కరీంనగర్

దేవస్థానం అభివృద్ధికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, మే 15: ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్‌గా పనిచేసే భాగ్యం కలగడం పురాకృత సుకృత ఫలితమేనని, భవత్సేవాభాగ్యంగా భావించి, దేవస్థానం, క్షేత్రాభివృద్ధికి శక్తివంచన లేని కృషి సల్పగలమని దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి ఉద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వ నియమిత ధర్మకర్తల మండలి పదవీ బాధ్యతలు స్వీకరించాక, సోమవారం దేవస్థానంలోని తమ ఛాంబర్‌లో ఎసి,ఇఓ నాయిని సుప్రియ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రప్రథమ సమావేశంలో పలు తీర్మానాలు గావించారు. దేవస్థాన సనాతన సాంప్రదాయాలు పరిరక్షిస్తూ, దేవాలయాల ప్రాశస్త్యాన్ని కాపాడుటకు, ముఖ్యమంత్రికి నివేదించిన 100కోట్ల అభివృద్ధి పనుల మంజూరీకై, చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ ద్వారా కృషి సల్పుట, దేవస్థానం పక్షాన వేద పాఠశాల ఏర్పాటుకు ప్రభుత్వాన్ని కోరుట, దేవస్థానం పక్షాన భక్తుల సహకారంతో గోశాలను ఏర్పాటు చేయుటకు ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. ధర్మకర్తలు మధు నటరాజ్ శర్మ, ఇనగంటి వెంకటేశ్వర్‌రావు, జోగినిపెల్లి రమాదేవి, మామిడి లింగన్న, అక్కనపెల్లి సునీల్ కుమార్, కోట బుచ్చి గంగాధర్, రాచకొండ నరేందర్, సాయిని శ్రీనివాస్, శివనీతి రమ్య, దోమకొండ తిరుపతి, మురికి భాగ్యలక్ష్మి, ప్రధానార్చకులు నంబి రఘునాథాచార్య పాల్గొన్నారు.
గజ ఈతగాడికి ఘన సన్మానం
ధర్మపురి, మే 15: ధర్మపురి పట్టణానికా చెందిన, స్థానిక గంగపుత్ర సంఘం అధ్యక్షులైన గజ్జి మల్లేశం సేవలకు గుర్తింపుగా బిసి యువజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్మపురి క్షేత్రంలో టిటిడి కల్యాణ మంటపంలో ఘనంగా సన్మానించారు. బిసి విద్యార్థి సంఘ జిల్లా అధ్యక్షుడు జాజాల రమేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, గజ్జి మల్లేశంను శాలువతో సత్కరించారు. ప్రధానంగా గోదావరిలో, నీటి వనరులలో మృత దేహాలను వెలికి తీయడంలో మల్లేశం బృందం చేస్తున్న నిస్వార్థ సేవను ఈశ్వర్ అభినందించారు. వైస్ ఎంపిపి రాజేశ్, పిఎసిఎస్ చైర్మన్లు రాజేందర్, నరేశ్, దేవస్థానం చైర్మన్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపిటిసిలు విజయలక్ష్మి, రమేశ్, కోఆప్షన్ సభ్యులు ఆసిఫ్, ఎంపిడిఓ శశికళ, ఎంఇఓ రాజమహేందర్, వ్యవసాయ మార్కెట్ ఆమజీ చైర్మన్లు భీమయ్య, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.