వరంగల్

ఇసుక దిబ్బ కూలి యువ కూలీ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్థన్నపేట, మే 14: తోడబుట్టిన దాని వివాహం జరిపించడానికి వచ్చి తిరుగురాని లోకానికి వెళ్లిన సంఘటనతో ఊరిలో విషాద ఛాయలు అల్లుకున్నాయి. వివరాలలోకి వెళ్తే వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలంలోని నందనం గ్రామానికి చెందిన భాగ్యరవి(22) ఈనెల 25న తన చెల్లి వివాహం ఉండడంతో పెళ్లి పనులు పూర్తి చేసి తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాలని హైద్రాబాద్‌లో రోజు వారీ కూలీగా జీవనం గడిపేవాడు. ఆదివారం పెద్దగా పని లేకపోవడంతో పెద్ద సంఖ్యలో ఇసుక అక్రమంగా తరలిస్తున్న ఆకేరు వాగులో ట్రాక్టర్ లోడ్ చేసేందుకు కూలీగా పని చేసేందుకు వెళ్లగా పెద్ద ఇసుక దిబ్బ కూలడంతో ఊపిరాడక సంఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలాడు. ఇలా పలుమార్లు జరిగిగా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికెనా అధికారులు ఇసుక అక్రమ రవాణాను అరికట్టి ఇలాంటి మరణాలు జరగకుండా గట్టి చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరారు. కొడుకు తిరిగి రాని లోకానికి వెళ్లడంతో కుటుంబం అంతా శోకసంద్రంలో మునిగి పోయారు.
బావిలో పడి వృద్ధుడి మృతి
గూడూరు, మే 14: ప్రమాదవశాత్తు వ్యవసాయబావిలో పడి 60 సంవత్సరాల వృద్ధుడు మృతిచెందిన సంఘటన గూడూరు మండలంలోని మచ్చర్లలో ఆదివారం ఉదయం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మచ్చర్లకు చెందిన సట్ల బిక్షం బహిర్బూమి కోసం గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. కాళ్లు, చేతులు శుభ్రం చేసుకునే క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడి మృతిచెందాడు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

పాకాల నీటితో మునే్నరు వాగుకు జలకళ

మహబూబాబాద్, మే14: ఈవేసవిలో మహబూబాబాద్ పట్టణ వాసులకు ఎలాంటి తాగునీటి ఇబ్బంది లేదని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అన్నారు. గత నాలుగురోజుల నుండి పాకాలనీరు మునే్నరుకు చేరుకుంటుండటంతో మునే్నరు వాగుకు జలకళ వచ్చింది. ఆదివారం ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మునే్నరు వాగును పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే రెండు సార్లు తీగరాజుపల్లి నుండి ఎస్‌ఆర్‌ఎస్పీ కాలువద్వారా తాళ్లపూసల, ఈదుళ్ళపూసల చెరువుల మీదుగా మునే్నరు వాగులోకి నీరు తరలించామని, అక్కడి నుండి పట్టణ ప్రజలకు తాగునీరు సరఫరా చేస్తున్నామని అన్నారు. ఎస్‌ఆర్‌ఎస్పీ నీరు ఉండగానే ముందు జాగ్రత్తగ పాకాల నీరు సరఫరా చేస్తున్నామని అన్నారు. దీంతో ఈవేసవిలో కూడా ఎలాంటి తాగునీరు ఇబ్బందులు తలెత్తవని అన్నారు. నీటి సరఫరాను మున్సిపల్ డిఇ కృష్ణాలాల్ పర్యవేక్షణలో సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

భగీరథ పనుల్లో వేగం పెంచండి

ఆంధ్రభూమిబ్యూరో
మహబూబాబాద్, మే 14: మహబూబాబాద్ జిల్లాలో జరుగుతున్న మిషన్‌భగీరథ పనులు మరింత వేగం పెంచాలని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. ఆదివారం డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని ఖమ్మం-మహబూబాబాద్ జిల్లా సరిహద్దులోని అబ్బాయిపాలెం శివారు ఎదళ్లగుట్ట వద్ద జరుగుతున్న మిషన్‌భగీరథ పనులను ఆయన పర్యవేక్షించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రెడ్యా మాట్లాడుతూ పనులు వేగవంతం చేసి వచ్చే దీపావళి నాటికి మరిపెడ మండల ప్రజలకు తాగునీరు అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. మిషన్‌భగీరథ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌భగీరధ పనులను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అన్నారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయమని, ఆయన కన్న కలలు నెరవేర్చాలని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. భగీరథ పనుల తీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్‌కాకతీయ, మిషన్‌భగీరధ పథకాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని అన్నారు.
సిఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని, ఇప్పటికే రైతులకోసం అనే సంక్షేమపథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. ప్రభుత్వ పథకాలు జీర్ణించుకోలేకనే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై గగ్గోలు పెడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారానే తెలంగాణ సాధించుకున్నామని, అదే స్ఫూర్తితో బంగారు తెలంగాణ సాధించుకునేందుకు పతిఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు తమవెంటే ఉన్నారని, మరో పదేళ్లు అధికారం తమదేనని ఆయన ధీమా వ్యక్తం చేసారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను సైతం అమలు చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదే అని అన్నారు. ఇప్పటికైనా ప్రతి పక్షాలు ప్రభుత్వానికి సహకరించాలని, ఆభివృద్ధికి ఆటంకులుగా మారవద్దని అన్నారు.
నేటి చలో హైద్రాబాద్‌ను జయప్రదం చేయండి
నర్సంపేట, మే 14: హైద్రాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ను పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం తలపెట్టిన చలో హైద్రాబాద్ కార్యక్రమానికి ప్రతిపక్షపార్టీల నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, మేధావులు, ప్రజలు, ప్రజాస్వామ్య వాదులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాల్సిందిగా ఎంసిపి ఐ(యు) నర్సంపేట మండల కార్యదర్శి కొత్తకొండ రాజవౌళి పిలుపునిచ్చారు. నర్సంపేట పట్టణంలోని ఎంసిపిఐ(యు) కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రాజవౌళి మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసి ఆర్ నియంతాల పాలన కొనసాగిస్తున్నాడని మండిపడ్డారు. ఏకపక్ష నిర్ణయాలతో ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తున్నాడని వాపోయారు. పోరాటాలకు, ప్రజాసమస్యలకు పరిష్కార వేదిక అయిన ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ను ఎత్తివేయడం సరి కాదన్నారు. ఈసమావేశంలో ఎంసిపిఐ(యు) నాయకులు ఎండి.మాషుక్, ఎండి.అఫ్జల్, పిట్టల లక్ష్మీనారాయణ, వీరస్వామి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.