వరంగల్

గొర్రెల పంపిణీకి సిద్దం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, జూన్ 14: ఈ నెల 20వ తేదీ నుండి యదవులకు గొర్రెల పంపిణీ చేయుటకు సిద్దం కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ పి సింగ్ కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం హైద్రాబాద్ నుండి జిల్లా కలెక్టర్లతో జిల్లాలో గొర్రెల పంపిణీకి చెపడుతున్న చర్యలు, సాదాబైనామా పురోభివృద్దిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్ సి సింగ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెపడుతున్న గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 20నుండి జిల్లాలో పంపిణీ చేసేలా అన్ని చర్యలు చెపట్టాలని అన్నారు. జిల్లాల వారిగా వారికి కేటాయించిన ప్రదేశాలకు వెళ్లి గొర్రెలను కొనుగొలు చేయాలన్నారు. కొనుగొలు టీంలు కొనుగొలు ముందు గొర్రెలకు ట్యాగింగ్ చేయాలని, ఆరోగ్య పరీక్షలు చేసిన తర్వాతే రవాణా చేయాలని అన్నారు. ప్రణాళిక ప్రకారం లబ్ధిదారులకు యూనిట్లు అందేలా చూడాలన్నారు. సాదాబైనామాలపై ఎస్ సి సింగ్ సమీక్షిస్తూ ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు పట్టాలు ఇవ్వాల్సిందిగా కలెక్టర్‌లను ఆదేశించారు. అదేవిధంగా వారి భూములను క్రమబద్దీకరణ చేయాలని కోరారు. రైతుకు ఎకరాకు రూ.8వేలు అందజేయనున్న దృష్ట్య త్వరతిగతిన సాదాబైనామాలను పూర్తిచేయాలని కలెక్టర్లను ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా మాట్లాడుతూ.. జిల్లాలో ఈ నెల 20నుండి యాదవులకు గొర్రెలను పంపిణీ చేయుటకు సర్వం సిద్దం చేసినట్లు తెలిపారు. జిల్లాలో 23754మంది లబ్ధిదారులు ఉండగా మొదటి విడుతలో 11856మంది లబ్ధిదారులు ఎంపికైయ్యారని తెలిపారు. ఈ నెల 20నుండి పంపిణీకి సమగ్ర ప్రణాళిక రూపొందించామన్నారు. జల్లాలో 224సంఘాల ద్వారా లబ్ధిదారుల వాటాను సంబందిత సంఘం అకౌంట్‌లో జమచేయడం జరిగిందని అన్నారు. గొర్రెలకు పశుగ్రాసం నిమిత్తం 4మెట్రిక్ టన్నుల గ్రాసం పెంచుతున్నామన్నారు. కలెక్టర్ జిల్లాలో సాదాబైనామ ప్రక్రియను వివరిస్తూ 86,882్ధరఖాస్తులు రాగా 1,37,1640సర్వే నెంబర్‌లతో ధరఖాస్తులు వచ్చాయన్నారు. 1,11,904మందికి నోటిస్‌లు అందజేశామని 10,853్ధరఖాస్తులు అప్‌లోడ్ చేసి 5391్ధరఖాస్తులను బయెమెట్రిక్ ద్వారా మంజూరు చేశామన్నారు. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయని త్వరితగతిన పూర్తిచేస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరేన్స్‌లో హైద్రాబాద్ నుండి సిఎం పర్సనల్ సెక్రటరీ స్మితా సభర్వాల్, పశుసంవర్ధక శాఖ సంచాలకులు వెంకటేశ్వర్లు, మహబూబాబాద్ నుండి జెసి దామోదర్‌రెడ్డి, డిఎఫ్‌ఒ కృష్ణాగౌడ్,ప్రవీన్‌కుమార్, ఆర్డివోలు కృష్ణవేణి, భాస్కర్‌రావు, రెవిన్యూ, పశుసంవర్ధక శాఖ అధికారులు పాల్గొన్నారు.

పోడురైతులపై దాడులను ఆపాలి

మహబూబాబాద్, జూన్ 14: అనేక సంవత్సరాలుగా పొడుభూములను నమ్ముకొని జీవిస్తున్న రైతాంగంపై అటవీశాఖ అధికారుల దాడులు, బెదిరింపులు ఆపాలని ఎఐకెఎంఎస్ జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రభాకర్ అన్నారు. మానుకోటలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీ ఇతర పెద వర్గాలకు జీవనాధారం అయిన పొడుభూముల్లో హరితహారం అంటున్న కేసీఆర్‌కు లక్షల ఎకరాల మైదాన ప్రాంత భూములు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పొడుభూముల జోలికి వస్తే ఊరుకోమని, ప్రతిఘటిస్తామని ప్రభాకర్ హెచ్చరించారు. అదేవిధంగా కల్తీవిత్తనాలు మార్కెట్‌లో స్వైర విహారం చేస్తున్నాయని వాటిని అరికట్టడంలో ప్రభుత్వం, వ్యవసాయ శాఖలు పూర్తిగా విఫలం చెందాయన్నారు. నాలుగు విడతల రుణమాఫీ అపహాస్యంగా మారిందని వాటి వడ్డ్డీ గురించి గాని, నూతన అప్పుల గురించి గాని మాట్లాడే తీరిక ప్రభుత్వానికి లేదా అన్నారు. నేటి నుండి 20వరకు మండల, డివిజన్, జిల్లా కేంద్రంలో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జగ్గన్న, కొత్తపల్లి రవి, సమ్మన్న, జీవన్, వెంకటేశ్వర్లు, పైండ్ల యాకయ్య, సత్యం తదితరులు పాల్గొన్నారు.