వరంగల్

రాష్ట్రంలో రాక్షస పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసముద్రం, సెప్టెంబర్ 24: అన్యాయాన్ని ఎదిరించిన ప్రజలపై పోలీసులతో దాడులు చేయిస్తూ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ కుటుంబం రాక్షస పాలన సాగిస్తోందని, ఇందుకు సిరిసిల్ల జిల్లా నేరెళ్ల, జయశంకర్‌భూపాలపల్లి జిల్లా తాడ్వాయి లవ్వాల ఘటనలు నిదర్శనమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ ఆరోపించారు. ఆదివారం కేసముద్రం మండల కేంద్రంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడతాయని ఆశించిన ప్రజలు తెలంగాణ ఉద్యమాన్ని సాగించారన్నారు. తీరా తెలంగాణ వచ్చిన తరువాత ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ బలంతో గద్దెనెక్కిన సిఎం ఇప్పుడు ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నారన్నారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి సక్రమంగా అమలు చేయకుండా, పూటకో మాటతో ప్రజలను ఇంకా మబ్యపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 56శాతం వ్యవసాయాన్ని కౌలురైతులు చేస్తుండగా వారికి ఎటువంటి ప్రయోజనం కల్పించకుండా వ్యవసాయానికి పెట్టుబడి పథకం అమలు చేయడం సరికాదన్నారు. ఈ విధానం వల్ల వ్యవసాయ రంగం మరింత సంక్షోభంలో కూరుకపోతుందన్నారు. దళితులకు సాగు భూమి ఇస్తామని హామీ ఇచ్చింది మీరే.. తీరా భూమిని ఖాలీ చేయాలంటూ పోలీసులు, అటవిశాఖ అధికారులను ఉసిగొల్పేదీ మీరేనంటూ.. ప్రజలు ఇవ్వన్నీ గమనిస్తున్నారని, త్వరలో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. నాటి రజాకార్ల పాలన మాదిరిగానే.. గత పాలకుల తీరుగానే సిఎం కెసిఆర్ పాలన సాగుతోందని, అప్పట్లో వారిని ఎదిరించిన విధంగానే సిపిఎం నిత్యం ప్రజాపక్షం వహిస్తుందన్నారు. ప్రభుత్వ తీరుపై కలిసివచ్చే పార్టీలు, ప్రజాసంఘాలతో కలిసి పనిచేస్తామన్నారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీకి రాజీనామా చేసి సిపిఎంలో చేరిన చాగంటి కిషన్, మోడెం వెంకటేశ్వర్లుతో పాటు వివిధ గ్రామాలకు చెందిన పలువురు ఆ పార్టీలో చేరగా వారిని పార్టీలోకి స్వాగతించారు. ఈ సమావేశంలో మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, బందు సాయిలు, గునిగంటి రాజన్న, అల్వాల వీరన్న, మార్తినేని పాపారావు, మొగిలి, శ్రీశైలం తదితకెలె పాల్గొన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలి
* కాంగ్రెస్‌తోనే అభివృద్ధి, సంక్షేమం * కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్
నర్సంపేట, సెప్టెంబర్ 24: ఎన్నికల హామీలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని, రాబోయే ఎన్నికల్లో కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వాలకు బుద్ది చెప్పాల్సిందిగా కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్ పిలుపునిచ్చారు. ఖానాపురం మండలంలోని ధర్మరావుపేటలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఆదివారం జరిగింది. ఈసమావేశానికి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో పాటు బలరాంనాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈసందర్భంగా కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్ మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వస్తే వంద రోజుల్లో నల్లధనాన్ని వెలికి తీసి, ప్రతి పేద వాడి ఖాతాల్లో పదిహేను లక్షల రూపాయల డబ్బును వేస్తామని చెప్పిందని, ఇదే సమయంలో టిఆర్‌ఎస్ ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి మోసపూరితంగా అధికారంలోకి వచ్చిందన్నారు. ఎన్నికల హామీల వైఫల్యాలపై కాంగ్రెస్ శ్రేణులంతా ప్రజలకు వివరించి ప్రజాక్షేత్రంలో ఎండగట్టాల్సిందిగా పిలుపునిచ్చారు. నిరుపేదలకు డబుల్ బెడ్ రూంలు, దళితులకు, గిరిజనులకు మూడు ఎకరాల సాగు భూమి, కేజి టూ పిజి ఉచిత విద్య తదితర హామీలన్నీ అమలు చేయడంలో సిఎం కెసిఆర్ సర్కార్ పూర్తిగా విఫలం అయిందన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ది, సంక్షేమం సాధ్యమని స్పష్టం చేశారు.