వరంగల్

లా కమిషన్ సిఫారసులు ఉపసంహరించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఏప్రిల్ 21: న్యాయవాద వృత్తి చట్టం-1961కి సవరణలు చేయాలని లా కమీషన్ చేసిన సిఫారసులను వ్యితిరేకిస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పిలుపుమేరకు జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. కోర్టు ముందు లా కమీషన్ దిష్టిబొమ్మను దగ్ధం చేయటంతోపాటు లా కమీషన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు జయకర్, రమణ మాట్లాడుతు లా కమీషన్ చేసిన సిఫారసులు న్యాయవాదుల హక్కులను హరించి వేయటమని, న్యాయవాదుల పాత్ర నామమాత్రంగా మార్చటమని అన్నారు. కేంద్రప్రభుత్వానికి న్యాయవాద వృత్తి చట్టంలో మార్పులు సూచిస్తూ లా కమీషన్ తాజా సిఫారసుల కారణంగా న్యాయవాదుల హక్కులకు భంగం కలిగినపుడు నిరసన తెలిపేందుకు అవకాశం ఉండదని అన్నారు. కోర్టులను బహిష్కరించేందుకు అవకాశం లేదని చెప్పారు. దీనికితోడు ఏ కారణంతోనో ఒక కేసులో కక్షిదారుడు ఓడిపోయినపుడు ఆ కేసును వాదించిన న్యాయవాదిని పరిహారం ఇవ్వాలని కక్షిదారుడు కోరే అవకాశాలు కల్పించటం న్యాయవాదుల పాత్రను నామమాత్రం చేయటమని ఆందోళన వ్యక్తం చేసారు. లా కమీషన్ తాను చేసిన సిఫారసులను ఉపసంహరించుకోవాలని, ఈ సిఫారసులను కేంద్రప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అమోదించకూడదని డిమాండ్ చేసారు. నిరసన కార్యక్రమంలో జిల్లా బార్ అసోసియేషన్ ప్రతినిధులు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

మెరుగైన సేవలు అందించాలి
* ప్రభుత్వ పథకాల అమలులో ఉద్యోగుల పాత్ర కీలకం
* విధుల నిర్వహణలో ప్రత్యేక శ్రద్ద కనబర్చాలి
* పౌరసేవల దినోత్సవంలో కలెక్టర్ ప్రీతిమీనా

మహబూబాబాద్, ఏప్రిల్ 21: ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ముందుండాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా పిలుపునిచ్చారు. కలెక్టర్ కాన్షరేన్స్ హాలులో శుక్రవారం 11వ పౌరసరఫరాల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఉద్యోగి బాధ్యత, అంకితభావం, కర్తవ్యంతో నిర్వర్తించినప్పుడు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని అన్నారు. 2016నుండి దేశవ్యాప్తంగా ఏప్రిల్ 21న పౌర సేవల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇల్లు, ఆహారం, ఆరోగ్యం, విద్యా, కేంద్ర ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రభుత్వ పథకాల అమలులో ఉద్యోగుల పాత్ర కీలకమైందని కలెక్టర్ తెలిపారు. బాధ్యత, జవాబుదారీ తనంతో విధుల నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని అన్నారు. గ్రామ, మండలస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అధికారులు సమన్వయంతో పనిచేసి వారికి నిర్ధేశించిన లక్ష్యాలను పూర్తిచేయాలని అధికారులను కోరారు. నిత్యజీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతాయని ఆత్మస్ధైర్యంతో ముందుకు పోవాలని అన్నారు. వైద్య వృత్తిలో ఉన్నప్పటికి అందరికి సేవ చేయాలనే పట్టుదలతో తాను సివిల్స్ సాదించానని అన్నారు. 50శాతం గిరిజనులతో జిల్లా వెనుకబడి ఉందని, జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయుటకు అధికారులు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ప్రభుత్వంచే ప్రవేశపెట్టి అమలు చేయబడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అర్హులకు అందేలా ఎలాంటి ఒత్తిడిలకు లొంగకుండా పారదర్శకంగా చెపట్టాలని అన్నారు. విద్యార్థులు సివిల్స్‌కు సంబందించి అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. జిల్లా రెవిన్యూ అధికారి రాంబాబు మాట్లాడుతూ.. 1947లో సర్ధార్ వల్లభాయ్‌పటేల్ ఐఎఎస్‌లను భారత దేశానికి ఉక్కు కవచం లాంటి వారని కొనియాడారని తెలిపారు. నూతనంగా ఏర్పడిన జిల్లాలో మారిన పరిస్థితులకు అనుగుణంగా దీక్షదక్షలతో పాలనా పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా జిల్లా ప్రజల అవసరాలను తీర్చుటకు అహార్నిశలు కలెక్టర్ కృషి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వంచే ప్రవేశపెట్టిన వినూత్న పథకాల రూపకల్పనలో ఐఏఎస్ పాత్ర కీలకం అని తెలిపారు. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి అధికారులందరు జిల్లా యంత్రంగానికి తోడ్పాటు అందించాలని అన్నారు. ఈ సమావేశంలో ఆర్డివోలు భాస్కర్‌రావు, కృష్ణవేణి, జిల్లా అధికారులు, డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేసి విద్యార్థులకు పోటీ పరీక్షలకు ఎలా ప్రణాళికా బద్ధంగా సిద్ధం కావాలో కలెక్టర్ వివరించారు.