వరంగల్

గిరిజనుల హక్కుల్ని కాలరాస్తున్న ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, జూలై 18: రాష్ట్రంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం గిరిజనుల హక్కుల్ని కాలరాస్తోందని వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. నర్సంపేట పట్టణంలోని సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యాలయంలో ‘పోడు భూమి సమస్య’పై లావుడ్యా రాజు అధ్యక్షతన మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. పోడు భూముల్ని హరిత హారం పేరుతో గిరిజనుల నుండి ప్రభుత్వం గుంజుకుంటుందని నాయకులు వాపోయారు. తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ జగదీశ్వర్ మాట్లాడుతూ టిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఆదివాసీలు, గిరిజనులు, ఎన్నో ఉద్యమాలు చేసి తమ హక్కుల కోసం అనేక చట్టాలను సాధించుకున్నారని చెప్పారు. ఆచట్టాలను అమలు చేయాల్సిన పాలకులు చట్టాన్ని ఉల్లంఘిస్తూ అనైతిక చర్యలకు పాల్పడుతున్నారన్నారు. న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు కోడి సోమన్న మాట్లాడుతూ పోడు భూముల కోసం రక్తం చిందించేందుకు సైతం పోడు రైతులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎంసిపి ఐ(యూ) రూరల్ జిల్లా కార్యదర్శి గాదెగోని రవి మాట్లాడుతూ పోడు రైతులపై బనాయించిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేసి, పట్టాలివ్వాలని కోరారు. పోడు భూముల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి ప్రభుత్వం యంత్రాంగం తెరదించాలన్నారు. సమావేశంలో సిపిఐ డివిజన్ నేత కందికట్ల వీరేష్, వివిధ ప్రజాసంఘాలు, రైతు సంఘాల నాయకులు చెన్నమళ్ల నర్సయ్య, గాలి శ్రీనివాస్, మాడ అశోక్, భూర్గు వీరన్న, బోగిపాణి, మంగన్న, అడ్డూరి రాజు, సంపత్, ఓదేలు, మోహన్, పాండ్యా, బిచ్చ, సుమన్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలి
* ఎమ్మార్పీఎస్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు మాది
నర్సంపేట, జూలై 18: పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు కళ్లెపల్లి ప్రణయ్‌దీప్ మాదిగ బిజెపి నాయకులను కోరారు. ఈమేరకు ఎమ్మార్పీఎస్ నాయకులు బిజెపి రూరల్ జిల్లా నాయకులు వడ్డేపల్లి నర్సింహారాములు, రేసు శ్రీనివాస్, కందకట్ల టాకరాజులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా కల్లెపల్లి ప్రణయ్‌దీప్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ఉద్యమం గత 23 సంతవ్సరాలుగా కొనసాగుతోందని చెప్పారు. ఎస్సీలలోని 59 కులాలను జనాభా దామాషా ప్రకాంర వర్గీకరణ జరగాలనే ఆందోళన రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రారంభమై దేశంలోని పది రాష్ట్రాలకు విస్తరించిందని తెలిపారు. గత ఏడాది నవంబర్ 27న హైద్రాబాద్‌లో జరిగిన ధర్మయుద్ద మహా బహిరంగసభకు లక్షలాది మాదిగలు, మాదిగ ఉపకులాల ప్రజలు తరలివచ్చి విజయవంతం చేశారని, ఈ క్రమంలో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయలను వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు దార నర్సింహారాములు, తదితరులు పాల్గొన్నారు.
అర్హులైన రైతులకు..పట్టాదారు పాసుపుస్తకాలు
* జాయింట్ కలెక్టర్ హరిత
నల్లబెల్లి, జూలై 18: సాదాబైనామాల ద్వారా ధరఖాస్తు చేసుకోని మోక మీద ఉన్న రైతులందరికి పట్టాదారు పాస్‌పుస్తకాలు అందజేస్తామని జాయింట్ కలెక్టర్ హరిత అన్నారు. మంగళవారం నల్లబెల్లి మండలంలోని ముచ్చింపుల గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సుకు జెసి ముఖ్య అతిథిగా విచ్ఛేసారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ ప్రభుత్వం సాధాబైనామాల ద్వారా పాసుపుస్తకాలను జారీ చేసే అవకాశాన్ని రైతులకు కల్పించిందన్నారు. ధరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు భూములను పరిశీలించి దశల వారిగా పాస్‌పుస్తకాలు అందజేస్తామన్నారు. అదే విధంగా 1బిలలో రైతుల పేరు నమోదు చేయడం వలన ప్రభుత్వం అమలు చేయనున్న 8వేల రూపాయల పథకాన్ని వర్తించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ రాజేంద్రనాథ్, ఆర్‌ఐ, వీఆర్‌వోలతో పాటు గ్రామ సర్పంచ్ సునీతసంతోష్, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా హ్యాండ్‌వాష్ డే
* అధికసంఖ్యలో హాజరైన విద్యార్థులు
మంగపేట, జూలై 18: చేతులను సబ్బుతో శుభ్రంగా కడిగితే అతిసార, శ్వాస కోశ, పసరిక, తదితర అంటు రోగాలు దరి చేరవని హైద్రాబాద్‌కు చెందిన యునిసెప్ సంస్థ ముఖ్య అధికారిణి మిథాల్ రస్డియా అన్నారు. మం గళవారం ఏటూరునాగారం మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలలో మండ ల విద్యాశాఖ అధికారి అనంతుల సురేందర్ అధ్యక్షతన స్వచ్ఛ జయ యో కార్యక్రమంలో భాగంగా విద్యార్ధులకు హ్యండ్‌వాష్ కార్యక్రమం నిర్వహించారు. దీనికి కలెక్టర్ ఆకునూరి మురళి, ములుగు సబ్ కలెక్టర్ విపి గౌతమ్, ఏటూరునాగారం ఐటిడిఏ పిఓ చక్రధర్‌రావు, జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య, ఏపిఓ వసంతరావు, స్థానిక సర్పంచ్ ఇర్సవడ్ల ఝాన్సీరాణి, జడ్పీటీసీ ఎండి వలియాబీ, ఎంపిపి మెహరున్నీసాలు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భం గా యునిసెప్ సంస్థ అధికారిణి మిథాల్ రస్డియా మాట్లాడుతూ విద్యార్ధులు విద్యార్ధి దశ నుండే పరిశుభ్రత గురించి తెలుసుకుంటే వ్యాధులు దరి చేరవన్నారు. ముఖ్యంగా సబ్బుతో చేతులు కడుగుకుంటే చాలా రోగాలు దరి చేరవని, మనకు వ్యాపించే వ్యాధులు ఎక్కువ శాతం చేతులను అపరిశుభ్రంగా ఉంచుకుని ఆహారం, ఇతరత్రా భుజించడం వలన మనకు తెలియకుండానే మన శరీరంలోకి క్రిములు ప్రవేశించి వ్యాధులు ప్రభలుతాయని ఆమె పేర్కొన్నారు. జయశంకర్ జిల్లా మారుమూ ల ప్రాంతంలో ఈ హ్యండ్‌వాష్ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందం గా ఉందన్నారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ హ్యండ్‌వాష్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విద్యార్ధులు పాల్గొనడం చాలా గొప్ప విషయమన్నారు. విద్యార్ధులు పాఠశాలలోనే కాకుండా ఇంటి వద్ద ఉన్న తమ తల్లిదండ్రులకు, చుట్టుప్రక్కల వారకి కూడా హ్యండ్ వాష్ చేయకపోవడం వలన కలిగే అనర్ధాలను వివరించి వారు కూడా హ్యండ్ వాష్ చేసుకునేలా చూడాలని అన్నారు. పాఠశాలలో వెయ్యి నళ్లాలను ఏర్పాటు చేసి పదమూడు వందల మంది విద్యార్ధులకు చేతులను సబ్బుతో కడుగుకునేందుకు చక్కని వసతులు సమకూర్చినందుకు పిఓ, ఎంఈఓ, ఇంజనీరింగ్ తదితర అధికారులను కలెక్టర్ అభినందించారు. అదేవిధంగా 85 శాతం ప్రజ లు బహిరంగ మల విసర్జన చేయడం కూడా వ్యాధులకు కారణమవుతుందని దీని వలన అంటు వ్యాధులు ప్రభలుతాయని అన్నారు. అనంతరం ఐటిడిఏ పిఓ చక్రధరరావు మాట్లాడుతూ స్వచ్ఛ జయయో హ్యండ్ వాష్ కార్యక్రమం ఏర్పాటు చేసిన యునిసెప్ సంస్థ అధికారులను, పిబ్బందిని అభినందించారు. మారుమూల గ్రామంలో ఇ లాంటి కార్యక్రమం చేపట్టడం హర్షణీయమన్నారు. జిల్లా వ్యాప్తంగా 960 ప్రభుత్వ పాఠశాలలో, 210 ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించారు. కార్యక్రమంలో యునిసెప్ సిబ్బంది ఎస్‌ఆర్ వెంకటేష్, జిల్లా టీం సభ్యులు అంజనా మణికంఠ, సరిత, రాజబాబు, చంద్రశేఖర్, శరత్, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్ధినీ, విద్యార్ధులు పాల్గొన్నారు. అదేవిధంగా మంగపేట మండల వ్యాప్తంగా ప్రభు త్వ, ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించారు. కమలాపురం ఆర్‌ఎంపి పాఠశాలలో నిర్వహించిన హేండ్‌వాష్ కార్యక్రమంలో ఎంపిడిఓ జి.కిషన్, ఎంఈఓ లకావత్ రాజేష్‌కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
కాటారం: మన చేతులను నిత్యం శుభ్రంగా కడుక్కోవాలని కోరుతూ మండలంలో ర్యాలీలు నిర్వహించి, ప్రజలను చైతన్యవంతం చేశారు. మంగళవారం కాటారం, కొత్తపల్లి, సుందరాజుపేట, ధన్‌వాడ, గంగారం ,తదితర గ్రామాల్లో ‘చేతులు శుభ్రంగా కడుక్కోవడం దినోత్సవం (హ్యండ్ వాష్ డే) గా నిర్వహించారు. ఆయా పాఠశాలల్లో నోడల్ ఉపాధ్యాయులు విద్యార్థులకు చేతులు డెటాల్ సబ్బుతో శుభ్రంగా కడగడంపై ప్రయోగాత్మకంగా కార్యక్రమం నిర్వహించారు. ప్రతి పాఠశాలకు ఇప్పటికే ఒక బకెట్ ను, ప్రతి విద్యార్థికి డెటాల్ సబ్బులను పంపిణీ చేశారు. జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ ఆకునూరి మురళి ప్రత్యేక శ్రద్దతో నిర్వహించిని హ్యండ్‌వాష్ డే సందర్భంగా జిల్లా యావత్తు ఒకేసారి కార్యక్రమం నిర్వహించిందని మండల విద్యాధికారి టి. విజయ్‌మోహన్ తెలిపారు. ఇంతవరకు హ్యండ్‌వాష్ కార్యక్రమంపై ఎక్కడా చేపట్టలేదని, కలెక్టర్ చొరవతో మంగళవారం జిల్లా వ్యాప్తం గా నిర్వహించిన కార్యక్రమం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులలో నమోదు కాగలదని ఆయన వివరించారు. కాటారం మండల కేంద్రంలోని పాఠశాలల సముదాయం నుంచి బయలు దేరిన విద్యార్థుల ర్యాలీ పురవీధుల గుండా కొనసాగింది. బస్టాండ్ కూడలిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యార్థులతో మానవహారం నిర్మించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిఙ్ఞ చేయించారు. సుందరాజుపేటలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పొరిక రాజా రాం ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కాటారంలో ఉపాధ్యాయులు జనగామ కరుణాకర్‌రావు, వొల్లాల రాములు, గంట రాజబాబు, దారం వెంకటేశ్వర్లు, బొల్లం సతీష్, గుగులోతు జయరాజ్, సమ్మయ్య నాయక్, తదితరులు పాల్గొన్నారు.
19, 20 తేదీల్లో కౌనె్సలింగ్
కెయుక్యాంపస్, జూలై 18: విద్యాసంవత్సరం 2017-18లో డిపిఈడి, బిపిఈడి వ్యాయామ విద్యాకోర్సుల్లో ప్రవేశాలకై అభ్యర్థుల సర్ట్ఫికేట్స్ పరిశీలన 19,20 తేదీల్లో ఉదయం 9 గం టల నుంచి కాకతీయ విశ్వవిద్యాల యం అడ్మిషన్ల డైరెక్టరేట్ కార్యాలయంలో జరుగుతుందని డైరెక్టర్ రవీందర్ తెలిపారు. జూలై 19న బిపిఈడి, 20న డిపిఈడి అభ్యర్థుల సర్ట్ఫికేట్ల పరిశీలన కొరకు ఓసి, బిసి అభ్యర్థులు రూపాయలు 500, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 300 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని చెప్పా రు. ఎన్‌సిసి క్యాప్ వంటి ప్రత్యేక క్యాటగిరి విద్యార్థులు సర్ట్ఫికేట్ల వెరిఫికేషన్ పరిశీలన హైద్రాబాద్ ఎవి కళాశాలలో జరుగుతుందని పేర్కొన్నారు.
కల్తీపై ఉక్కుపాదం
* భూపాలపల్లి ఎస్పీ భాస్కరన్
పరకాల, జూలై 18: జిల్లాలో కల్తీ వస్తువుల నివారణ, మత్తుపదార్థాల వినియోగాన్ని సమర్థవంతంగా కట్టడి చేసి, అక్రమార్కుల భరతం పడతామ ని భూపాలపల్లి ఎస్పీ ఆర్. భాస్కరన్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారుల తో కల్తీ ఆహార పదార్థాలు, మత్తు పదార్థాల రవాణా, విక్రయం, నకలీ విత్తనాలు, పిడిఎస్ రైస్ అక్రమ రవాణపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చట్ట వ్యతిరేక చర్యలకు జిల్లాలో స్థానం లేదన్నారు. కల్తీల నివారణ, మత్తు పదార్థాల రవాణా, నకలీ విత్తనాలను అరి కట్టేందుకు ప్రతి సబ్ డివిజన్‌లో ఎస్సై ఆధ్వర్యంలో స్పెషల్ టీంలు పనిచేస్తాయని చెప్పారు. జిల్లా పరిధిలో గంజాయి, గుట్కా ఇతర మత్తు పదార్థాలను విక్రయించకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీడ్స్ దుకాణాదారులు ప్రభుత్వ ఆమోదం పొందిన విత్తనాలనే విక్రయించాలని, బయో ప్రొడక్ట్ పేరట నాసిరకం ఉత్పత్తులను అమ్మితే చర్యలు తప్పవన్నారు. డిఎస్పీలు దక్షణమూర్తి, కెఆర్‌కె ప్రసాద్, సిఐలు సదన్‌కుమార్, వేణు, బాలాజి, మోహన్, రమేష్, బాపురెడ్డి పాల్గొన్నారు.
చెట్టు పునర్జన్మనిస్తుంది
* వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు
పరకాల, జూలై 18: అమ్మ జన్మనిస్తే చెట్టు పునర్జున్మనిస్తుందని వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు అన్నారు. మంగళవారం పరకాల మం డలం నాగారం జడ్పిపి హై స్కూల్‌లో పరకాల ఎసిపి సుదీంధ్ర ఆధ్వర్యంలో హరితహారం నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథులుగా కమిషనర్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హాజరైన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ హరితహారంలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలన్నారు.
* హరిత తెలంగాణే ధ్యేయం
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
హరిత తెలంగాణగా మార్చడమే ముఖ్యమంత్రి కెసిఆర్ ధ్యేయమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పరకాల మండలం నాగారం గ్రామంలో పరకాల పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహార కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొ న్ని మాట్లాడుతూ హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకోవాలన్నారు. చెట్లు ఉంటేనే వర్షాలు సంవృద్ధిగా కురస్తాయని పేర్కొన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని సంక్షేమ పథకాలు కెసిఆర్ అమలు చేస్తున్నారన్నారు. నాగారం గ్రామంలో 30వేల మొక్కలు నాటాలని, దానికి యువత సహకరించాలన్నారు.
* 10వేల మొక్కలు నాటేందుకు ప్రణాళిక
నాగారం గ్రామాన్ని తాము దత్తత గ్రామంగా తీసుకున్నామని ఏసిపి సుదీం ద్ర తెలిపారు. స్థానిక జడ్పి హైస్కూల్‌లో విద్యార్థులతో 2వేల మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డిసిపి ఇస్మాయిల్, సర్పంచ్ భిక్షపతి, ఎంపిటిసి, సిఐ, ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి, అభినవ్, సుధాకర్, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
విద్యాసంస్థల బంద్‌ను సక్సెస్ చేయండి
* వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు
నర్సంపేట, జూలై 18: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 21న జరిగే విద్యాసంస్థల బంద్‌లో విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు హన్మకొండ శ్రీ్ధర్, మొగిళిచెర్ల సందీప్‌లు మాట్లాడారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తోందని వాప్యోరు. ప్రభుత్వ పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం వంటి కనీస వసతులు లేక విద్యార్థులు నానా యాతన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్నా భోజనం అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కెసిఆర్ మాటలు ఆచరణలో కార్యరూపం దాల్చలేదన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడి పెరిగిపోయిందని, ఫలితంగా విద్యార్థుల తల్లితండ్రుల ఫీజుల భారాన్ని మోయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, ప్రైవేట్ ఫీజుల దోపిడిని అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఈనెల 21న జరిగే విద్యాసంస్థల బంద్‌కు అన్ని పాఠశాలల యజమాన్యాలు సహకరించాల్సిందిగా వారు కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నేతలు పరికి మధుకర్, జన్ను రమేష్, అమ్మిరెడ్డి, ప్రశాంత్, బారపాక సతీష్, తదితరులు పాల్గొన్నారు.
షెడ్యూల్డ్ తెగల కోసం కృషిచేయాలి
* మాజీమంత్రి రవీంద్రనాయక్
ములుగుటౌన్, జూలై 18: తెలంగాణ రాష్ట్ర షభ్రుత్వం షెడ్యూల్ తెగల సంక్షేమం కోసం కృషి చేస్తుందని మాజీ మంత్రి రవీంద్రనాయక్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలోని ఏజెన్సి ప్రాంతంలోనూ, మైదాన ప్రాంతంలోనూ షెడ్యూల్డ్ తెగల ప్రజలు జీవిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 12 సమైక్య రాష్ట్రంలోనే మొత్తం తెలంగాణ ప్రాంతంమే పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది అన్నారు. షెడ్యూల్ తెగల జనాభా ఆధారంగా నిధులు కేటాయించి ట్రైబల్ సబ్ ప్లాన్ అమలు చేయడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి గతంలో ఎన్నడూ లేని విధంగా షెడ్యూల్ తెగల అభివృద్దికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. గిరిజన తండాలను, గూడెంలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తుందని అన్నారు. 1/70చట్టం చిత్తశుద్దతో అమలు చేస్తుందని, భూమి లేని ఎస్సీలకు మూడెకరాలు సాగుకు యోగ్యమైన భూ వసతి కల్పిస్తుందన్నారు.
మొక్కల సంరక్షణ అందరి బాధ్యత
* రూరల్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
నర్సంపేట, జూలై 18: నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని వరంగల్ రూరల్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. మూడో విడత హరితహారంలో భాగంగా మంగళవారం నర్సంపేట తహశీల్ కార్యాలయంలో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ మొక్కలు నాటి వదిలేయకుండా వాటిని సంరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. వనాలతో మానవ మనుగడ సాధ్యమనే విషయాన్ని ప్రతి ఒకరూ గ్రహించాలన్నారు. హరిత హారంలో విరివిగా మొక్కలు నాటి రాష్ట్రంలోనే వరంగల్ రూరల్ జిల్లాకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకరావాల్సిందిగా సూచించారు. అనంతరం మల్లంపల్లి రోడ్‌లోని అమృత ఇండ్రస్టీస్‌లో కలెక్టర్ మొక్కలు నాటారు. అదే విధంగా ద్వారకపేటలోని ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆర్డీవో నెమురుగొమ్ముల రవి, డిఎఫ్‌ఓ పురుషోత్తం, తహశీల్దార్ పూల్‌సింగ్ చౌహాన్, టిఆర్‌ఎస్ నాయకులు మునిగాల వెంకట్‌రెడ్డి, నాయిని నర్సయ్య, కామగోని శ్రీనివాస్, నాగెల్లి వెంకటనారాయణ, గుంటి కిషన్, బండి ప్రవీణ్, పెండెం వెంకటేశ్వర్లు, మండల శ్రీనివాస్, నాగిశెట్టి ప్రసాద్, మందుల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
* ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి హన్మకొండ శ్రీ్ధర్
పరకాల, జూలై 18: విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని, జూలై 21న విద్య సంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ వరంగల్ రూరల్ జిల్లా కార్యదర్శి హన్మకొండ శ్రీ్ధర్ పిలుపునిచ్చారు. మంగళవారం పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి హన్మకొండ శ్రీ్ధర్ ముఖ్య అతిథిగా హాజరైన్నారు. ఈ సందర్భంగా శ్రీ్ధర్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్య రంగం సమస్యలకు నిలయాలుగా మారాయన్నారు. ప్రభుత్వం ప్రైవేట్ విద్య రంగాన్ని ప్రొత్సహిస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మూడు సంవత్సరాలు గడుస్తున్న కెజి టూ పిజి ఉచిత విద్యను అమలు చేయడం లేదని చెప్పారు. విద్య హక్కు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని, ప్రైవేట్ విద్య సంస్థలలో ఫీజులు నియంత్రించాలన్నారు. సంగారెడ్డి కలెక్టర్ విద్యార్థి సంఘాలపై జారీ చేసిన సర్క్యూలర్ ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జూలై 21న నిర్వహిస్తున్న విద్యా సంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కళ్యాణ్, వినయ్, సుమన్, రాజు, రాకేష్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
టెట్‌ను సమర్థవంతంగా నిర్వహించాలి
* జాయింట్ కలెక్టర్ దయానంద్
నక్కలగుట్ట, జూలై 18:తెలంగాణ రాష్ట్ర ఉపాద్యాయ అర్హత పరీక్షను ఈ నెల 23న సమర్థవంతంగా నిర్వహించాలని అర్బన్ జాయింట్ కలెక్టర్ దయానంద్ అన్నారు. జిల్లాలోని విద్యాశాఖ అధికారులతో మంగళవారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 23 ఆదివారం జరిగే టెట్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేసుకోవాలని సూచించారు. అర్భన్ జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ ఉదయం 9.30నుండి 12.00గంటల వరకు మొదటి పరీక్ష ఉంటుందని, 2.30 నుండి 5.00గంటల వరకు రెండవ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం నిర్వహించే పరీక్షకు 5126 మంది అభ్యర్థులతో 22 పరీక్షా కేంద్రాలలో, రెండవ పరీక్ష 25432 మంది అభ్యర్థులతో 109 పరీక్షా కేంద్రాలలో నిర్వహిస్తున్నామని తెలిపారు. అభ్యర్థులు ప్రింటెడ్ హాల్ టికెట్‌తో మాత్రమే పరీక్షా కేంద్రానికి హాజరు కావాలని, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలతో రాకూడదని తెలిపారు.