వరంగల్

కెసిఆర్ కుటుంబానికే తెలంగాణ ఫలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, ఏప్రిల్ 9: తెలంగాణ రాష్ట్రం ఫలాలు ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంభానికే దక్కాయని, రాష్ట్రంలో సిఎం కెసిఆర్ కుటుంబ పాలన నడుస్తోందని టిడిపి జాతీయ కార్యదర్శి, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి విమర్శించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఆదివారం నర్సంపేటలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహం ఎదుట టిడిపి నాయకులు, కార్యకర్తలు ఒక రోజు దీక్షను చేపట్టారు. దీక్షలో టిడిపి రాష్ట్ర, జిల్లా నాయకులు పెద్ద సంఖ్యలో కూర్చున్నారు. ఈసందర్భంగా రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కెసిఆర్, కెటిఆర్, కవిత, హరీశ్‌రావుల కుటుంబ పాలన నడుస్తోందని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు తెలంగాణ సమాజానికి ఇచ్చిన హామీలైన రైతుల రుణమాఫీ, గిట్టుబాటు ధరలు, డబుల్ బెడ్ రూం, దళితులకు మూడు ఎకరాల సాగు భూమి, మైనార్టీలు, ఎస్టీలకు రిజర్వేషన్ల పెంపు, ఇంటికో ఉద్యోగం తదితర హామీలు అమలు చేయడంలో టిఆర్‌ఎస్ సర్కార్ విఫలం అయిందన్నారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడిచినా ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీని అమలు చేయలేదని వాపోయారు. ఎన్నికలు మరో రెండు సంవత్సరాలు ఉన్నా ప్రజలను మరో మారు మోసం చేసేందుకు అనువుగా ముఖ్యమంత్రి కెసిఆర్ సంవత్సరం ముందే ఎన్నికలకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నాడని అన్నారు. ఎన్నికల ముందు రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఐదు వేల కోట్ల రూపాయలతో ధరల స్థీరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఆ హామీని అమలు చేయకుండా మోసం చేశాడని వాపోయారు. గత రెండు నెలలుగా పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నా పట్టించుకునే నాధుడే లేడని, మంత్రులు, అధికార పార్టీ నాయకులు మార్కెట్‌లను సందర్శించిన దాఖలాలు లేవన్నారు. తాము సమస్యను నివేదించినా ఈ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని ధ్వజమెత్తారు. ఇదే సమయంలో పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు తమ పంట ఉత్పత్తులు తగులబెట్టుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మరో వైపు ఆత్మహత్యలు చేసుకోకుండా ప్రభుత్వం రైతాంగానిక భరోసా కల్పించడంలో విఫలం అయిందన్నారు. రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 21లక్షల మంది పక్కా ఇళ్లకు అర్హులు కాగా ప్రభుత్వం మాత్రం గడిచిన మూడేళ్లలో కేవలం 2750 డబుల్ బెడ్ రూం ఇళ్లను మాత్రమే కట్టించి చేతులు దులుపుకుందని అన్నారు. టిఆర్‌ఎస్‌కు మరో రెండేళ్ల గడువు మాత్రమే ఉందని, మిగిలిన ఇళ్లను ఎలా కడుతారో ఆపార్టీ నాయకులే ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. మిషన్ భగీరథకు 40వేల కోట్ల రూపాయలను కేటాయించారని, ఈ ప్రథకంలో భారీగా అవినీతి ఊట ఉందని ఆరోపించారు. విదేశాల్లో తన కుమార్తె బతుకమ్మ ఆడేందుకు సిఎం కెసిఆర్ పదిహేను కోట్ల రూపాయలను మంజూరు చేశారని చెప్పారు. అదే విధంగా 10 ఎకరాల్లో 110 గదులతో ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయాన్ని నిర్మించుకున్నారంటే ప్రజాధనం ఎలా దుర్వినియోగం అవుతుందో ప్రజలంతా గమనించాలని కోరారు. దళితులకు మూడు ఎకరాల సాగు భూమి ఓ బోగస్‌గా మారిందని దుయ్యబట్టారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన టిఆర్‌ఎస్‌కు రాబోయే రోజుల్లో ప్రజలంతా తగిన గుణపాఠం చెప్పాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు వేం నరేందర్ రెడ్డి, సీతక్క, ఈగ మల్లేశం, శ్రీనివాసాచారి, గట్టు ప్రసాదబాబు, గండ్ర సత్యనారాయణ, కొండా మధుసూధన్‌రెడ్డి, ఎర్ర యాకూబ్‌రెడ్డి, అజ్మీరా శ్రీనివాస్, వేముల బొందయ్య, మామిండ్ల మోహన్‌రెడ్డి, కొయ్యడి సంపత్, మహదేవుని రాజవీరు తదితరులు పాల్గొన్నారు.