వరంగల్

‘బతుకమ్మ, దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, సెప్టెంబర్ 21: వరంగల్ నగరంలో జరిగే బతుకమ్మ, దసరా ఉ త్సవాలకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తోందని అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి తెలిపారు. ఉర్సు కరీబాబాద్‌లో దసరా పండుగ రోజున నిర్వహించే రావణవధ కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను కలెక్టర్ గురువారం విడుదల చేసారు. ఈ సం దర్భంగా ఆమె మాట్లాడుతు నగరంలో మహిళలు బతుకమ్మ పండుగ జరుపుకునే ప్రాంతాలను గుర్తించి అవసరమైన సదుపాయాల ఏర్పాటుకు వివిధ శాఖలను ఆదేశించామని చెప్పారు. అదేవిధంగా దసరా ఉత్సవాలకు కూడా అవసరమైన ఏర్పాట్లు చేస్తామ న్నారు. ఉత్సవ కమిటీలు ఆయాశాఖల అధికారులతో సమన్వయం చేసుకుని అవసరమైన ఏర్పాట్లను కల్పించుకోవాలని, ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు. వాల్‌పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో దసరా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నాగపురి వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శి బండి కుమారస్వామి, కన్వీనర్ విజయబాబు తదితరులు పాల్గొన్నారు.
భోజనం సరఫరాలో ఇబ్బందులు తలెత్తొద్దు
అంగన్‌వాడీ కేంద్రాలకు అక్షయపాత్ర సంస్థ ద్వారా జరిగే భోజనం సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అర్బన్ కలెక్టర్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో అక్షయపాత్ర భోజ కార్యక్రమం అమలు తీరుపై మ హిళా, శిశసంక్షేమ శాఖ అధికారులతో, అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతు ఐసిడిఎస్ వరంగల్ అర్బన్ ప్రాజెక్టు పరిధిలోని 296 అంగన్‌వాడీ కేంద్రాలలో అక్షయపాత్ర కార్యక్రమం అమలు జరుగుతోందని, ఈ కార్యక్రమం నిర్వహణలో లోటుపాట్లు ఏర్పడకుండా, అంగన్‌వాడీ కేంద్రాలలోని లబ్ధిదారులకు మధ్యాహ్నం 12గంటల వరకు భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్బన్ జిల్లా పరిధిలోని హన్మకొండ, భీమదేవరపల్లి ప్రాజెక్టుల పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలలో కూడా అక్షయపాత్ర ద్వారా భోజనం అందించే లా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లా సంక్షేమశాఖ అధికారిణి శైలజాకుమారి, అక్షయపాత్ర పౌండేషన్ డైరెక్టర్ కౌతేయదాస్, సమాచార శాఖ అధికారి జగన్, సిడిపిఓలు సులోచన, విశ్వజ, తదితరులు పాల్గొన్నారు.
చీరల పంపిణీ .. దేశంలోనే అద్భుతం
* స్పీకర్ మధుసూదనాచారి
మొగుళ్లపల్లి, సెప్టెంబర్ 21 :బంగారు తెలంగాణ సాధనకోసం సంక్షేమం, అభివృద్దితో పాటు సంప్రదాయాలు ప్రతిబింభించేలా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలు పంపిణీ చేయటం దేశంలోనే ఒక ఆద్భుతమైన కార్యక్రమమని శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ఆన్నారు. మొగుళ్లపల్లి మండల కేంద్రంలో 1875మంది మహిళలకు బతుకమ్మ పండుగ చీరలను స్పీకర్ గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల పట్ల గౌరవంతో తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ పండుగకు ముందెన్నడు లేనివిధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిష్టత్మకంగా చేపట్టిన చీరల పంపిణీ అద్భుతమన్నారు. మహిళందరు పెద్ద కొడుకులా చీరలందించిన సిఎం కెసిఆర్‌ను దీవించాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ సునీత, ఎంపిపి విజయలక్ష్మీ, జడ్పీటిసి సంపెల్లి వసంత, సర్పంచ్ నిర్మల, ఎంపిటిసి లక్ష్మీ, టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తిరుపతిరావు, నేతలు చదువు అన్నరెడ్డి, జయపాల్‌రెడ్డి, పున్నంచందర్, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, మహిళలు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరికీ సామాజిక సేవ అవసరం
* ఆవోపా జిల్లా అధ్యక్షుడు
నక్కలగుట్ట, సెప్టెంబర్ 21: సమాజంలోని ప్రతి మనిషి ఎంతో కొంత సామాజిక సేవ చేయాలని, సామాజిక సేవతోనే సంతృప్తి కలుగుతుందని ఆర్య వైశ్య ఆఫీషియల్స్, ప్రొఫెషనల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి రవీందర్ అన్నా రు. గురువారం హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆవోపా అధ్వర్యంలో నిర్వహించే సామాజిక సేవా, ప్రోత్సాహం కార్యక్రమంలో భాగంగా 2016-17 విద్యా సంవత్సరంలో 10వ తరగతి నుండి పై తరగతులలో ప్రతిభ కనబరిచిన వరంగల్ జిల్లా వాస్తవ్యులైన విద్యార్థులకు ప్రతిభా పురస్కార అవార్డులను ఆవోపా భవన్‌లో ఈ నెల 15 ఇవ్వనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన దరఖాస్తులను ఆవోపా భవన్ హన్మకొండలో తీసుకుని 12వ తేదీలోగా అందించాలని సూచించారు. చందర్, ప్రకా శం, అశోక్, శ్రీనివాసరావు, రమణయ్య, పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
పనుల్లో నాణ్యత తప్పనిసరి
* మున్సిపల్ కమిషనర్ శృతి ఓఝా
వడ్డేపల్లి, సెప్టెంబర్ 21: మహానగర పాలక సంస్థ పరిథిలో చేపట్టిన అభివృద్ది పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించి నిర్మాణాలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ శృతి ఓఝా అన్నారు. గురువారం 19వ డివిజన్ శివనగర్‌లో నగర పాలక సంస్థ నిధులతో చేపట్టిన అభివృద్ది పనులను అధికారులతో కలిసి అకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ జనరల్ ఫండ్స్ నుండి నిర్మాణం అవుతున్న డ్రైనేజీల నిర్మాణాలను నిర్ధేశిత గడువులోగా పూర్తి చేయాలని అన్నారు. పనుల నిర్మాణాలలో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని, ఎలాంటి ఒత్తిడులకు లోనుకాకుండా పారదర్శకంగా పనులను నిర్వర్తించాలని అన్నారు. ఎస్‌డిఎఫ్, జనరల్ ఫండ్‌లతో ఇంజనీరింగ్ పనుల పురోగతి గురించి ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా డివిజన్లలో జరుగుతున్న డ్రైనేజీల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో కమీషనర్ పరిశీలించారు. ప్రతిపాదిత నమూనాను పరిశీలించి పనుల సక్రమంగా జరిగే విధంగా చూడాలని ఇంజనీరింగ్ అధికారులను కోరారు. కార్యక్రమంలో డిప్యూటి ఇంజనీర్ ప్రభాకర్‌తోపాటు, సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు.