వరంగల్

కోదండరాం అరెస్టు అప్రజాస్వామికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, ఏప్రిల్ 29: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ సందర్శన నిమిత్తం వెళుతున్న తెలంగాణ ఐకాస చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను కూసుమంచి సమీపంలో పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేయడం అప్రజాస్వామికమని జెఎసి రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు అంబటి శ్రీనివాస్ అన్నారు. నర్సంపేటలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అంబటి శ్రీనివాస్ మాట్లాడారు. ఖమ్మం మార్కెట్‌లో రెండు లక్షల పైచిలుకు మిర్చి బస్తాలు వస్తే గత మూడు రోజులుగా కొనుగోళ్లు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ఇదే సమయంలో మిర్చి క్వింటాల్‌కు కేవలం 4వేల రూపాయల లోపే కొనుగోలు చేయడం, అది కూడా మార్కెట్‌లో కాకుండా బయట కోనుగోళ్లు చేయడంతో రైతుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయని తెలిపారు. ఈ క్రమంలో మార్కెట్‌లో ఫర్నీచర్‌ను దగ్ధం చేశారని చెప్పారు. ఈసమస్యపై ముఖ్యమంత్రి స్పందించాల్సింది పోయి మార్కెట్‌కు వెళుతున్న ఐకాస చైర్మన్ కోదండరాంను అరెస్టు చేయడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నియంతలా పాలన కొనసాగిస్తున్నాడని, రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం పతనం కావడం ఖాయమని స్పష్టం చేశారు. మిర్చి రైతాంగానికి సరైన మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఐకాసా నాయకులు బొనగాని రవీందర్, గంగిడి సాంబిరెడ్డి, బొట్ల పవన్, పొలబోయిన లక్ష్మయ్య, షేక్ జావీద్, అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఉపాధిహామీ పథకాన్ని
సద్వినియోగం చేసుకోవాలి
సంగెం, ఏప్రిల్ 29: మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులను కూలీలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపిడివో భద్రునాయక్ అన్నారు. శనివారం సంగెం మండలం గుంటూరుపల్లి, కొత్తగూడెం, నల్లబెల్లి గ్రామాలలో జరుగుతున్న ఉపాధి హామీ పథకంలో చేపట్టిన శ్మశానవాటిక, చెరువుపూడికతీత, మరుగుదొడ్ల నిర్మాణం పనులను పరిశీలించారు. వంద శాతం మరుగుదొడ్లు పూర్తి చేసిన గ్రామాలలో రూరల్ జిల్లా కలెక్టర్ పర్యటిస్తారని తెలిపారు.
ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన తహశీల్దార్
సంగెం, ఏప్రిల్ 29: గతంలో ఇందిరమ్మ గృహాలు మంజూరై పూర్తిగా బిల్లులు తీసుకుని లబ్ధిదారులు నిర్మించుకున్న గృహాలను సంగెం తహశీల్దార్ సత్యనారాయణ శనివారం పరిశీలించారు. సంగెం మండలం పల్లారుగూడ, మొండ్రాయి గ్రామలలో ఇందిరమ్మ లబ్ధిదారుల గృహాలను పరిశీలించి లబ్ధిదారుల వివరాలను అడిగితెలుసుకున్నారు. వీటిని పూర్తిగా పరిశీలించిన అనంతరం నివేదికను ప్రభుత్వానికి అందజేస్తానని తెలిపారు. ఇందిరమ్మ బిల్లులు చెల్లించడానికే గృహాలు ఏ స్థాయిలో నిర్మించారని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ ఏఈ కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.
శుభకార్యాలకు హాజరైన మంత్రి ఈటల
కమలాపూర్, ఏప్రిల్ 29: మండల కేంద్రమైన కమలాపూర్, శనిగరం గ్రామాలలో శనివారం వివాహాలకు ఆర్థిక పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు. కమలాపూర్‌కు చెందిన కనకయ్య కుమారుడి వివాహం లక్ష్మి గణపతి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించగా మంత్రి ఈటల పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే గోపాల్‌పూర్ మాజీ సర్పంచ్ కోమురెల్లి సోదరుడు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి వెళ్లారు.