వరంగల్

ఇప్పట్లో మార్పు లేనట్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, మే 14: జిల్లాల విభజన తరువాత కాంగ్రెస్ పార్టీ అయా జిల్లాలకు సారథుల ఎన్నికలు తాత్కలికంగా నిలిచిపోయింది. అన్ని రాష్ట్రాలతో పాటే తెలంగాణ కూడా ఒకేసారి ఎన్నికలు ప్రకటిస్తామని కాంగ్రెస్ అధిష్టానం తెల్చి చెప్పింది. దీంతో జిల్లా అధ్యక్షుల ఎన్నిక వాయిదా పడిందనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. పాత కమిటిలనే కొనసాగించాలని స్పష్టం చేయడంతో ప్రస్తుత నాలుగు జిల్లాలకు అధ్యక్షుడిగా నాయిని రాజేందర్‌రెడ్డి కొనసాగనున్నారు. జిల్లా కమిటీల నుండి ఏఐసిసి వరకు ఎన్నిక అనేది దాదాపు అక్టోబర్ తరువాతనే ఉండే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ అధిష్టానం జిల్లా కమిటీలను నియమించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలనే దిశగా కసరత్తు మొదలుపెట్టింది. అయితే జిల్లాల పునర్విభజన తరువాత అన్ని జిల్లాలకు అధ్యక్షుల నియామకానికి ముందుకొచ్చింది. ప్రసుత్త వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షుడిగా పరకాల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఇనగాల వెంకట్రాంరెడ్డి పేరు ఖరారు కాగా మిగతా జిల్లాల అధ్యక్షుల ఎన్నిక ఏకగ్రీవానికి మొగ్గు చూపారు.
అదేవిధంగా జిల్లాల వారిగా అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకానికి సంబంధించిన అభ్యర్థుల జాబితాను సైతం సిద్ధం చేశారు. జిల్లా వారీగా నేతలను సమన్వయ పరిచారు. వర్గాలకు తావులేకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేసే నేతల జాబితాను తీసుకొని అందులో చేర్చారు. జిల్లాల వారీగా అధ్యక్షుల ఎన్నిక జాబితా దాదాపు ఖరారైన తరువాత పార్టీ అధిష్టానం అమోదం కోసం జాబితాను రాష్ట్ర నేతలు తీసుకొని ఇటీవల ఢిల్లీ వెళ్లారు. జిల్లాల పునర్విభజన తరువాత అధ్యక్షుల నియామకం గురించి నేతలకు వివరించారు. దేశంలో కేవలం తెలంగాణలోనే జిల్లాల విభజనను దృష్టిలో ఉంచుకొని కొత్త అధ్యక్షుల ఎన్నిక అవసరం గురించి వివరించారు. అయితే ఒక రాష్ట్రంలో కొత్తగా అధ్యక్షుల ఎన్నిక సరైంది కాదని అన్ని రాష్ట్రాలకు కలిపి ఒకేసారి నోటిఫికేషన్ జారీ చేసిన తరువాతనే తెలంగాణ కూడా ఎన్నిక జరుగుతుందంటూ స్పష్టం చేశారు. దీంతో జిల్లా అధ్యక్షుల ఎన్నిక దాదాపు ఖాయమైందనుకున్న తరుణంలో ఆ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో తాత్కాలికంగా నిలిచి పోయింది. ప్రస్తుతం నాలుగు జిల్లాలలకు కలిపి నాయిని రాజేందర్‌రెడ్డి అధ్యక్షులుగా కొనసాగనున్నారు. ఇక ఏమైనామార్పులు చేర్పులు ఉంటే అక్టోబర్ తరువాతనే ఉండొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో నేతల ఆశలపై నీళ్లు చల్లి నట్లైంది.

వచ్చే ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో జరుగుతాయని ఇప్పటికే పార్టీ అధిష్టానం సంకేతాలు ఇచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యాఖ్యనిస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో, కేంద్రంలో ముందస్తు సన్నాహాకాలు ఊపందుకున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఏడాది ముందుగానే అంటే ఈ ఏడాది చివరికి ఖరారు చేసే యోజనలో అధిష్టానం ఉన్నట్లు కాంగ్రెస్ శ్రేణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల్లో శ్రేణులకు అండగా ఉంటూ పార్టీ కోసం ఖర్చు చేసిన నాయకుల పేర్లను సేకరించి జాబితాను కూడా సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ముందస్తుగా అభ్యర్థుల ప్రకటన పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టు వ్యాఖ్యలు విన్పిస్తున్నాయ.

కొనుగోళ్ల కేంద్రాలలో పేరుకుపోయిన ధాన్యం
సంగెం, మే 14: లారీల కొరత వలనో, అధికారుల నిర్లక్ష్యం వలనో ప్రభుత్వ కొనుగోళ్ల కేంద్రాలలో ధాన్యం నిల్వలు పేరుకుపోయి దర్శనమిస్తున్నాయి. సంగెం మండల కేంద్రంతో పాటు ఎలుగూరురంగంపేట, నల్లబెల్లి గ్రామాలలో సంగెం సొసైటీ ఆధ్వర్యంలో రైతులకు మద్దతు ధర కల్పించేందుకు కొనుగోళ్ల కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలలో ఆదివారం నాటికి సుమారు 20 లారీల ధాన్యం పేరుకుపోయాయి. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించడానికి లారీలు రాకపోవడంతో కొనుగోలు కేంద్రాల వద్ద కుప్పలుకుప్పలుగా ధాన్యం బస్తాలు పేరుకుపోయాయి.
కొనుగోలు చేసిన ధాన్యం తరలించిన తర్వాతనే కొనుగోలు చేస్తామని అధికారులు తెలపడంతో కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన ధాన్యం వద్దనే రైతులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి దాపురించిందని వర్షం వస్తే ధాన్యం తడిసే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పుడు తరలిస్తారో అధికారులకే తెలియడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన ధాన్యాన్ని కాంటాలు ఎప్పుడు నిర్వహిస్తారో తెలియని పరిస్థితి నెలకొందని రైతులు అధికారులపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొనుగోలు చేసిన ధాన్యం నిల్వలను తరలించి రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన ధాన్యాన్ని కాంటాలు నిర్వహించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

మంటల్లో పడి వృద్ధుడి సజీవదహనం
జఫర్‌గడ్, మే 14: జఫర్‌గడ్ మండలంలోని కూనూరు గ్రామానికి చెందిన నస్కూరి నర్సయ్య(65) ప్రమాదవశాత్తు మంటల్లో పడి సజీవదహనం అయిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్థులు, పోలీసుల వివరాల ప్రకారం... కూనూరు గ్రామానికి చెందిన నర్సయ్య తన ఇంటి చుట్టుపక్కల చెత్తాచెదారం ఉండటంతో ఆ చెత్తాచెదారాన్ని పోగుచేసి నిప్పంటించాడు. ఆ క్రమంలో ఒక్కసారిగా ఈదురుగాలులు వీచడంతో ఆ గాలికి మంటలు చెలరేగి చుట్టుపక్కల ఉన్న చెట్లకు వ్యాపించి అక్కడే ఉన్నటువంటి నర్సయ్యకు సైతం మంటలు అంటుకోవడంతో తప్పుంచుకునేందుకు వెళ్తుండగా చెట్లకు తగిలి అక్కడే పడిపోయాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అటు వెళ్తున్న కొంతమంది గ్రామస్థులు అక్కడికి చేరుకొని నీళ్లు పోసి మంటలు ఆర్పివేశారు. అప్పటికే నర్సయ్య మృతిచెందాడని తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజన్‌బాబు తెలిపారు.

తెరాస కన్వీనర్ల నియామకంలో తిప్పలు?

వరంగల్, మే 14: ఉమ్మడి వరంగల్ జిల్లాలో టిఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గాల కన్వీనర్ల నియామకం పార్టీ అగ్రనాయకత్వానికి తలనొప్పిగా మారే పరిస్థితులు కనపడుతున్నాయి. నియోజకవర్గాల స్థాయిలో ఎమ్మెల్యేలు, పార్టీనాయకుల మధ్య సమన్వయం లేని కారణంగా నియోజకవర్గాల కన్వీనర్ల నియామకంలో చిక్కులు తప్పవనే అభిప్రాయం పార్టీవర్గాల్లో వ్యక్తం అవుతోంది. టిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం జరిగిన సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు రాజకీయాల్లో తలపండిన నాయకులు నాయకత్వం వహించారు. ఆ తరువాత పెద్ది సుదర్శన్‌రెడ్డి, రవీందర్‌రావు వంటి యువతరం నాయకులు పార్టీ బాధ్యతలు చేపట్టారు. గత ఏడాది టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లాను ఐదు జిల్లాలుగా విభజించిన నేపథ్యంలో కొత్త నాయకులకు పార్టీ నాయకత్వం లభిస్తుందని అందరూ బావించారు. ఇంచుమించుగా ఐదుజిల్లాలకు అధ్యక్షులను కూడా ఖరారు చేసినట్లు ఇటీవల వరకు పార్టీవర్గాల్లో ప్రచారం జరిగింది. కానీ తాజాగా పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయం ప్రకారం నియోజకవర్గ ఇన్‌చార్జీల నియామకం తెరపైకి రావటంతో కొత్త తలనొప్పులు తప్పవని పార్టీవర్గాలు చెబుతున్నాయి. పార్టీపరంగా నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల పాత్ర ముఖ్యమైనది కావటంతో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లోని పార్టీ ఇన్‌చార్జ్‌లు తమ ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. ప్రతి జిల్లాకు ఒక సమన్వయకర్తను నియమించాలని నిర్ణయించినా, జిల్లాలు పరిధి కుదించుకుపోవటం, ప్రతి జిల్లాలో రెండు, మూడు నియోజకవర్గాలు మించి ఉండకపోవటంతో నియోజకవర్గ కన్వీనర్లదే హవా కొనసాగే అవకాశం ఉందని పార్టీవర్గాలు భావిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 అసెంబ్లీ స్థానాలు టిఆర్‌ఎస్ చేతిలో ఉండగా ఒకటి, రెండు నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలను వ్యతిరేకించే వర్గం ఉండటంతో నియోజకవర్గాల కన్వీనర్ల నియామకం సందర్భంగా పోటీ తప్పదనే అభిప్రాయం పార్టీనాయకుల్లో వ్యక్తం అవుతోంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తమ చెప్పచేతుల్లో ఉండే నాయకుడిని పార్టీ కన్వీనర్‌గా నియమించుకోవాలనే ఆలోచనతో కొందరు ఎమ్మెల్యేలు ఉండగా, ఒకరిద్దరు ఎమ్మెల్యేలు నియోజకవర్గ కన్వీనర్ బాధ్యతలను కూడా తామే నిర్వహించాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. దీనివల్ల నియోజకవర్గాల్లో పోటీ తప్పని పరిస్థితి ఏర్పడింది. జిల్లా అధ్యక్షుల నియామకం కోసం అయితే పదవిని ఆశించే నాయకులకు సర్ధిచెప్పే అవకాశం ఉండేదని, కానీ 12 నియోజకవర్గాలకు కన్వీనర్లను నియామకం కోసం ఎందరో నాయకులను నచ్చజెప్పవలసిన పరిస్థితని అంటున్నారు. మరో రెండేళ్లలో ఎన్నికలు ఉండటంతో వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిత్వం ఆశిస్తున్న చాలామంది నాయకులు పార్టీ కన్వీనర్ పదవి ద్వారా అవకాశాలను మెరుగుపరచుకోవాలనే ఆలోచన ఉన్న నేపథ్యంలో పార్టీ అగ్రనాయకత్వానికి తలనొప్పిగా మారుతుందని పార్టీవర్గాలు చెబుతున్నాయి.
రాష్టక్రమిటీలో చోటుకు సీనియర్ల ప్రయత్నాలు
కాగా ఇప్పటి వరకు జిల్లా పార్టీ బాధ్యతలు నిర్వహించిన నాయకులతోపాటు పార్టీలో చాలాకాలంగా పార్టీలో కొనసాగుతున్న నాయకులు రాష్టక్రమిటీలో చోటు దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. కొత్త జిల్లాల నాయకత్వం కోసం ప్రయత్నాలు చేసిన నాయకులు ప్రస్తుతం నియోజకవర్గ కన్వీనర్ల వ్యవస్థ అమలులోకి వస్తున్న కారణంగా రాష్టస్థ్రాయిలో పదవులు దక్కించుకోవాలనే ఆలోచనతో ఉన్నట్టు సమాచారం.