వరంగల్

వాస్తవాలను వక్రీకరిస్తున్న కేసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడ్డేపల్లి,మార్చి 28:తెలంగాణ రాష్ట్ర పనితీరుపై గడిచిన మూడేళ్లలో జరిగిన పథకాల అమలుపై కాగ్ నివేదికతో ప్రభుత్వం బండారం బట్టబయలు అయిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం బాలసముద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశం జరిగింది. 2014 సంవత్సరంలో ప్రభుత్వం ఏర్పడినపుడు 15వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉందని, అది నేడు కాస్త అప్పుల బడ్జెట్ మారిందని తెలిపారు. ముఖ్యమంత్రి అనాలోచిత పనుల వలన రాష్ట్రంలో ఆదాయ వనరులు తగ్గిపోయాయని మండిపడ్డారు. ప్రభుత్వ, ప్రజల సొమ్మును చట్ట సభల ఆమోదం లేకుండా, రాజ్యాంగానికి విరుద్దంగా ఖర్చు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరిపాలన విషయంలో ఎవరి సలహాలు, సంప్రదింపులు లేకుండ, ఒంటెద్దు పోకడలతో పరిపాలన కొనసాగించడం అనైతికం అని అన్నారు. పథకాలు, ప్రాజెక్టులలో నిధుల కేటాయింపులను భారీగా చూపిస్తూ, ఖర్చుల విషయంలో 50శాతం కూడా నిధులు ఖర్చు చేయలేని అసమర్థ ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ప్రజా సంక్షేమం కోసం చేసిన అప్పులను తీర్చడానికి ప్రభుత్వం మళ్లీ అప్పులు చేయడంలో అర్థం లేదని అన్నారు. రాష్ట్ర ఆదాయాన్ని దుబారాగా ఖర్చు చేసి అప్పులు చేయడంలో రాష్ట్రంలో దేశంలోనే ప్రధమస్థానంలో ఉందని వివరించారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలలో గుత్తేదారులకే లాభం చేకూర్చేలా ప్రభుత్వ పనితీరు ఉందని, పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రం అభివృద్దిలో వెనుకబడి ఉందని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చట్టాలను చుట్టాలుగా మార్చుకుని పాలన కొనసాగిస్తూ భూముల, ఇసుక, అటవీ మాఫీయాలను ప్రొత్సహిస్తుందని ఆక్రోశం వెళ్లగక్కారు. అవినీతి, అక్రమాలకు అధిపతిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కొనసాగుతూ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని మండిపడ్డారు.

గ్రామ స్థాయ సమస్యల పరిష్కారానికి చర్యలు
కలెక్టర్ మురళి
పరకాల, మార్చి 28: గ్రామ స్థాయిలో సమస్యలను గుర్తించి పరిష్కార దిశగా చర్యలు చేపట్టేందుకు అదర్శ కార్యకర్తలను నియమించనున్నట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మురళి అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో తహశీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఆర్‌డబ్ల్యుఎస్ అసిస్టెంట్ ఇంజనీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మురళి మాట్లాడుతూ గ్రామ స్థాయి సమస్యలను ఉన్నతాధికారులకు తెలియ చేసి వాటిని పరిష్కరించేందుకు గ్రామ స్థాయిలో నోడల్ అధికారి అవసరమన్నారు. ఇందుకు గ్రామంలోనే ఉంటూ గ్రామ సమస్యలపై అవగాహన, గ్రామాన్ని అభివృద్థి పరచాలనే తపన ఉన్న ఒక ప్రభుత్వ ఉద్యోగి అవసరమని ప్రభుత్వం భావించిందన్నారు. గ్రామ స్థాయిలో అదర్శ కార్యకర్తలను ప్రభుత్వం నియమించాలని నిర్ణయించిందని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అయా గ్రామాలలో పని చేసే విఆర్‌ఎలు, అంగన్‌వాడి టీచర్లు, ఉపాధి హామి ఫీల్డ్ అసిస్టెంట్స్, సాక్షరభారత్ గ్రామ సమన్వయ కర్త, ఐకెపి, విఓలు, సిఏ, కారొబోర్, ఉపాధ్యాయుడు, బిపిఎంతో ఒకరిని అదర్శ కార్యకర్తగా మండల స్థాయి అధికారుల బృందం ఎంపిక చేయాలన్నారు. అదర్శ కార్యకర్తగా ఎంపికైనా వారు వారి గ్రామంలో సమస్యలను గుర్తించి పై స్థాయి అధికారుల దృష్టికి తీసుక రావాలన్నారు. రానున్న రెండు, మూడు నెలలో త్రాగునీరు ఎద్దడి రాకుండా త్రాగునీరు వేసవి ప్రణాళిక సిద్దం చేసి నీటి ట్యాంకులను, పైప్‌లైన్‌లకు అవసరమైన మరమ్మత్తులు చేసి నీరు అందించాలన్నారు. గ్రామంలో త్రాగునీరు వనరులు అందుబాటులో లేనప్పుడు మాత్రమే ఇతర ప్రాంతాల నుండి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. నిజమైన పేద వారికే లబ్దిచేకూరేలా డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్దిదారుల ఎంపికను తహశీల్దార్లు పరిశీలించి ఎంపిక ప్రక్రియను చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డిఓ వీరబ్రాహ్మచారి, ఆర్‌డబ్ల్యుఎస్ ఇఇ నిర్మల, డిపిఓ చంద్రవౌళి తదితరులు పాల్గొన్నారు.