వరంగల్

బాబోయ్ ఎండలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, ఏప్రిల్ 28: వేసవిలో ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఎండలతో సామాన్యజనం విలవిలలాడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండటంతో అంగన్‌వాడి కార్యకర్తలు, మున్సిపల్ కార్మికులు భరించలేకపోతున్నారు. దీంతో శుక్రవారం సిఐటియు అనుబందసంస్ధ అంగన్‌వాడి వర్కర్స్ యూనియన్ అధ్వర్యంలో మహబూబాబాద్ కలెక్టరేట్ కార్యాలయం ముందు అంగన్‌వాడి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గతంలో ముఖ్యమంత్రి కేసీ ఆర్ ఇచ్చిన హామి మేరకు మే నెలలో అంగన్‌వాడీలకు వేసవి సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేసారు. తీవ్రమైన ఎండలు, బలమైన వడగాలులతో పనిచేయలేకపోతున్నామని, అంతే కాకుండా ఎండకు చిన్నిపిల్లలు కూడా రాలేక పోతున్నారని అన్నారు. అంగన్‌వాడి సెంటర్లలో వంటలు కూడా వంటలేక పోతున్నామని అన్నారు. అదే విధంగా సిడిపిఓ కార్యాలయం ముందు కూడా అంగన్‌వాడీలు ధర్నా కార్యక్రమం చేపట్టి అక్కడే సిడిపిఓకు వినతిపత్రం అందచేసారు. ఇదిలా ఉండగా మున్సిపల్ వర్కర్స్ అద్వర్యంలో కూడా మున్సిపల్ చేర్‌పర్సన్‌కు వినతిపత్రం అందచేసారు. తీవ్రమైన ఎండల కారణంగా ఒంటిపూట మాత్రమే విధులు నిర్వహిస్తామని చేర్‌పర్సన్‌కు అందించిన వినతిపత్రంలో పేర్కొన్నారు.
* బయట తిరిగేందుకు జంకుతున్న జనం
కేసముద్రం: భానుడి ఉగ్రరూపానికి జనం విలవిలలాడుతున్నారు. ఉదయం 7 గంటలకే భానుడు ఉగ్రరూపం దాల్చుతూ.. మధ్యాహ్నం వరకు ప్రచండరూపం దాల్చుతుండటంతో జనం బయట తిరిగేందుకు జంకుతున్నారు. శుక్రవారం ఎండ తీవ్రత మరింత పెరిగిపోవడంతో కేసముద్రం మండల కేంద్రంలోని ప్రధాన రహాదారులు జన, వాహన సంచారం లేక నిర్మానుష్యంగా మారిపోయాయి. చివరకు ప్రయాణికుల్లేక రైల్వే స్టేషన్ సైతం బోసిపోయి కనిపించింది. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎండ తీవ్రత తగ్గకపోవడంతో చికటి పడ్డ తరువాతే జనం బయటకు వస్తున్నారు. ఎండ తీవ్రత భరించలేక వ్యవసాయ కూలీలు, రైతులు సైతం ఉదయం 10 గంటల్లోగా పనులు పూర్తి చేసి ఇంటి ముఖం పడుతున్నారు. వ్యవసాయ మార్కెట్లో మధ్యాహ్నం పూట కాంటాలు, తోలకాలు నిలిపివేసి, సాయంత్రం నిర్వహిస్తున్నారు. శుక్రవారం కేసముద్రం మండలం ఎండ తీవ్రతో కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. ఎండ తీవ్రత మరికొద్ది రోజులు ఇలాగే ఉంటుందని వాతావరణ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.