వరంగల్

ముగ్గురి ప్రాణాలను బలిగొన్న అతివేగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొర్రూరు, ఏప్రిల్ 28 ; తొర్రూరు మండలం వెలికట్టే గ్రామ శివారులో వరంగల్..ఖమ్మం రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. తొర్రూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తొర్రూరు మండలం నాంచారి మడూరు గ్రామ శివారు పటేలు గూడెం గ్రామానికి చెందిన చిదిమల్ల బాపురెడ్డి అలియాస్ బాబు (35), తాడిశెట్టి మునింధర్ (26), గోనే శ్రీకాంత్(20), అనే ముగ్గురు యువకులు శుక్రవారం మధ్యాహ్నం పటేలు గూడెం నుండి సొంత పని మీద తొర్రూరుకు వస్తున్న క్రమంలో వెలికట్టే గ్రామ శివారులో వరంగల్.. ఖమ్మం రహదారిపై అతివేగంగా వెళుతూ అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఒకడైన మునిందర్ హైదరాబాద్‌లో ఉంటూ వచ్చే మంగళవారం గ్రామంలో జరగనున్న దుర్గమ్మ పండుగ ఉత్సవాల్లో పాల్గొనేందుకు తన మిత్రుని కారు తీసుకుని స్వగ్రామానికి వచ్చాడు. గ్రామానికి చెందిన తన మిత్రులైన బాపురెడ్డి, శ్రీకాంత్‌లతో కలిసి తొర్రూరుకు వెళ్తున్న క్రమంలో కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొంది. ఈ ఘటనలో కారు డ్రైవ్ చేస్తున్న శ్రీకాంత్‌తో పాటు అతని పక్కన ముందు సీట్లో కూర్చున్న మునిందర్, కారు వెనుక సీట్లో కూర్చున్న బాపు రెడ్డి అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో ఎపి09బిటీ5712నెంబరు గల స్విఫ్ట్ కారు పూర్తిగా ధ్వంసమయింది. కాగా మృతుల్లో బాపురెడ్డికి భార్య శ్యామల, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉండగా మునింధర్ కు భార్య మానస, ఒక కూమారుడు ఉన్నారు. కాగా శ్రీకాంత్‌కు ఇంకా వివాహం కాలేదు. సంఘటనా స్థలాన్ని తొర్రూరు డిఎస్‌పి జి రాజరత్నం సిఐ చేరాలు, తొర్రూరు ఒకటవ ఎస్సై డి రమణమూర్తి , రెండవ ఎస్సై తహెర్ బాబా సంధర్శించారు. ఆతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా అసుపత్రికి తరలించి తొర్రూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో పటేలు గూడెం గ్రామంలో తీవ్ర విషాద చాయలు అలముకున్నాయి. సంఘటనా స్థలాన్ని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించి మృతుల కుటుంబీకులను పరామర్శించారు.

పార్టీ నేతలపై అసహనం వ్యక్తం చేసిన కెసిఆర్
*జన సమీకరణలో విఫలంపై ఆరా తీసిన సిఎం *నగర సుందరీకరణ పనులపై అసంతృప్తి

వరంగల్, ఏప్రిల్ 28: తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో గురువారం వరంగల్ నగరంలో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ బహిరంగ సభకు అనుకున్న మేరకు జనాలను సమీకరించకపోవడంపై ముఖ్యమంత్రి, పార్టీ అధినేతలు కె.చంద్రశేఖర్‌రావు పార్టీ జిల్లా ముఖ్యులపై అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పార్టీ ఎమ్మెల్యేలు జనసమీకరణలో విఫలం అయినట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం గురువారం రాత్రి బహిరంగ సభ అనంతరం రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మికాంతారావు ఇంట్లో బస చేసిన కెసి ఆర్ శుక్రవారం ఉదయం ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యులతో సమావేశమైన సందర్భంలో బహిరంగ సభ నిర్వహణపై చర్చ జరిగింది.
బహిరంగ సభకు జనాలు భారీగానే తరలివచ్చినా అనుకున్న మేరకు రాలేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిసింది. ఎమ్మెల్యేలు, నాయకుల మధ్య సమన్వయ లోపం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని సిఎం కేసిఆర్ వ్యాఖ్యానించారని సమాచారం.
కాగా వరంగల్ నగరంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కూడా ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. నగర సుందరీకరణకు వివిధ పథకాల క్రింద నిధులు మంజూరైనా నగరం ఇంత అధ్వాన్నంగా ఉండటం ఎమిటని ప్రశ్నించారని తెలిసింది.