించి వారి అభివృద్దికి సహకరించాలని పశు సంవర్ధకశాఖ అధికారి పరంజ్యోతిని ఆదేశించారు. మరుగుదొడ్లను 100% త్వరితగతిన పూర్తిచేయాలని, అలసత్వం చేయవద్దని అధికారులను హెచ్చరించారు. డబుల్‌బెడ్‌రూం నిర్మాణాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయిందా అని ములుగు సబ్ కలెక్టర్ గౌతమ్‌ను అడిగారు. ఏటూరునాగారంలో డబుల్ బెడ్‌రూం లబ్దిదారులను ఎంపిక చేశారా అని అడుగగా, స్ధానిక తహశీల్దార్ సహకరించడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళారు. ప్రభుత్వం ఇంటింటికి నల్లాల ద్వారా నీరందించేలా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మిషన్ భగీరధ’ పనులు డిసెంబర్ నాటికల్లా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. డబుల్ బెడ్‌రూం నిర్మాణాలలో నాణ్యతా ప్రమాణాలు పాటించి, పనులను వేగవంతం చేయాలని డిఈఈ మల్లయ్యను ఆదేశించారు. కార్యక్రమంలో ఐటిడిఎ ఎపిఒ వసంతరావు, ములుగు సబ్ కలెక్టర్ గౌతమ్, తదితరులు పాల్గొన్నారు.

ప్రజాసమస్యలు పరిష్కరించాలి
జనగామ కలెక్టరేట్ ఎదుట సిపిఐ ధర్నా
జనగామ టౌన్, మార్చి 27: ప్రజాసమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం జనగామ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, నాయకులు కలెక్టర్ శ్రీదేవసేనకు వినతిపత్రం అందజేశారు. సిపిఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సుమారు 400మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో గేటు ఎదుటనే బైఠాయించి నిరసన తెలిపారు. కలెక్టర్ శ్రీదేవసేన ఆదేశంతో పోలీసులు అందులో కొంతమంది నాయకులను కార్యాలయంలోకి అనుమతించారు. వారు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు.
అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి సిహెచ్. రాజారెడ్డి కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు.ప్రభుత్వం సంక్షేమ పథకాల్ని ప్రకటించడం వరకే పరిమితమవుతు అమలులో శ్రద్ద వహించడం లేదని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా దళితులకు ఇస్తానన్న మూడెకరాల భూమి ఏమైందని ప్రశ్నించారు. పేదలందరికి డబుల్ బెడ్‌రూంలు నిర్మిస్తామని చెప్పిన మాటలు రెండున్నరేండ్లు దాటిన అమలుకావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ లబ్దిదారులకు బిల్లులు మంజూరీ చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
సమగ్ర సర్వే పేరుతో రద్దుచేసిన ఆన్‌లైన్ పేర్లతో రేషన్ సరుకులు తీసుకోవడంలో లబ్దిదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారికి వెంటనే రేషన్ కార్డులు ముద్రించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దివ్యాంగులకు అంత్యోదయ కార్డుల మంజూరీ చేయాలని కోరారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను యుద్ద ప్రతిపాదికన పూర్తి చేసి రైతులకు సాగునీరందించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణాల్లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు 2013 కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం నష్టపరిహారం అందజేయాలన్నారు. సాదాబైనామా కోసం ధరఖాస్తు చేసుకున్న రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు టి.సత్యం, బర్ల శ్రీరామలు, పాతూరి సుగుణమ్మ, పట్టణ, మండల కార్యదర్శులు మంగళంపల్లి జనార్ధన్, దూడల పాండు, నాయకులు తూడి అంజయ్య, ఆకుల శ్రీనివాస్, వైకుంఠం, లక్ష్మీనారాయణ, కృష్ణ, స్వామి, రామచంద్రం, జాఫర్, పరశురాములు, పెద్ది యాదగిరిగౌడ్, చల్ల శశిరేక, నిర్మల, రావుల సదానందం, అయిలయ్యలు పాల్గొన్నారు.

గ్రీవెన్స్ సెల్‌కు ఫిర్యాదుల వెల్లువ
* కలెక్టర్‌కు సమస్యల ఏకరువు
* స్పందించిన కలెక్టర్ ప్రీతిమీనా
* క్షేత్రస్థాయిలో సమీక్షించి
పరిష్కరించాలని అధికారులకు ఆదేశం

మహబూబాబాద్,మార్చి 27: గ్రీవెన్స్‌సెల్‌కు పిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రజలు వారివారి సమస్యలను కలెక్టర్‌కు వివరించేందుకు పెద్ద ఎత్తున కలెక్టరేట్‌కు చేరుకున్నారు. సోమవారం గ్రీవెన్స్ సెల్‌లో భాగంగా ప్రజల నుండి పిర్యాదులు తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే వినతులను వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో సమీక్షించి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా ఆదేశించారు. పిర్యాదులు నమోదు చేయడానికి వచ్చిన అర్జీదారులను దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల విజ్ఞప్తులను సంయమనంతో పరిశీలించి క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించుటకు కృషిచేయాల్సిన బాధ్యత ప్రతి అధికారిపై ఉందన్నారు. జిల్లాలో వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా వచ్చే రెండు మాసాలకు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కోరారు. మండల ప్రత్యేక అధికారులు ప్రత్యేక చొరువ తీసుకొని గ్రామాల్లో తాగునీటి సమస్యలు ఎర్పడకుండా చర్యలు చెపట్టాలని అన్నారు. గ్రామాల్లో బోర్‌వెల్స్ ద్వారా ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేయాల్సిందిగా ఆదేశించారు. వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ప్రజల్లో అవగాహన కల్పించి ఎండ దెబ్బ తగలకుండా పాటించాల్సిన సూచనలు జారీ చేయాలని ఆదేశించారు. వచ్చే సోమవారం నుండి ప్రతి అధికారి, ఉద్యోగి తప్పకుండా చేనేత వస్తమ్రులు ధరించాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు ప్రతి బుధవారం మండలాల్లో పర్యటించి అంగన్‌వాడీ సెంటర్లు, ప్రభుత్వ వసతి గృహాలు, తాగునీటి సరఫరాపై పర్యవేక్షించి సమస్యలు ఉన్నచో నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో పన్నుల వసూళ్లు వేగిరం చేయుటకు తగు చర్యలు చెపడుతూ ప్రతి రోజు పన్నుల వసూళ్లను పర్యవేక్షించాలని జిల్లా గ్రామపంచాయితీ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. సోమవారం జరిగిన ప్రజావాణిలో 290్ధరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ పేర్కొన్నారు. వీటిలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని అధికంగా ధరఖాస్తులు రాగా, ఆసరా పెన్షన్లు, సదరన్ సర్ట్ఫికెట్లు, భూకబ్జాల పరిష్కారం కొరకు, ఎస్సీ, ఎస్టీలకు ఋణ మంజూరి, విద్యాఋణం మంజూరి, డబుల్‌బెడ్‌రూం మంజూరు చేయాలని విన్నపాలు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. కోర్టులో ఉన్న సమస్యలు తప్ప మిగతా వినతులను సంబంధిత శాఖల అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో జేసి దామోదర్‌రెడ్డి, డిఆర్‌ఓ రాంబాబు పాల్గొన్నారు.

పాలనా సౌలభ్యం కోసమే
చిన్న రాష్ట్రాలు

* అంబేద్కర్ వర్సిటీ విసి ప్రొఫెసర్ సీతారాం రావు
నక్కలగుట్ట,మార్చి 27:ప్రజలకు సేవ చేయడం ప్రభుత్వ బాధ్యత అని, వారికి మరింత సేవ చేయడం కోసం, పాలనా సౌలభ్యానికి చిన్న రాష్ట్రాల అవసరం ఉందని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ సీతారాంరావు అన్నారు. సోమవారం లాల్‌బహదూర్ కళాశాలలో ప్రభుత్వ పాలనా శాస్త్ర విభాగం అధ్వర్యంలో చిన్న రాష్ట్రాల ఆవశ్యకత సవాళ్లు అనే అంశంపై జాతీయ సదస్సు ప్రారంభమైనది. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సత్యపరమేశ్వర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీతారాంరావుమాట్లాడుతూ దేశంలో ఎప్పటినుండో చిన్న రాష్ట్రాలపై చర్చ జరిగిందని, పాలనా సౌలభ్యం కోసం అవసరమని తేల్చి చెప్పారని గుర్తుచేశారు. ఆ దిశలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు. రాష్ట్రంలోని 10 జిల్లాలను 31 జిల్లాలుగా మార్చడం కూడా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికే అని తెలిపారు. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే అభివృద్ది త్వరితగతిన జరుగుతుందని అన్నారు. మరో అతిథిగా హాజరైన శాతవాహన విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్స్‌లర్ ఇక్బాల్ అలీ మాట్లాడుతూ మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామసామ్రాజ్యం రావాలంటే చిన్న రాష్ట్రాలతోనే సాధ్యం అవుతుందని వివరించారు. ప్రభుత్వ పాలనలో జవాబుదారి తనం ఉండాలని అన్నారు. అవినీతి నిర్మూలన జరిగి, ప్రభుత్వ పథకాలు సక్రమంగా సామాన్యులకు చేరిన నాడే అభివృద్ది సాధ్యం అవుతుందని తెలిపారు. అభివృద్ది వేగంగా జరగాలంటే ఐదు లక్షల జనాభా నుండి ఎనిమిది లక్షల జనాభా ఉంటే అధికారులకు సులభంగా ఉంటుందని వివరించారు. సెమినార్ డైరెక్టర్ డాక్టర్ రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొని ఉన్న సమస్యపై విద్యార్థులకు, సమాజంలోని ప్రజలకు అవగాహన కలిగించాలనే ఉద్దేశ్యంతోనే ఈ జాతీయ సెమినార్‌ను ఏర్పాటు చేశామని అన్నారు. ఈ సదస్సుకు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్‌కందా తన పరిశోధనా పత్రాన్ని ఇ మెయిల్ ద్వారా సమర్పించారు.

సామాజిక వైద్యశాల తనిఖీ
* సర్కారీ వైద్యంపై రోగుల వద్ద
వివరాలు సేకరించిన సబ్ కలెక్టర్
ఏటూరునాగారం, మార్చి 27: మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక వైద్యశాలను ములుగు సబ్ కలెక్టర్ విపి గౌతమ్ సోమవారం అకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా సాధారణ ఆటోలో మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన ఆటోలో సామాజిక వైద్యశాలకు తరలివెళ్ళారు. వైద్యశాలలోని ఓపి, చిన్నపిల్లల వార్డు, జనరల్‌వార్డు, ప్రసూతి గదులను పరిశీలించారు. వైద్యశాలలోని మరుగుదొడ్లు, మూత్రశాలలు శుభ్రంగా ఉన్నాయా అని పరిశీలించారు. అనంతరం రోగులతో మాట్లాడిన ఆయన సర్కారీ వైద్యులు రోగుల పట్ల ఎలా ఉంటున్నారు, చికిత్స ఏవిధంగా అందిస్తున్నారని వివరాలు అడిగారు. ఆస్పత్రికి ఎక్కువగా ఎలాంటి కేసులు వస్తుంటాయని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సాధారణ డెలివరీలు జరుగుతున్నాయా అని వైద్యులను అడిగారు. రోగులకు మెనూ ప్రకారం భోజన సదుపాయం అందుతోందా అని ఆరా తీశారు. ఆపరేషన్, ఐసియు గదుల నిర్మాణాలను పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యశాల సూపరిండెంట్ డాఅపర్ణ, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.