వరంగల్

గడువులోగా పూర్తిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్,మార్చి 28: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెపట్టిన మిషన్‌భగీరధ పనులను గడువులోగా పూర్తిచేయడానికి నిర్ధిష్ట కార్యాచరణ ప్రణాళికలు రచించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మిషన్ భగీరధ, గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో కలెక్టర్ అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సమీక్షిస్తూ జిల్లాలో మొదటి విడుతలో జిల్లాలోని మరిపెడ, చిన్నగూడురు, దంతాలపల్లి, నర్సింహులపేట, నెల్లికుదురు, తొర్రూరు, పెద్దవంగరలకు జూన్ 30నాటికి ఇంటింటికి నల్లాల ద్వారా మంచినీటిని అందించేందుకు యుద్దప్రతిపాదికన చర్యలు చెపట్టాలని ఆదేశించారు. మొదటి విడుతలో నీరందించనున్న గ్రామాలకు ఓహెచ్‌ఎస్‌ఆర్‌లు నిర్మించుటకు మేన్ పైపు నుండి గ్రామాలకు పైప్‌లైన్లు వేయుటకు సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ గడువులోగా కాంట్రాక్టర్లతో పనులు చేయించాలని ఆదేశించారు. జిల్లాలో వచ్చే 2033సంవత్సరానికి సరిపడు ఓహెచ్‌ఎస్‌ఆర్‌లు, 2048సంవత్సరంలో సరిపడు సామర్ధ్యం గల పైపులైన్లకు గ్రామీణ ప్రాంతాల్లో పాయింట్‌కు 8శాతం వృద్ధితో, అర్బన్ ప్రాంతాల్లో 2శాతం వృద్ధితో చేపట్టాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఎఈలు నాణ్యతతో కూడిన పనులు జరిగేలా చిత్తశుద్ధితో పర్యవేక్షించాలని అన్నారు. ఓహెచ్‌ఎస్‌ఆర్ పనులు చేసే కాంట్రాక్టర్ల వివరాలు, జరుగుతున్న పనుల వివరాలు సత్వరమే సమర్పించాల్సిందిగా ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈని ఆదేశించారు. మిషన్ భగీరధ పనులు మే 31నాటికి పూర్తిచేసి ట్రయిల్న్ జరుపాలని, కెనాల్, బ్రిడ్జి, రైల్వేక్రాసింగ్, హైవే వద్ద మిగిలి ఉన్న గ్యాపులను పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మిషన్ భగీరధ, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈలు రాములు, రవికుమార్, డిఈలు, జెఇలు, ఎఇలు తదితరులు పాల్గొన్నారు.