వరంగల్

ప్రతి నీటి బొట్టు ఇం‘్ధనం’ లాంటిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసముద్రం, ఏప్రిల్ 21: ప్రతి నీటి బొట్టు ఇంధనం లాంటిదేనని, నీటి వృధా అరికడితేనే భవిష్యత్తు ఉంటుందని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ప్రీతిమీనా అన్నారు. శుక్రవారం కేసముద్రం (స్టే) గ్రామంలో జలనిధి ప్రచార కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ డాక్టర్ అల్లం రమ అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి ప్రసాదించిన గాలి, నీరును కలుషితం చేయడం వల్ల ప్రస్తుత సమాజనం అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు.
మహబూబాబాద్ జిల్లాలో అడవులను నరికివేయడం వల్ల 50 శాతం ఉండే అడవుల విస్తీర్ణం 25శాతానికి పడిపోయిందన్నారు. రాబోవు వర్షాకాలంలో ప్రతి గ్రామంలో కనీసం 40 వేల మొక్కలు నాటేలా కృషి చేయాలన్నారు. ప్రతి ఇంటికి ఇంకుడుగుంత, మరుగుదొడ్డి నిర్మించుకోవాలన్నారు. వర్షం నీటిని వృధాగా పోకుండా ఎక్కడికక్కడే భూగర్భంలో ఇంకేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పర్యవేక్షక అధికారి చత్రునాయక్, తహశీల్ధార్ యోగీశ్వర్‌రావు, ఎంపిడిఓ అరుణాదేవి, ఎఓ వాసుదేవరెడ్డి, డిటి భాస్కరమూర్తి, ఐకెపి ఎపిఓ రాజీరు, ఆర్‌ఐ కిషన్‌రావు, ఇజిఎస్ ఎపిఓ అవినాష్ తదితరులు పాల్గొన్నారు. కాగా ప్రతి శుక్రవారం గ్రీన్‌డేగా వ్యవహరిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని కలెక్టర్ మండల పరిషత్ ఆవరణలో మొక్కకు నీళ్లు పోశారు.