వరంగల్

కష్టాలు తీరాలంటే కాంగ్రెస్ రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురవి, సెప్టెంబర్ 23: గిరిజనుల కష్టాలు తీరాలంటే మరలా రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ జాటోత్ రామచంద్రునాయక్ అన్నారు. కురవి మండలంలోని కాంపల్లి శివారు సక్రాంనాయక్‌తండాలో బానోత్ బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా రామచంద్రునాయక్ మాట్లాడుతూ....ఈ ప్రాంతంలో గిరిజనులకు అన్యాయం జరిగిందన్నారు. నిరుపేద గిరిజన కుటుంబంలో పుట్టిన రెడ్యానాయక్‌ను కాంగ్రెస్ పార్టీ అయిదుసార్లు ఎమ్మెల్యేగా చేసిందని, ఒక మారు మంత్రిగా చేసిందన్నారు. అయినా పదవీ వ్యామోహంతో కాంగ్రెస్ పార్టీని మోసం చేసి టిఆర్‌ఎస్‌లో చేరారన్నారు. ఈ ప్రాంతంలో గిరిజన తండాల్లో కనీస వౌలిక సదుపాయాలు లేక గిరిజనులు మగ్గిపోతున్నారన్నారు. తెలంగాణ ఉద్యమంలో గిరిజనుల పోరాటం చెప్పుకోదగ్గదని, అయినా పాలకులు గిరిజనులను నేటికీ మోసం చేస్తున్నారన్నారు. రిజర్వేషన్లలో అన్యాయం జరిగిందని, ఎన్నికల ముందు తండాలను పంచాయతీలుగా గుర్తిస్తామని హామీ ఇచ్చి నేటికీ నెరవేర్చలేదన్నారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిఆర్‌ఎస్ చేసింది ఏమిటన్నారు. కల్లబొల్లి మాటలు చెబుతూ రాష్ట్రంలో రోజులు వెల్లదీస్తున్న కేసిఆర్ ప్రజలకు రానున్న రోజుల్లో చేసింది ఏమీలేదన్నారు. ఏ తండాకు వెళ్ల్లినా రోడ్లు వేయిస్తున్నానని చెప్పే రెడ్యానాయక్ కేవలం కమీషన్ల కోసమే వేయిస్తున్నారన్నారు. 1986లో గిరిజనులకు రిజర్వేషన్లు ఇప్పించిన ఘనత మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి దక్కుతుందని, ఒక గిరిజనుడిని కేంద్ర మంత్రి చేసిన ఘనత సోనియాగాంధీకి దక్కుతుందన్నారు. రానున్నరోజుల్లో ప్రజలు ఆశీర్వదిస్తే ఈ ప్రాంతంలో కాంగ్రెస్ అనూహ్య మెజార్టీతో గెలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్‌చందర్‌రెడ్డి, జడ్పీఫ్లోర్ లీడర్ మూలగుండ్ల వెంకన్న, డోర్నకల్ ఎస్టీసెల్ అధ్యక్షుడు లాలూనాయక్, నర్సింహులపేట,దంతాలపల్లిల ఉమ్మడి అధ్యక్షుడు బిట్టునాయక్ పాల్గొన్నారు. వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో కాంపల్లి సర్పంచ్ బానోత్ మంగమ్మ, బాలాజీనాయక్, టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు కొప్పుల వెంకట్‌రెడ్డి, గండ్రా సత్యం, మతృనాయక్, సంత్యానాయక్, హేమా, షతృనాయక్, పంతునాయక్, దేవ్లా, బాబు, మురళీ, అశోక్‌లు ఉన్నారు.

విఎన్నార్‌కు ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి

కేసముద్రం, సెప్టెంబర్ 23: టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే, కేసముద్రం మండలం అర్పనపల్లి గ్రామానికి చెందిన వేం నరేందర్‌రెడ్డి (విఎన్నార్)కు పదోన్నతి లభించింది. ఇప్పటి వరకు టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్న ఆయనను ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎంపిక చేయడం విశేషం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న వేం నరేందర్‌రెడ్డి 2009లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి విజయం సాధించారు. ఆ తరువాత టర్ములో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన నేపధ్యంలో మహబూబాబాద్‌ను ఎస్టీలకు కేటాయించడంతో విఎన్నార్‌కు పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. దీనితో ఆయన వరంగల్ నగరానికి రాజకీయ వలస వెళ్లాల్సి వచ్చింది. ఈ నేపధ్యంలో నరేందర్‌రెడ్డి టిడిపి అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితునిగా పేరుతెచ్చుకున్నాడు. కాగా ఇదే మండలం ఇనుగుర్తికి చెందిన గండు సావిత్రమ్మకు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పదవి దక్కింది. టిడిపి నేత గండు ఐలయ్య హత్య అనంతరం ఆయన సతీమణి అయిన సావిత్రమ్మ రాజకీయంలోకి అడుగుపెట్టారు. సావిత్రమ్మ కూడా పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. సావిత్రమ్మ గతంలో కేసముద్రం ఎంపిపిగా, వరంగల్ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలిగా, రాష్ట్ర మహిళా కమీషన్ సభ్యురాలిగా పనిచేశారు. అప్పటి సిఎం ఎన్టీ రామారావు శాసనమండలికి సావిత్రమ్మను నామినేట్ చేయగా కొద్దికాలానికే శాసనమండలి రద్దుతో ఆమె స్వల్ప వ్యవధిలో పదవికి దూరమయ్యారు. అయితే రాష్ట్ర కమిటీలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు నేతలకు పదవులు దక్కడం పట్ల స్థానిక టిడిపి శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.