వరంగల్

మార్కెట్లలో నిలచిపోయిన కొనుగోళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఏప్రిల్ 4: సమస్యల పరిష్కారం కోసం గడచిన ఆరురోజుల నుంచి లారీల యజమానులు సమ్మెకు దిగిన కారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో లారీలు రోడ్డుపైకి ఎక్కకపోవటంతో రైతులు లబోదిబో అంటున్నారు. లారీల సమ్మె కారణంగా వ్యాపారులు కొనుగోలు చేసిన ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు తరలించే అవకాశం లేకపోవటంతో రైతుల నుంచి వివిధ ఉత్పత్తుల కొనుగోళ్లను సోమవారం నుంచి నిలిపివేసారు. సమ్మె ఇంకా ఎన్నిరోజులు కొనసాగుతుందో తెలియని పరిస్థితుల్లో తమ ఉత్పత్తులు కొనే నాథుడు లేక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రసుత సమయంలో వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్డుకు మిర్చి, పత్తి, కందులు, ధాన్యం బస్తాలు వేల సంఖ్యలో రావటం మామూలు వ్యవహారమే. కానీ ఆరురోజుల నుంచి సమ్మె కారణంగా జిల్లాలోని లారీలు, ఇతర ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు మూడువేల లారీలు, ఇతర భారీ వాహనాలు సమ్మెలో పాల్గొంటున్నట్లు లారీ యజమానుల సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. జిల్లాకు చెందిన లారీలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన లారీలు కూడా సమ్మె కారణంగా ఇక్కడే నిలచిపోయాయి. వాహనాలు ముందుకు కదిలే పరిస్థితి లేకపోవటంతో ఇతర ప్రాంతాల వాహనాలకు సంబంధించి డ్రైవర్లు, క్లీనర్లు, ఇతర సిబ్బంది లారీల వద్దే పడిగాపులు కాస్తున్నారు. అక్కడే వంటలు, అక్కడే నిద్ర అనే పరిస్థితి కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్డుతోపాటు జిల్లాలోని పలు మార్కెట్‌లలో రైతుల నుంచి కొనుగోలు చేసిన వివిధ ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు వ్యాపారులకు అవకాశం లేకుండా పోయింది. కోల్డ్‌స్టోరేజీలు, ఇతర గోదాములు నిండిపోవటంతో చేసేది ఏమీలేక వ్యాపారులు రైతుల ఉత్పత్తులు కొనుగోలు చేయలేమని చేతులు ఎత్తివేయటంతో ఏనుమాముల మార్కెట్ యార్డులో సోమవారం నుంచి రైతుల ఉత్పత్తుల కొనుగోళ్లు నిలిపి వేస్తున్నామని మార్కెట్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. తెలిసో, తెలియకో కొందరు రైతులు కళ్లాల నుంచి, ఇళ్లనుంచి మిర్చి, పత్తి తదితర ఉత్పత్తులను రెండురోజులుగా మినీ వాహనాల ద్వారా మార్కెట్‌కు తీసుకువస్తు కొనుగోళ్లు జరగటం లేదని తెలిసి నిరాశకు గురవుతున్నారు. ఇదే అదునుగా కొందరు ప్రైవేటు వ్యక్తులు తక్కువ ధరకు మిర్చి, పత్తి తదితర పంటలను కొనుగోళ్లు చేస్తున్నారు. వేల రూపాయలు చెల్లించి పంటను మార్కెట్‌కు తీసుకువస్తే కొనుగోళ్లు లేని కారణంగా మళ్లీ పంటను వెనక్కి తీసుకోపోలేని పరిస్థితని, ఈ కారణంగా ధర తక్కువ అయినా పంటను అమ్ముకుని వెళ్లిపోతున్నామని కొందరు రైతులు తెలిపారు. రైతు సంఘాలు మాత్రం లారీల సమ్మె కారణంగా మార్కెట్లలో లావాదేవీలు నిలిపివేయటం సమంజసం కాదని చెబుతున్నాయి. మార్కెట్ కమిటీలు, వ్యాపారులు రైతుల విషయంలో పెద్దమనసుతో వ్యవహరించాలని, ఏనుమాముల మార్కెట్ యార్డులో రైతుల ఉత్పత్తులను నిలువ చేసేందుకు భారీ షెడ్లు అందుబాటులో ఉన్న విషయాన్ని గుర్తుచేసారు. మార్కెట్‌లో కొనుగోళ్లు నిలిపివేయటం వల్ల మధ్య దళారులు రంగప్రవేశం చేసి తక్కువ ధరలకు ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు.