వరంగల్

జనం లేక వెలవెలపోతున్న గ్రామ సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్ధన్నపేట, ఏప్రిల్ 29 : ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ ఫలాలు ప్రజలకు జవాబుదారీతనం ఉండేందుకు ఉద్దేశించిన గ్రామ సభ అధికారులు, జనం లేక వెలవెల పోయింది. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించాల్సిన గ్రామ సభను శనివారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణంలో సర్పంచ్ అద్యక్షతన నిర్వహించారు. ఈ సభకు ప్రజల నుండి స్పందన లేక పోవడంతోగ్రామ సభ తూతూమంత్రంగా సాగింది. ప్రజల నుండి డ్రైనేజీ , మురికి కాల్వల నిర్వహణ, నీటి సరఫరాలపై ఫిర్యాదులు అందాయి. మూడు నెలల ఆదాయం 6లక్షలు కాగా ఇందులో గ్రామ పంచాయతీ సిబ్బందికి జనవరి మాసం వరకు పూర్తి వేతనాలు మాత్రమే ఖర్చు కాగా గ్రామ సభలో అధికారులు ఆదాయ వ్యవహారాలను చదివి వినిపించారు. స్థానిక సర్పంచ్ మినహా ప్రజా ప్రతినిధులైన జడ్పీటీసి, ఎంపిటిసిలు హజరుకాకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు, ప్రజా ప్రతినిధుల వ్యవహారశైలిలో మార్పు రానిది ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వృథా ప్రయాసగా ప్రజలు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా గాడిపేల్లి స్వరూప మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి అన్నది ప్రజల సహకారం అందినప్పుడే సాధ్యమవుతుందని అన్నారు. ఈ సమావేశానికి విద్యుత్ ఏఈ, లైన్‌మేన్లు, రెవెన్యూ సిబ్బంది విఆర్‌ఓ , విఆర్‌ఏ రవీందర్, ప్రవీణ్ , ఆశ వర్కర్ల్, ఏఎన్‌ఎమ్‌లు గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బొడ్రాయి పునః ప్రతిష్ఠాపనకు
విరాళాల సేకరణ ప్రారంభం
పరకాల, ఏప్రిల్ 29: పరకాల పట్టణంలో నిర్వహించ తలపెట్టిన బొడ్రాయి పునఃప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని పురస్కరించుకొని శనివారం అక్షయ తృతీయ సందర్భంగా విరాళాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శనివారం ఉదయం శ్రీ్భవానీ సమేత కుంకుమేశ్వరస్వామి దేవస్థానంలో పూజా దీక్షలు నిర్వహించిన అనంతరం పరకాల నగర పంచాయతీ చైర్‌పర్సన్ మార్త రాజభద్రయ్య తొలి విరాళం అందచేశారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మార్త రాజభద్రయ్య మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల అనంతరం పరకాల పట్టణంలో బొడ్రాయి పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించుకోవడం చారిత్రాత్మకమైన విషయమన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చిదురాల దేవేందర్, కుంకుమేశ్వరస్వామి ఆలయ కమిటీ చైర్మన్ ఏరుకొండ సాంబమూర్తి, నాయకులు దేవునూరి మేఘనాధ్, బండి రవి, ఆకుల కుమారస్వామి, కానుగుల గోపినాధ్, బండి ఆగయ్య, బొచ్చు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

రాంచంద్రయ్యకు కలెక్టర్ నివాళులు

నర్సంపేట, ఏప్రిల్ 29: కరెంట్ షాకు మూలంగా గుండెపోటుకు గురై శుక్రవారం ఉదయం మృతిచెందిన నర్సంపేట నగర పంచాయతీ చైర్మన్ పాలెల్లి రాంచంద్రయ్య భౌతికగాయంపై శనివారం ఉదయం వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. శుక్రవారం ఉదయం నర్సంపేట నగర పంచాయతీ చైర్మన్ రాంచంద్రయ్య తన ఇంట్లో కరెంట్ షాక్‌తో పాటు గుండెపోటుకు గురై మృతిచెందిన విషయం పాఠకులకు తెల్సిందే. శనివారం ఉదయం రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ నేరుగా రాంచంద్రయ్య గృహానికి చేరుకుని నివాళులర్పించి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. రాంచంద్రయ్య మృతికి సంబంధించిన వివరాలను రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డిని కలెక్టర్ పాటిల్ అడిగి తెలుసుకున్నారు. రాంచంద్రయ్య కుమారుడు వరుణ్‌కుమార్ అమెరికాలోని టెక్సాక్‌లో ఎంఎస్ చదువుతుండగా ఆయన కొడుకు కోసం కుటుంబ సభ్యులంతా ఎదురు చూస్తున్నారు. శుక్రవారం రాత్రే అమెరికా నుండి బయలుదేరిన రాంచంద్రయ్య కుమారుడు వరుణ్ ఆదివారం తెల్లవారుజామున నర్సంపేటకు చేరుకోనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం ఉదయం రాంచంద్రయ్య అంత్యక్రియలను నిర్వహించేందుకు రాంచంద్రయ్య కుటుంబ సభ్యులు, టిఆర్‌ఎస్ శ్రేణులు, నగర పంచాయతీలు ఏర్పాట్లు చేస్తున్నాయి.రాంచంద్రయ్య అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లతో పాటు ప్రజాప్రతినిధులు ఆదివారం నర్సంపేటకు రానున్నట్టు అధికార పార్టీ నాయకులు తెలిపారు. అదే విధంగా అధికార టిఆర్‌ఎస్ పార్టీ నాయకులతో పాటు ఇతర రాజకీయ పక్షాల నాయకులు సైతం తరలిరానున్నారు. వేలాది మంది ఆశ్రునయనాల మధ్య అంత్యక్రియలు జరగనున్నాయి.నర్సంపేట నగర పంచాయతీ చైర్మన్ పాలెల్లి రాంచంద్రయ్య ఆకస్మిక మృతి నేపథ్యంలో ఆదివారంజరిగే వారాంతపు సంతను రద్దు చేస్తున్నట్టు నగర పంచాయతీ కమిషనర్ మల్లిఖార్జున స్వామి తెలిపారు. వర్తక, వ్యాపారులు, ప్రజలు గమనించాల్సిందిగాకోరారు.
నివాళులర్పించిన
కత్తి వెంకటస్వామి
నర్సంపేట నగర పంచాయతీ చైర్మన్ రాంచంద్రయ్య భౌతికకాయంపై కాంగ్రెస్ పార్టీ నర్సంపేట నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ కత్తి వెంకటస్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం రాంచంద్రయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. కత్తి వెంకటస్వామి వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు తాబేటి శ్రీనివాస్‌గౌడ్, కొర్ర రాజన్న, గిరగాని సాంబయ్య, పంజాల రాము తదితరులు పాల్గొన్నారు.