వరంగల్

శ్రమించే అధికారులకు గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కలగుట్ట, జూన్ 4: విధి నిర్వహణలో శ్రమించే అధికారులకు శాఖపరమైన గుర్తింపుతో పాటు ప్రభుత్వ గుర్తింపు కూడా ఉంటుందని వరంగల్ పోలీస్ కమీషనర్ సుధీర్‌బాబు తెలిపారు. రాష్ట్ర ఆవతరణ దినోత్సవంలో తెలంగాణ రాష్ట్ర శౌర్య పతకాన్ని హన్మకొండ ఇన్స్‌పెక్టర్ సంపత్‌రావును ఆదివారం పోలీస్ కమిషనర్ అభినందించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రివార్డులు అధికారుల బాధ్యతలను మరింత పెంచుతాయని అన్నారు. ప్రభుత్వం పోలీసులపై ఉంచిన నమ్మకానికి తగ్గట్లుగానే ప్రజలకు సేవలందించాలని ఆయన తెలిపారు. ఇన్స్‌పెక్టర్ సంపత్‌రావు అందించిన సేవలకు గుర్తింపుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2016లో శౌర్యపతకాన్ని ప్రకటించింది. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డిసిపి వేణుగోపాల్‌రావు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మినపాల మృతి జీర్ణించుకోలేనిది

పరకాల, జూన్ 4: హిందూ ధర్మమే ప్రాణంగా జీవించే వ్యక్తి మృత్యువాత పడటం జీర్ణించుకోలేని విషయమని ఏబివిపి రాష్ట్ర సంఘటన మంత్రి జంగిళి రాంమోహన్ అన్నారు. శనివారం వడదెబ్బకు గురై ఏబివిపి నాయకుడు మినపాల నర్సింగరావు మృతి చెందిగా ఆదివారం నర్సింగరావు మృతదేహనికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
అనంతరం రాంమోహన్ మాట్లాడుతూ చిన్న నాటి నుండి ఏబివిపి కార్యకర్తగా, కార్యదర్శిగా, భాగ్ కన్వీనర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా విద్యార్థి లోకానికి మరవలేని సేవలు అందించారని చెప్పారు. ఆయన వెంట ఏబివిపి మాజీ రాష్ట్ర అధ్యక్షులు బాబురావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏలేటి నాగరాజు, మాజీ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్, కట్టగాని శ్రీకాంత్, భాస్కరాచారి, ఈర్ల రాకేష్, యాట నరేష్, ఆర్‌పి సూర్య, సత్యం, మెండు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
నివాళి అర్పించిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి, బిజెపి నేతలు
వడదెబ్బకు గురై శనివారం మధ్యాహ్నం మినపాల నర్సింగరావు మృతి చెందగా ఆదివారం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, పరకాల నగర పంచాయతి చైర్మన్ మార్త రాజభద్రయ్య, వైస్ చైర్మన్ రమ్యమేఘనాధ్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ సిరంగి సంతోష్‌కుమార్, బిజెపి వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల అశోక్‌రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు వెన్నంపెల్లి పాపయ్య, ఆర్‌పి జయంత్‌లాల్, బండి సారంగపాణి, మడికొండ సంపత్‌కుమార్‌లు నివాళులు అర్పించారు.

నాణ్యమైన విద్యకు మూల్యంకన పద్ధతి పునాది
కాటారం, జూన్ 4: ఉపాధ్యాయులు నేర్చుకున్న మూల్యంకన పద్ధతితో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని మండల విద్యాధికారి విజయ్‌మోహన్ అన్నారు. ఆదివారం కాటారం మండల కేంద్రంలో కాటారం, మహాముత్తారం మండలాల ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరక బోధించే ఉపాధ్యాయులు పరిసరాల విజ్ఞానం అంశంపై పూర్తి అవగాహన కలిగియుండాలని, తద్వారా మారుతున్న కాలానికి అనుగుణంగా వాతావరణం మార్పులు, పర్యావరణం, కాలుష్యం తదితర అంశాలపై సమగ్రంగా విద్యార్థులతో చర్చాగోష్టితో పిల్లలు ఇష్టపడే రీతిలో విద్యా బోధన చేయవచ్చని సూచించారు. తరగతి గదిలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారి ఎదుగదలకు మొదటి నుంచే ప్రణాళిక బద్దంగా వ్యవహరించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య అందుతుందనే విషయాన్ని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. తరగతి గదిలో విద్యా బోధన విధానం, సామాగ్రి మదింపు, ప్రాజెక్టు పనులు, నిరంతరం మూల్యంకనం, పరీక్ష అంశాలు, గణితం, పరిసరాల విఙ్ఞనం అంశాలలో విద్యా ప్రమాణాలు ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం ఉపాధ్యాయులకు అవసరం అని మండల విద్యాధికారి విజయ్‌మోహన్ సూచించారు.