వరంగల్

19న పాలకుర్తిలో సిఎం పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఏప్రిల్ 15: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈనెల 19న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ పర్యటనకు వస్తున్నారు. ఉదయం ప్రత్యేక హెలీక్యాప్టర్‌లో జనగామ జిల్లా పరిధిలోని పాలకుర్తికి చేరుకుంటున్న ముఖ్యమంత్రి అక్కడి పాలకుర్తి సోమేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు జరుపుతారు. అనంతరం విద్యుత్ సబ్‌స్టేషన్, డబుల్‌రోడ్డు నిర్మాణం తదితర అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. సమీపంలోని మహాకవి బమ్మెర పోతన సమాధిని సందర్శిస్తారు. జాతీయస్థాయిలో ఉత్తమ గ్రామంగా ఎంపికైన రాఘవాపూర్‌ను ఆయన సందర్శించి అక్కడి ప్రజలతో కొద్దిసేపు ముచ్చటిస్తారు. అనంతరం తిరిగి పాలకుర్తికి చేరుకుని మార్కెట్ యార్డులో అధికారులతో, ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. మధ్యాహ్న భోజనం అనంతరం దర్ధనపల్లి, మల్లంపల్లి, వావిలాల ద్వారా మహబూబాబాద్ జిల్లా పరిధిలోని తొర్రూరుకు చేరుకుంటారు. పార్టీ ప్లీనరీ, భారీ బహిరంగ సభల కోసం పార్టీ ప్రకటించిన గులాబీ కూలీ కార్యక్రమంలో భాగంగా తొర్రూరులో కూలీ పనిలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం అనంతరం హైదరాబాద్ వెళ్లిపోతారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం జనగామ, మహబూబాబాద్ జిల్లాల అధికార యంత్రాంగం, పార్టీ నాయకత్వం ఏర్పాట్లలో తలమునకలుగా ఉంది. ఈ కార్యక్రమం అంతా పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉండటంతో ఎమ్మెల్యే దయాకర్‌రావు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.

అణచివేతకు గురవుతున్న ఓసిలు
* ఉమ్మడి రాష్ట్రాల జెఎసి ఉపాధ్యక్షుడు రామారావు
గోవిందరావుపేట, ఏప్రిల్ 15: ఓటు రాజకీయాలతో తెలంగాణా, ఆంద్రాలో ఓసిలు అణిచివేతకు గురవుతూ అన్ని రంగాలలో నష్టపోతున్నారని ఉమ్మడి రాష్ట్రాల జెఎసి ఉపాధ్యక్షులు పొలాడి రామారావు అన్నారు. మండల కేంద్రంలో శనివారం ఓసి సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సన్నాహక సమావేశానికి రామారావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ధిక స్ధితిగతుల ఆధారంగా రిజర్వేషన్లను అమలు చేయక పోవడం వల్ల గత ఏడు దశాబ్దాలుగా విద్యా, వైద్య, ఉపాధి, సంక్షేమ రంగాలలో రిజర్వేషన్లు వర్తించక రెడ్డి, వెలమ, కమ్మ, వైశ్య, బ్రాహ్మాణ, మార్వాడి కులస్దులలోని నిరుపేదలకు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు, ఆదివాసీల రిజర్వేషన్లు 22శాతం నుండి 49.5శాతానికి పెరగగా ఓసిలలో 80శాతం మంది నిరుపేదలు అన్యాయానికి గురవుతున్నారని అన్నారు. 90శాతం మార్కులు వచ్చినా, ప్రతిభ ఉన్నా ఉద్యోగ, ఉపాధి దొరకక ఓసిలు అల్లాడిపోవాల్సిన దుస్ధితిని నేడు పాలకులు కల్పించారని ఆయన దుయ్యబట్టారు. వెయ్యికోట్లతో ఓసి కార్పోరేషన్ ఎర్పాటు చేయాలని, ప్రతియేటా బడ్జెట్‌లో ఓసిలకు ప్రత్యేక నిధిని ఎర్పాటు చేయాలని, స్వయం ఉపాధికి 80శాతం రాయితీపై బుణాలను అందించాలని, ప్రభుత్వ గురుకుల పాఠశాలలో, మోడల్, రెసిడెన్షియల్ 10శాతం ఓసి వర్గాలకు రిజర్వేషన్ కేటాయించాలని, ఓసి సామాజిక వర్గాలను దూషించిన వారిపై ఎసి అట్రాసిటి కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఓసిల సంక్షేమం కోసం ఈనెల 23న హాన్మకొండలో నిర్వహించ తలపెట్టిన ఓసిల కధనబేరి మహాగరన సభకు ఓసిలు తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. ఈసందర్భంగా కరపత్రాలు, పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో పలు ఓసి కులసంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులు కొలుగూరి రాజేశ్వర్‌రావు, కామిడి సతీష్‌రెడ్డి, యానాల వెంకటరెడ్డి, భూమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.