వరంగల్

విద్యారంగానికి పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఏప్రిల్ 5: రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థ పటిష్టతకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఉపాధ్యాయులు పందా మార్చుకొని నిబద్ధతతో పని చేయాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలాల వారీగా పాఠశాలల సమగ్ర సమాచారాన్ని రూపొందించాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో టీచర్ల సంఖ్య వౌళిక సదుపాయాల స్థితిగతులను పరిగణలోకి తీసుకుంటూ సమగ్ర సమాచారంతో పాఠశాల ప్రొఫైల్‌ను రూపొందించాలన్నారు. ప్రతి పాఠశాలలో బాలికలకు ప్రత్యేక టాయిలెట్లు, నీటి సదుపాయం, బ్యాటరీ ఆఫ్ ట్యాబ్స్, వంట గదులు, విద్యుత్ సరఫరా, కాంపౌండ్‌వాల్, ఫర్నిచర్ తదితర సమగ్ర వివరాలను పాఠశాల ప్రొఫైల్‌లో పొందుపర్చాలన్నారు. ఇట్టి ప్రొఫైల్‌ను ఈ నెల 15వ తేదీ లోగా పూర్తి చేయాలని, ప్రొఫైల్ ఆధారంగా బడ్జెట్‌ను మంజూరు చేయించుకొని జిల్లాలో మెరుగైన విద్యను అందించాలన్నారు. జిల్లాస్థాయి అధికారులు జిల్లా హెడ్‌క్వార్టర్లలో ఉండాలని, విధుల్లో అలసత్వం, నిర్లక్ష్యం వీడి విద్యారంగ పటిష్టానికి అందరూ సహకరించాలని కోరారు. పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలో ఈ ఏడాది జూన్ 30వ తేదీ నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మాధ్యమం ప్రవేశపెట్టనున్నామని, ఇందుకు అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలని కోరారు. ఇంగ్లీష్ మీడియం పాఠశాలలకు అవసరమైన సదుపాయాలను, తలెత్తే సమస్యలను సూక్ష్మ స్థాయిలో అధ్యాయనం చేసి కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. అదే విధంగా ప్రతి మండలంలో ప్రతి పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయనున్నామని, ఇందుకు పాఠశాలలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఉన్నత పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులకు కంప్యూటర్ విద్యను ప్రవేశపెట్టాలని, ఇందుకు అవసరమైన ఫ్యాకల్టీ, కంప్యూటర్లు, ఏసి, తదితర సౌకర్యాలతో ప్రణాళికరూపొందించాలని తెలిపారు. జిల్లా అక్షరాస్యతలో వెనుకబడి ఉందని సంపూర్ణ అక్షరాస్యతకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో పుస్తకాలు, ఉచిత మధ్యాహ్న భోజనం, నైపుణ్యత కలిగిన అధ్యాపకులు ఉన్నప్పటికి ప్రవేశాల సంఖ్య తక్కువ ఉంటుందని, టీచర్లు, హెడ్‌మాస్టర్లు, ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకొని ప్రజల్లో ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా పాఠశాల అధ్యాపకులు, హెడ్‌మాస్టర్లు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విధంగా వినూత్న చర్యలు చేపట్టాలని కోరారు. పరకాల మండలం వరికోల్ గ్రామంలో ప్రతి ఒక్కరు ప్రభుత్వపాఠశాలల్లోనే విద్యను అభ్యసిస్తున్నారని, పాఠశాల విద్యపట్ల ప్రజల నమ్మకాన్ని గెలిపించుకున్నారని, అట్టి పాఠశాల అవలంభిస్తున్న కార్యక్రమాలను ఇతర గ్రామాలకు విస్తరించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలు పెంచి నాణ్యమైన విద్యను అందించాలని, ఇందుకు ప్రతి ఒక్కరు తమవంతు సహకారాన్ని అందించి విద్యారంగంలో జిల్లాను మొదటి స్థానంకు వచ్చే విధంగా కృషి చేయాలని కోరారు. జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోని వౌలిక సదుపాయాలపై ఇప్పటికే నివేదిక రూపొందించామని తెలిపారు. జిల్లాలో దాదాపు 7లక్షలకు పైగా నిరక్షరాస్యులు ఉన్నారని, సంపూర్ణ అక్షరాస్యతకు జిల్లాలో 10వేల మంది మహిళా సంఘ సభ్యులను గుర్తించామని, అదే విధంగా మరో 30వేల మంది వలంటీర్లను గుర్తించడం జరిగిందని తెలిపారు. ఆర్‌జెడిలు, స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్, హైయర్ ఎడ్యుకేషన్, డిఇఓ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.