వరంగల్

నివేదన సభతో చతికిలపడ్డ తెరాస శ్రేణులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడ్డేపల్లి, ఏప్రిల్ 28: గత మూడు సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సమితి పరిపాలనలో సాధించిన ఘనతను వెల్లడించేందుకు అధికారులు, మంత్రులు అట్టహాసంగా ఏర్పాటు చేసిన వరంగల్ నివేధన సభతో తెరాసపై పోరు మొదలైందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు, ఓరుగల్లు నివేధన సభతోనే ముఖ్యమంత్రి కెసి ఆర్‌కు ప్రజాపోరుతో పతనం మొదలైందని వివరించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రతిపక్షా పార్టీలపై అన్‌పార్లమెంటరి భాషతో విమర్శలు చెయ్యడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా 64సంవత్సరాల తెలంగాణ పోరాట చరిత్రలో అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అమరులను విస్మరించిన ఘనత కెసి ఆర్‌దేనని విమర్శించారు. బహిరంగ సభలు, ప్లీనరీల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృదా చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ హాయంలోనే దేశంలో, రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులను మొదలపెట్టి 80శాతం పూర్తి చేశామని, మిగిలిన శాతం ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం రీ డిజైన్ పేరుతో కోట్లాది రూపాయల కాంట్రాక్టులను తమ బంధువులకే అప్పగించుకున్నారని ఎద్దేవ చేశారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగా అతివృష్టి, అనావృష్టి వల్ల రైతులకు నష్ట పరిహారం జరిగితే ఇంతవరకు ప్రభుత్వం పరిహారాన్ని రైతులకు అందజేయకపోవడం సిగ్గుచేటు అన్నారు. కులాల, మతాల పేరుతో ప్రజలను విభజించి పాలిస్తున్నారని, రాష్ట్రంలో పరిపాలన రాచరిక వ్యవస్థను తలపిస్తుందని మండిపడ్డారు. గొర్రెల, మేకల, గేదెల, చేపల, పందుల పెంపకంపై ప్రచారానికే పరిమితమై, ప్రజా సంక్షేమ పథకాలను పూర్తిగా విస్మరించిందని ఆగ్రహాం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హాయంలో రైతులకు ఒక పంటపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయంగా గొర్రెలు, గేదెలు, పౌల్ట్రీలపై అనేక సబ్సిడీలు ఇచ్చి రైతులను ఆదుకున్న ఘనత కాంగ్రెస్‌దేనని గుర్తుచేశారు. పేద, మద్య తరగతి ప్రజలకు డబుల్‌బెడ్రూం ఇండ్ల పేరిట ఆశలు కల్పించి, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి పూర్తిగా మోసం చేశారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య, జంగా రాఘవరెడ్డి, ఈవి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.