వరంగల్

మిషన్ కాకతీయతో చెరువులకు జల కళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయపర్తి,మే 14: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ కాకతీయ పనుల వలన గ్రామాలలోని చెరువులకు పూర్వ వైభవం సంతరించుకుందని జల కళ వస్తోందని హన్మకొండ మ్యాక్స్ కేర్ ఆర్ ఎమ్ ఓ, గ్రామ పెద్ద రైతు డాక్టర్ వెంకట్‌రెడ్డి అన్నారు. మిషన్ కాకతీయ మూడవ విడత పనులలో భాగంగా మండలంలోని కాట్రపల్లి గ్రామంలో చింతల చెరువులో ఆదివారం పూడికతీత పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చెరువులపై ప్రత్యేక దృష్టి సారించి రైతుల అభివృద్ది కోసం పూడికతీత పనులు చేపట్టిందన్నారు. ఈ పనుల ద్వారా రైతులకు రెండు విధాల లాభాలు జరుగుతుందన్నారు. చెరువులోని మట్టి పంట పొలాల్లో పోసుకోవడం వలన భూసారం పెరిగి పంటలు అధిక దిగుబడులు పొందడమే కాకుండా, చెరువులలో వర్షపు నీరు నిల్వ ఉండి భూ గర్భ జలాలు పెరిగి పంటలకు సాగు నీరు అందుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతిరైతు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి సభ్యులు ఉప సర్పంచ్ జయపాల్‌రెడ్డి, ఎస్ ఎం సి చైర్మన్ యాకయ్య, రైతులు రమేశ్‌రెడ్డి, ఉప్పలయ్య, రాజాలు, రాజు, శ్రీను, రమేశ్ పాల్గొన్నారు.

ఆరోపణలు కాదు..
రైతులను పరామర్శించండి
* టిఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ నాయకుల సూచన
కేసముద్రం, మే 14: కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో రైతుకు అన్ని విధాలుగా అండగా నిలిచిందని, టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత పంటలకు గిట్టుబాటు ధర లేక, నష్టాల్లో కూరుకుపోయి అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా అటు ప్రభుత్వం, ఇటు టిఆర్‌ఎస్ నేతలు పట్టించుకోకుండా, ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలపై ప్రత్యారోపణలతో కాలం వెళ్లదీస్తున్నారని, ఆరోపణలు మానుకోండి.. కష్టాల్లో ఉన్న రైతులను పట్టించుకోవాలంటూ టిఆర్‌ఎస్ నేతలకు కాంగ్రెస్ నేతలు సూచించారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు గుగులోతు దస్రునాయక్ మాట్లాడుతూ వైఎస్సార్ సిఎంగా ఉన్న సమయంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ ఏకకాలంలో చేయడంతో పాటు రుణం సకాలంలో చెల్లించినవారికి నజరానా కూడా అందించామన్నారు. తమ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం రైతు సంక్షేమమే లక్ష్యంగా కృషి చేసిన విషయం ఏ రైతును అడిగినా చెబుతారని పేర్కొన్నారు. గిట్టుబాటు ధర అడిగిన రైతులకు బేడీలు వేయించిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
ధర్నా చౌక్ ఆక్రమణకు మద్దతు
తెలంగాణ ఉద్యమానికి ఉపయోగించుకొని అధికారంలోకి రాగానే హైదరాబాద్‌లోని ధర్నా చౌక్‌ను టిఆర్‌ఎస్ ప్రభుత్వం తొలగించేందుకు యత్నించడం సరికాదని, ధర్నా చౌక్‌ను తొలగిస్తే ఊరుకునేదిలేదని, ధర్నా చౌక్ ఆక్రమణ కార్యక్రమానికి మద్దతుగా తమ పార్టీ నాయకులు హైదరాబాద్ తరలివెళ్లనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు చిరగోని సారయ్య, అల్లం నాగేశ్వర్‌రావు, గుగులోతు వీరునాయక్, అంబటి మహేందర్‌రెడ్డి, అయ్యుబ్‌ఖాన్, తండ వెంకటేశ్వర్లు, బాదావత్ శంకర్, బానోత్ బాలు నాయక్, కొండేటి కళ్యాణ్, విజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

యాదవ సొసైటీల్లో పొసగని పొత్తు

కేసముద్రం, మే 14: సిఎం కెసిఆర్ యాదవులకు గొర్రెలు పంపిణీ చేయడానికి గ్రామాల్లో యాదవ సొసైటీల్లో ఏర్పాటు చేసి, కొత్త కమిటీల కూర్పు చేయడానికి ఆదేశించగా వివిధ గ్రామాల్లో పలు అంశాల్లో పాత.. కొత్త సభ్యుల మధ్య పొత్తు పొసగడం లేదు. ప్రభుత్వం పశుసంవర్ధకశాఖ ద్వారా ప్రతి గ్రామంలో గత ఫిబ్రవరిలో యాదవ కుటుంబాల సర్వే నిర్వహించింది. ఆ మేరకు మండల వ్యాప్తంగా 2356 కుటుంబాలున్నట్టు నిర్ధారించారు. గుర్తించిన వారితో పాటు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లివారితో కలుపుకుంటే మండల వ్యాప్తంగా ఈ సంఖ్య 2500 దాటే అవకాశం ఉంది. అయితే ఆయా గ్రామాల్లో తొలుత గ్రామ యాదవ సొసైటీని ఏర్పాటు చేసి గుర్తించి యాదవుల నుంచి 51 రూపాయల సభ్యత్వ రుసుం తీసుకొని సభ్యత్వం ఇచ్చి సొసైటీకి తాత్కాలికంగా ఒక చీఫ్ ప్రమోటర్‌తో పాటు మరికొంత మంది ప్రమోటర్లతో కమిటీ వేయాలని అధికారులను ఆదేశించారు. అయితే మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 16 మండలాల్లోని 236 గ్రామాల్లో 232 గ్రామాల్లో యాదవులుండగా, 116 గ్రామాల్లో గతంలోనే సొసైటీలు ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో కొన్ని సొసైటీలు నామమాత్రంగా నడుస్తుండగా, మరి కొన్ని సొసైటీలు ‘ఆదర్శ’వంతంగా నడుస్తున్నాయి. ప్రతి నెలా తలా కొంత పొదుపు చేసుకోవడం, గొర్రెల పెంపకానికి బీడు భూములను సమకూర్చుకోవడం, ఆయా సంఘాల్లోని సభ్యులంతా సంఘటితంగా నడుస్తూ సంక్షేమంతో పాటు పరపతి పెంచుకున్నాయి. దీనికితో ఆయా సంఘాల్లో సభ్యుల మూలధనం లక్షల్లో ఏర్పడింది.