వరంగల్

దడ పుట్టిస్తున్న ఎండలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఏప్రిల్ 20: ఎండల తీవ్రత రోజురోజుకు మండిపోతుండటంతో వరంగల్ నగర ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 10గంటలకే రోడ్డుపైకి రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. తప్పనిసరి పనులు ఉంటేనే తప్ప జనం రోడ్లపైన తిరిగేందుకు ఇష్టపడటం లేదు. ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే వచ్చే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని బెంబేలెత్తిపోతున్నారు. మరో 50రోజుల ఎండాకాలం ఎలా గడుస్తుందోనని ఎదురు చూస్తున్నారు. ఈసారి వేసవికాలం ప్రారంభం నుంచే ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలో క్రమక్రమంగా పెరుగుతున్న ఎండలు జనాలకు దడపుట్టిస్తున్నాయి. ముఖ్యంగా గడచిన వారం రోజుల నుంచి వడగాలులతో ఎండలు కాస్తున్నాయి. దాంతో ప్రజలు ఉదయం పూటే రోడ్లపైకి రావటానికి జంకవలసిన పరిస్థితి ఏర్పడింది. మగవారు గొడుగులు, టోపీల సహాయంతో, ఆడవారు చున్నీలు తలపై చుట్టుకుని రోడ్లపైకి రావలసి వస్తోంది. పదిగంటల నుంచే ఎండల తీవ్రత పెరుగుతోంది. ఉదయం 10 దాటిందంటే జనాలు తప్పనిసరిగా ఫ్యాన్లకింద, కూలర్ల కింద, ఏసిల కింద చేరవలసిన పరిస్థితి. ఇక షాపులలో పనిచేసే సేల్స్‌మెన్లు, ఆటో, రిక్షావాలాలు, దినసరి కూలీల పరిస్థితి మరీ దారుణంగా మారింది. తగడచిన నెలరోజులుగా ఎండల తీవ్రత 40నుంచి 42డిగ్రీల మధ్య కొనసాగుతోంది. గురువారం 42డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ముందుముందు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించటం ప్రజలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వేసవి తాపాన్ని తీర్చుకునేందుకు ప్రజలు మజ్జిగ, పండ్లరసాలు, కొబ్బరిబొండాలను ఆశ్రయిస్తున్నారు.
అగ్నిగుండంగా మానుకోట
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా అగ్నిగుండంగా మారింది. రోజురోజుకు ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి ప్రతాపానికి జనం అల్లాడుతున్నారు. జిల్లాలోని బయ్యారం, గార్ల, తొర్రూరు, నెల్లికుదురు, నర్సింహులపేట, మరిపెడ, గంగారం, కొత్తగూడ, గూడురు, కురవి తదితర మండలాల్లో భానుడు నిప్పులు కక్కుతున్నాడు. గురువారం 44డిగ్రీల ఉష్టోగ్రత నమోదైంది. ఉదయం 10గంటల నుండే భానుడి ప్రతాపం చెలరేగుతోంది.
ఎండ వేడిమి, బలమైన వడగాలులకు జనం బయటకు వెళ్లడం లేదు. దీంతో పగలంతా కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తోంది. మధ్యాహ్నం రోడ్లపై జనం లేక ప్రధాన రహదారులన్నీ బోసిపోతున్నాయి. ఉదయం నుండి సాయంత్రం 6గంటల వరకు కూడా ఎండ వేడిమి తగ్గడంలేదు. మునుపెన్నడూ లేని విధంగా ఎండలు మండుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ వేడిమి తట్టుకోలేక ప్రజలు శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో కొబ్బరిబొండాలు, కూల్‌డ్రింక్ షాపులకు గిరాకీ పెరిగింది. రాత్రి ఒక వైపు వడగాలులు, మరోవైపు ఉక్కపోత, దోమల మోతతో కంటి నిండా నిద్ర కరవైంది. రోజురోజుకూ ఎండలు పెరిగిపొతుండడంతో దూర ప్రయాణాలు సైతం వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వడదెబ్బతో వృద్ధులు పిట్టల్లా రాలుతున్నారు. ఏప్రిల్ లోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే మే నెలలో ఎండలు ఏవిధంగా ఉండబోతాయే అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తీవ్రమైన ఎండల కారణంగా రెండు రోజుల ముందుగానే పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఎండల వేడిమికి జంతువులు సైతం విలవిల్లాడుతున్నాయి. పశుగ్రాసం లేక పశువులు అల్లాడుతున్నాయి. ఎండల కారణంగా విద్యుత్ వినియోగం పెరిగింది. కూలర్లకు, ఏసిలకు భలే డిమాండ్ పెరిగింది.