వరంగల్

హామిలే తప్ప అగ్నిమాపక కేంద్రం ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాపురం(నూగూరు), ఏప్రిల్ 29: ఏజన్సీ ప్రాంతంలో తాటాకు ఎండుగడ్డి ఇళ్లు అధికంగా ఉండడంతో పాటు చుట్టూ అటవిప్రాంతం ఉండడంతో వేసవి వచ్చిందంటే అగ్ని ప్రమాదాలతో సర్వం కోల్పోయి నిరాశ్రయులు అవుతున్నారు. దశాబ్దాల కాలంగా ఏజన్సీ ప్రాంతంలో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత అధికారికి మంత్రులు, ప్రజాప్రతినిధులు హామీలు ఇస్తున్నారు తప్ప ఆచరణ మాత్రం కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకునే మార్గాలు లేవు. ఫలితంగా ఈ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే దూరప్రాంతం నుండి అగ్ని మాపక శకటాలు వచ్చేలోగా కాలి బూడిద అవుతున్నాయి. ప్రభుత్వం ఏజన్సీ ప్రాంతంలోని అగ్ని ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు.
టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు
గూడూరు, ఏప్రిల్ 29: రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందని, ముఖ్యమంత్రి కెసిఆర్ నియంతలా వ్యవహరిస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కత్తి స్వామి అన్నారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. గూడూరు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కత్తి స్వామి మాట్లాడారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ మిర్చి ధర పడిపోయినా ప్రభుత్వం, అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఈతరుణంలో ఆగ్రహం చెందిన రైతన్న మార్కెట్ కార్యాలయానికి నిప్పు పెట్టారని అన్నారు. పక్క రాష్ట్రంలో మిర్చికి క్వింటాల్‌కు పదిహేను వందల రూపాయల మద్దతు ధర ఇస్తోందని అన్నారు.

ఇంటికో మరుగుదొడ్డి నిర్మించుకోవాలి

పరకాల, ఏప్రిల్ 29: ఇంటికో మరుగుదొడ్డి నిర్మించుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి అన్నారు. శనివారం జయశంకర్ జిల్లా పలిమల మండలం లెక్కలగడ్డ గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో 134 మరుగుదొడ్లను నిర్మించడానికి రూ. 16 లక్షు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏడుగురు సభ్యలతో కమిటి వేసి నిర్మాణాలను చేపట్టనున్నట్టు కలెక్టర్ పేర్కొన్నారు. లెక్కలగడ్డ గ్రామంలో 4 కుటుంబాలు గుడుంబా అమ్ముతున్నట్టు గ్రామసభలో కలెక్టర్ దృష్టికి గ్రామస్తులు తీసుకువచ్చారు. దీంతో స్పందించిన కలెక్టర్ వారిని రిమాండ్ చేయాలని ఎస్సైను ఆదేశించారు. అనంతరం లెక్కలగడ్డ రోడ్డు పక్కన ఉన్న రెండు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం ఆయన పరిశీలించారు. కలెక్టర్ వెంట పలిమల, మహదేవపూర్ తహశీల్దార్లు సాంబమూర్తి, సత్యనారాయణ, సర్పంచ్ మల్లయ్య పాల్గొన్నారు.

పంచాయతీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ఏటూరునాగారం, ఏప్రిల్ 29: కేంద్ర, రాష్ట్ర పథకాలను గ్రామస్థ్ధాయిలో అమలు చేయించుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ పార్ట్‌టైం, ఎన్‌ఎంఆర్, అన్ని తరగతుల సిబ్బందిని రెగ్యులరైజ్ చేసి, తమ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకుడు సర్వ వెంకయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలో ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల గ్రామపంచాయితీ ఉద్యోగుల సమావేశం ఇర్సవడ్ల రాజు అధ్యక్షతన జరిగింది.