వరంగల్

మొక్కజొన్న రైతుకు.. మద్దతు ధర ప్రకటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, సెప్టెంబర్ 21: నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో రోజు రోజుకు మొక్కజొన్న ధర పడిపోతున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం దా రుణమని కాంగ్రెస్ పార్టీ నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్ తక్కళ్లపల్లి రవీందర్ రావు అన్నారు. మొక్కజొన్న రైతుకు మద్దతు ధర అందించాలని డిమాండ్ చేస్తూ గురువారం నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రవీందర్‌రావు మాట్లాడు తూ గత పదిహేను రోజులుగా నర్సంపేట మార్కెట్‌కు మొక్కజొన్న వెల్లువలా వస్తోందని, అయితే వ్యాపారులు, అడ్తీదారులు సిండికేట్ అయి క్వింటాల్‌కు కేవలం 11 వందల నుండి 12 వందల రూపాయల ధర పెడుతూ కొనుగోలు చేస్తున్నారని వాపోయారు. ఇదేమిటని రైతులు ప్రశ్నిస్తే హైద్రాబాద్‌లోనే 14వందలకు అన్‌లోడ్‌తో తాము ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని చెప్పుతున్నారని అన్నారు. అయితే మార్క్‌ఫెడ్ ధర 1425 రూపాయలు ఉందని, మార్కెట్‌లో ధర పడిపోతే వెంటనే మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపి కొనుగోలు చేయడంలో ప్రభుత్వం, మార్కెట్ అధికారులు విఫలం అయ్యారన్నారు. గత ఏడాది 17 వందల పైచీలుకు ధర పలికిన సమయంలో మార్క్‌ఫెడ్‌తో మొక్కజొన్నను కొనుగోలు చేసేందుకు సిద్దపడ్డ ప్రభుత్వం ఇప్పుడు ధర పడిపోయినా ఎందుకు కొనుగోళ్లు చేపట్టడం లేదని ప్రశ్నించారు. తక్షణమే మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపి 80 శాతం రైతాంగం వద్ద ఉన్న మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని, ఇదే సమయంలో కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళతామని స్పష్టంచేశారు. కార్యక్రమం లో నర్సంపేట, ఖానాపురం జడ్పీటిసిలు అజ్మీరా పద్మా మేఘ్యానాయక్, ఎడ్ల జగన్మోహన్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పెండెం రామానంద్, నేతలు రడం శ్రీనివాస్, కార్తీక్, నాగెల్లి సారంగం, మేర్గు సాంబయ్య, పుల్లూరి స్వామి, గంధం నరేందర్, బత్తుల ప్రతాప్‌రెడ్డి, గంట లక్ష్మారెడ్డి, సదయ్య, తదితరులు పాల్గొన్నారు.
సంచార మరుగుదొడ్లపై అధ్యయం చేయాలి
*మున్సిపల్ కమిషనర్ శృతి ఓఝా
వడ్డేపల్లి, సెప్టెంబర్ 21: మహానగర పాలక సంస్థ పరిథిలో చేపట్టబోయే సంచార మరుగుదొడ్ల నిర్మాణాలపై సమగ్రంగా అధ్యయం చేయాలని నగర పాలక సంస్థ కమీషనర్ శృతి ఓఝా ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం మహానగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులతో పూర్తి అయిన ఇంజనీరింగ్ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నగరంలో గతంలో చేపట్టిన షీ టా యిలెట్స్, కమ్యూనిటీ టాయిలెట్స్ పనుల పురోగతిపై అధికారులను అడిగి తె లుసుకున్నారు. పనులు ఎంత వరకు పూర్తి అయ్యాయని, ఇంకా పూర్తి కావసిన పనులు ఏ దశలో ఉన్నాయని ప్రశ్నించారు. అదేవిధంగా హిటాయిలెట్స్‌పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. జనరల్ పనులు మొత్తం 436 అని, అందులో ఇప్పటి వరకు ఎన్ని పనులు పూర్తయ్యాయని అధికారులను ప్రశ్నించగా, ఇప్పటి వరకు 341 పనులు పూర్తి అయ్యాయని వీటికి సంబంధించిన బిల్లులు కూడా చెల్లించడం జరిగిందని తెలిపారు. స్పందించిన కమీషనర్ మిగిలిన వాటిని కూడా వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఇఇ విద్యాసాగర్, లింగమూర్తి, జయ్‌పాల్, డిఇలు సంజయ్, ప్రభాకర్, రవీందర్ పాల్గొన్నారు.