వరంగల్

విఫలమైన ప్రగతి నివేదన సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడ్డేపల్లి, ఏప్రిల్ 28: గత కొన్ని రోజులుగా వరంగల్ నగరంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ప్రగతి నివేధన సభ కోసం చేసిన ఏర్పాట్లు , ముఖ్యమంత్రి ప్రసంగంతో సభ పూర్తిగా విఫలం అయ్యిందని తెలుగు దేశం అర్బన్ జిల్లా అధ్యక్షుడు ఈగ మల్లేశం అన్నారు. శుక్రవారం బాలసముద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కెసి ఆర్ కుట్రలను, కుతంత్రాలను ప్రజలు ప్రగతి నివేధన సభతో తిప్పికొట్టారని తెలిపారు. 3 సంవత్సరాల పాలనలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, పథకాలపై ఊసెత్త కుండా ఊకదంపుడు ఉపన్యాసంతో ప్రజలను మభ్యపెట్టడంతోనే సభను ముగించారని ఎద్దేవ చేశారు. 120 కోట్ల రూపాయలను ఖర్చుపెట్టి నివేధన సభ నిర్వహిస్తే, తెలంగాణ ప్రజలు ప్రభుత్వ పరిపాలనను, ముఖ్యమంత్రి పోకడలను తిప్పికొట్టారని తెలిపారు. 45వేల కోట్ల రూపాయలతో మిషన్ కాకతీయ, 30వేల కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ పేరుతో ప్రభుత్వం ప్రజాధనాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి తెలుగు దేశం పార్టీ హాయంలోనే విద్య వ్యవస్థకు పెద్ద పీట వేశామని, గురుకుల పాఠశాలను, సంక్షేమ హాస్టల్లను ఏర్పాటు చేసిన ఘనత టిడిపిదేనని గుర్తుచేశారు. బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన నిధుల ఖర్చులపై శే్వతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎ ఎండకు ఆ గొడుగు పట్టే తెరాస నాయకులకు టిడిపిని విమర్శించే అర్హత తెరాసకు లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో 4 స్తంబాల ఆటలాగా కొనసాగుతున్న ముఖ్యమంత్రి కుటుంబ పాలనకు వరంగల్ నివేధన సభతోనే పతనం ప్రారంభం అయ్యిందని జోష్యం చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించలేని చేతకాని ప్రభుత్వం, రాబోయే రోజులలో రైతులకు ఉతచితంగా ఎరువులు ఇస్తానని అనడం చేతకాని తనానికి నిదర్శనం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కొండం మధుసూధన్ రెడ్డి, సారయ్య, జయపాల్, సాంబయ్య, సంతోష్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.