వరంగల్

భద్రకాళీ దేవాలయంలో చండీయాగానికి ఏర్పాట్లు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూన్ 18: వరంగల్ నగరంలోని భద్రకాళీ అమ్మవారి దేవస్థానంలో విద్యారణ్య అర్షధర్మ రక్షణ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నుంచి ఐదురోజుల పాటు జరిగే చదుర్వేద హవన పురస్కృత చతురాయతన సహిత సహస్ర చండీయాగం ఏర్పాట్లు పూర్తయ్యాయి. చండీయాగానికి సంబంధించిన అంకురార్పణ కార్యక్రమం ఆదివారం శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. తొగుట శ్రీ మాధవానంద సరస్వతీ పీఠాధిపతి జగద్గురు శ్రీ మాధవనాంద సరస్వతీ స్వామి, కందుకూరి బసవరాజు దంపతులు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, నగర పోలీసు కమీషనర్ సుధీర్‌బాబు జ్యోతిప్రజ్వలన చేసి చండీయాగం కార్యక్రమానికి అంకురార్పణ జరిపారు. మొదట శంకరభగవత్పాదులను, వల్లభగణపతిని, భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వీరు చండీయాగం కోసం కొత్తగా దేవాలయ ఆవరణలో నిర్మించిన యాగశాలకు పశ్చిమ ద్వారం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన స్థలంలో గణపతిపూజ, పుణ్యాహవచనం, మాతృకాపూజ, ఆయుష్యమంత్రజపం, నాంది జరిపారు. శరీర శుద్ధి నిమిత్తం బ్రహ్మకూర్చహవనం పంచగవ్యంతో జరిపి కూశ్మాండ గణహోమాలు, వాస్తుశాంతి జరిపి పర్యగ్నికరణం చేసారు. అనంతరం అంకురార్పణ, ఉదకశాంతి, ప్రతిసరబంధం, రక్షోఘ్నహోమం నిర్వహించి అమ్మవారికి సాయంతన పూజ జరపటం ద్వారా అంకురార్పణ కార్యక్రమాన్ని పూర్తిచేసారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి తిరుమలదేవి, గోవిందలక్ష్మి, బుగ్వేద పండితులు, సంస్కృత భారతి అధ్యక్షుడు బ్రహ్మశ్రీ నరేంద్రకాప్రే, ఆయల వేదపండితుడు పాలకుర్తి నర్సింహ్మమూర్తి, విద్యారణ్య ట్రస్ట్ అధ్యక్షుడు నకిరేకంటి రాంమూర్తి, పోలా పశుపతినాథ్, తోట జగన్నాథం, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గుండా ప్రకాష్‌రావు, యాగశాల నిర్మాణదాత తాటిపెల్లి శ్రీనివాస్, ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు, కార్యనిర్వహణాధికారి సునీత తదితరులు పాల్గొన్నారు. వైదికాగమ చక్రవర్తి బ్రహ్మశ్రీ యెల్మంభట్ల సీతారామశాస్ర్తీ ఆచార్యత్వంలో చండీయాగం నిర్వహిస్తున్నారు.

నక్సల్స్ జనజీవన స్రవంతిలో కలిస్తే మంచిది
*మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి
గంగారం, జూన్ 18: నక్సల్స్ జనజీవన స్రవంతిలో కలిస్తే మంచిదని మహబూబాబాద్ జిల్లా ఎస్పి నంద్యాల కోటిరెడ్డి అన్నారు. గంగారం మండలం మడగూడెంలోని మావోయిస్టుపార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మావోయిస్టు అగ్రనేత యాప నారాయణ (హరిభూషన్) ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఆదివారం ఆయన కలిశారు. హరిభూషన్ తండ్రి యాప రంగయ్యకు 50కేజిల బియ్యం, బట్టలు, బకెట్‌లు, నిత్యావసర సరుకులు ఎస్పి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హరిభూషన్ పేరుమీద రూ.20లక్షల రివార్డు, అతని భార్య శారధ పేరుమీద రూ.5లక్షల రివార్డు ఉందని వారిద్దరు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిస్తే రూ.25లక్షలతో ప్రశాంతమైన జీవనాన్ని గడుపవచ్చని అన్నారు. కారడవులలో కష్టాలు పడి తిరిగే కన్నా బయటకు వచ్చి జీవితాన్ని గడుపడంలో ఎంతో ఆనందం ఉందని హరిభూషన్ అతని భార్య ఇద్దరు లొంగిపోయేలా తండ్రి వారికి చెప్పాలని ఎస్పి హరిభూషన్ తండ్రిని కోరారు. సమాజంలో న్యాయం చేయాలంటే నక్సలిజం ఒక్కటే మార్గం కాదని అది తెలుసుకోకుండా యువత నక్సలిజం వైపు ఆకర్షితులై వెళ్లి పోలీస్ ఎన్‌కౌంటర్‌లకు బలై తల్లిదండ్రులకు గర్భశోకాన్ని కలుగచేస్తున్నారని అన్నారు. లొంగిపోయిన నక్సలైట్లకు ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని ఈ అవకాశాన్ని నక్సల్స్ వినియోగించుకొని లొంగిపోవాలని కోరారు. తొలిసారి గంగారం మండలంకు వచ్చిన ఎస్పిని గ్రామస్థులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. మీకు ఎమైనా సమస్యలు ఉంటే చెప్పాలని ఎస్పి వారిని అడుగగా తమకు రోడ్డు సౌకర్యం సరిగా లేదని,మడగూడెం గ్రామం లోపలికి తారురోడ్డు కావాలని, పొడుభూములకు హక్కు పత్రాలు ఇవ్వకుండా అటవీ అధికారులు తమను ఇబ్బంది పెడుతున్నారని గ్రామాస్థులు తెలుపగా అధికారులతో మాట్లాడి మీ సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తానని ఎస్పి వారికి హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గూడురు సిఐ రమేష్‌నాయక్, కొత్తగూడె ఎస్సై సతీష్, మడగూడ సర్పంచ్ యాప భద్రమ్మ, వెంకటయ్య, గ్రామస్థులు పాల్గొన్నారు.

యుపిపిఎస్‌సి సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు
సగానికిపైగా దరఖాస్తుదారుల డుమ్మా
* 46శాతం అభ్యర్థులు మాత్రమే హాజరు...

వరంగల్, జూన్ 18: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ సివిల్ సర్వీసు ఉద్యోగాల కోసం ఆదివారం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలకు సగానికిపైగా అభ్యర్థులు డుమ్మా కొట్టారు. ఈ పరీక్ష నిర్వహణ కోసం వరంగల్ నగరంలో 14కేంద్రాలు ఏర్పాటుచేసారు. ఈ కేంద్రాల నుంచి 5964మంది అభ్యర్థులు యుపిపిఎస్‌సి పరీక్షకు హాజరుకావలసి ఉండగా కేవలం 2782మంది మాత్రమే పరీక్ష రాసారు. ఏ కారణంగానో 3180మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఉదయం 9-30 ఈ పరీక్ష ప్రారంభం అవగా రెండుగంటల ముందునుంచే అభ్యర్థులు ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకోవటం కనిపించింది. పరీక్షల నిర్వహణ కోసం జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. నగరంలోని సెయింట్ పీటర్స్ కళాశాలలో ఏర్పాటుచేసిన పరీక్షా కేంద్రంతోపాటు మరికొన్ని పరీక్షా కేంద్రాలను పబ్లిక్ సర్వీస్ కమీషన్ కార్యదర్శి క్రిస్టియానా, అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి సందర్శించి పరీక్షల నిర్వహణను పరిశీలించారు. అదే విధంగా నగర పోలీసు కమీషనర్ సురేంద్రబాబు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, పింగళి కళాశాలలో ఏర్పాటుచేసిన పరీక్షా కేంద్రాలను సందర్శించారు.

కళలకు పుట్టినిల్లు ఓరుగల్లు
* చరిత్ర పుటలలో ప్రత్యేక స్థానం *దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి
వడ్డేపల్లి, జూన్ 18: తెలంగాణాలోని ఓరుగల్లు కళలకు, సాహిత్యానికి పుట్టినిల్లు అని రాజధాని కేంద్రంగా నాటి నుండి నేటి వరకు కళలకు, సాహిత్యాలకు, ఉద్యమకారులకు పేరు పొందిన ఓరుగల్లు అని సిని దర్శకుడు ఎస్‌వి కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం ఓరుగల్లు కళావైభవం ఉత్సవాలలో భాగంగా నిట్ కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన లఘు చిత్రాల ఉత్సవాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కవులకు, కళాకారులకు, సాహిత్యకారులకు వరంగల్ కేంద్ర బిందువని, అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారని అలాంటి ఖ్యాతిగాంచిన వరంగల్ రాష్ట్రంలోనే విశిస్టమైన గుర్తింపు పొందిందని పేర్కోన్నారు. యువత అన్ని రంగాలతో పాటు నటనలో సందేశాత్మక చలన చిత్రాలు రూపొందించడం అలవాటు చేసుకుని, భవిష్యత్‌లో పెద్ద చిత్రాలు నిర్మించే స్థాయికి ఎదగాలని సూచించారు. యువత అనుకుంటే ఆకాశమే హద్దుగా ఏదైన సాధించవచ్చునని, సిని రంగంలో కూడ ప్రవేశించి అద్భుతాలు సృష్టించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. సిని నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ వరంగల్ కేంద్రంగా మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఓరుగల్లు కళావైభవం ఉత్సవాలు కళాకారులకు, కవులకు కళాభిమానులకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం కళాకారులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పలు పథకాలు అమలుచేయడం హర్షించ తగ్గ విషయం అన్నారు. ఈ సందర్భంగా అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి మాట్లాడుతూ యువతను ప్రొత్సహించడానికి ఓరుగల్లు కళావైభవం వేడుకలలో లఘు చిత్రాల అంశాన్ని పొందుపరచడం జరిగిందని అన్నారు. తదనుగుణంగా యువత కూడ స్పందించి 60 లఘు చిత్రాలను నమోదు చేసుకుని పలు సందేశాత్మక చిత్రాలు రూపొందించడం ప్రశంసనీయం అన్నారు.
బదిలీలు జరిగేది ఎన్నడూ..
ప్రభుత్వ ఉద్యోగుల ఎదురు చూపులు * స్థానికతపై ఇబ్బందులు తప్పవని ఆందోళన
వరంగల్, జూన్ 18: ఎనిమిది నెలలుగా పక్క జిల్లాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఏడాది సొంత జిల్లాలకు బదిలీలు ఉంటాయా.. లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఆర్డర్ టు సర్వ్ పద్దతిన ఎనిమిది నెలలుగా పక్క జిల్లాల్లో పనిచేస్తున్న వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు వేసవిలోనే బదిలీలు జరిగి తిరిగి సొంత జిల్లాలకు వెళ్లిపోతామనే ఆశతో ఉండగా వేసవి గడచిపోవటంతోపాటు విద్యాసంస్థలు ప్రారంభమై వారం రోజులు కావస్తున్నా బదిలీలపై ప్రభుత్వం నుంచి ఎటువంటి సంకేతాలు లేకపోవటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో బదిలీల ప్రక్రియ జరపకుంటే ఎవరు ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితుల్లో తమ పిల్లల చదువులు గందరగోళంలో పడతాయని ఉద్యోగులు వాపోతున్నారు. గత ఏడాది అక్టోబర్ నెలలో ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటుచేయటంతో జిల్లావ్యాప్తంగా ఆర్డర్ టు సర్వ్ కింద బదిలీలు జరిగాయి. జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న ఆయా శాఖలకు చెందిన వివిధ స్థాయి అధికారులను, సిబ్బందిని ఉమ్మడి వరంగల్ జిల్లానుంచి కొత్తగా ఏర్పడిన వరంగల్ రూరల్, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలకు బదిలీ చేసారు. ఈ సందర్భంగా కొత్త జిల్లాల పరిధిలోని ఉద్యోగులు ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వుల కారణంగా పక్క జిల్లాల్లో పనిచేయవలసి వచ్చింది. ఆరునెలల్లో స్థానికత ఆధారంగా అందుబాటులో ఉన్న పోస్టుల మేరకు ఉద్యోగులను సొంత జిల్లాలకు పంపిస్తామని అప్పట్లో ప్రభుత్వం హామీ ఇవ్వటంతో ఇష్టం ఉన్నా, లేకపోయినా అన్ని శాఖల ఉద్యోగులు కేటాయించిన జిల్లాలకు తరలివెళ్లారు. ఈ విధంగా జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి ప్రాంతానికి చెందిన ఉద్యోగులు ఇతర జిల్లాల్లో పనిచేయవలసి వస్తోంది. వరంగల్ జిల్లా కేంద్రంలోనే రూరల్ జిల్లా కార్యాలయాలు ఏర్పాటు జరిగిన కారణంగా రూరల్ జిల్లాకు కేటాయించిన ఉద్యోగుల విషయంలో ఇప్పటికి పెద్దగా ఇబ్బందులు లేకపోయినా భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు.
జాతీయ రహదారిపై మహిళల రాస్తారోకో
*్భరీగా నిలిచిపోయిన వాహనాలు
తొర్రూరు, జూన్ 18: తొర్రూరు మండలం నాంచారిమడురు గ్రామంలో గ్రామస్థులు ఎదుర్కొంటున్న తీవ్రమంచినీటి ఎద్దడి సమస్యను పరిష్కరించడంలో గ్రామపంచాయితీ అధికారులు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖిరికి నిరసనగా ఆదివారం మధ్యాహ్నాం గ్రామానికి చెందిన మహిళలు వరంగల్ - ఖమ్మం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ప్రతినిత్యం వేలాది వాహనాలు రాకపోకలతో రద్దీగా ఉండే జాతీయ రహదారిపై మహిళల రాస్తారోకో కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సంఘటనకు సంబందించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. నాంచారిమడురు గ్రామంలో తీవ్ర మంచినీటి ఎద్దడి సమస్య నెలకొందని, గ్రామస్థులు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుతూ గతంలో చాలాసార్లు సంబందిత అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినప్పటికి ఫలితం లేకుండా పోయిందని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోనెలకొన్న త్రాగునీటి ఎద్దడి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహిళలంతా కలసి ఖాలీ బిందెలతో జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు. మహిళల రాస్తారోకో కారణంగా వరంగల్-ఖమ్మం రహదారిపై రెండువైపుల సుమారు 2కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో సమాచారం తెలుసుకున్న తొర్రూరు సిఐ వి.చేరాలు హుటాహుటిన నాంచారి మడురి గ్రామానికి చెరుకొన్నారు.