వరంగల్

అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొర్రూరు, సెప్టెంబర్ 24: సూర్యపేట జిల్లా తిరుమలగిరి మండలం నుండి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రానికి ఆటోలు అక్రమంగా తరలిస్తున్న సుమారు 4.50క్వింటాళ్ల నల్లబెల్లం, 10కిలోల పటికను ఆదివారం ఉదయం స్వాదీనం చేసుకున్నట్లు తొర్రూరు సిఐ వి.చేరాలు, పెద్దవంగర ఎస్సై పవన్‌కుమార్‌లు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నాం పెద్దవంగర పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఆదివారం పెద్దవంగర క్రాస్‌రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో సూర్యాపేట జిల్లా తిరుమలగిరి నుండి తొర్రూరు రోడ్డుకు వస్తున్న టిఎస్ 03యుబి 1808 నెంబరు గల ఆటో అనుమానాస్పదంగా కనిపించడంతో ఎస్సై పవన్‌కుమార్ ఆటోను ఆపి తనిఖీ చేయగా అందులో సుమారు రూ.50వేల విలువ చేసే నాలుగున్నర క్వింటాళ్ల నల్లబెల్లం, 10కిలోల పటిక లభించినట్లు ఎస్సై తెలిపారు. అక్రమంగా నల్లబెల్లం తరలిస్తున్న ఆటోను సీజ్‌చేసి బెల్లం తరలిస్తున్న నేరంపై ఆటోడ్రైవర్ సిరివేణి రాజు, బెల్లం వ్యాపారి బొడ్ల శ్రీకాంత్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తొర్రూరు పోలీస్ సర్కిల్ పరిధిలో అక్రమ వ్యాపారాల దందా చేసేవారు తమ పద్దతిని మార్చుకొని అక్రమ వ్యాపారాన్ని మానుకోవాలని లేని పక్షంలో పోలీస్‌శాఖ పక్షంలో చర్యలు తప్పవని తీవ్రంగా హెచ్చరించారు.
ఘనంగా బతుకమ్మ సంబరాలు
జఫర్‌గడ్, సెప్టెంబర్ 24: జఫర్‌గడ్ మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో ఆదివారం బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. 5వ రోజైన బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో జఫర్‌గడ్ మండలంలోని ఆర్యవైశ్య మహిళలు పాల్గొని కోళాటాలు, బతుకమ్మ పాటలను పాడారు. ఇట్టి కార్యక్రమానికి జెడ్పీటిసి అరుణశ్రీ, ఎంపిటిసిలు భారతమ్మ, సోమలక్ష్మి, సర్పంచ్ స్వరూపలు పాల్గొన్నారు. అనంతరం జెడ్పీటిసి అరుణశ్రీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మను అధికారికంగా నిర్వహిస్తున్నారని అన్నారు. రోజురోజుకి బతుకమ్మ పండుగను ఎంతో ఆసక్తిగా నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రమేష్, వాసవిక్లబ్ అధ్యక్షుడు మణికాంత్, ప్రధాన కార్యదర్శి శ్రవణ్‌కుమార్, జిల్లా నాయకులు దశరథం, కృష్ణమూర్తి, కోశాధికారి రమేష్‌లు పాల్గొన్నారు.
చింతగింజ మింగి ప్రమాదవశాత్తు చిన్నారి మృతి
బచ్చన్నపేట, సెప్టెంబర్ 24: చింతగింజ మింగి ప్రమాదవశాత్తు ఓ చిన్నారి మృతిచెందిన సంఘటన ఆదివారం కొడువటూరు గ్రామంలో చోటుచేసుకుంది. సంఘటన వివరాల ప్రకారం... కొడువటూరు గ్రామానికి చెందిన రాసూరి లక్ష్మి, లింగంలకు ఓ కూతురు, కుమారుడు. కాగా కూతురు పవిత్ర(5) ఇంట్లో ఆడుకుంటు చింత గింజను మింగింది. ఆ గింజ ఊపిరితిత్తుల్లో తట్టుకొని శ్వాస మందగించింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పవిత్రను హైదరాబాద్‌లోని పిల్లల ఆసుపత్రి నీలోఫర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో భువనగిరి పట్టణం దగ్గరకు వెళ్లే సరికి ప్రాణం పోయింది. ప్రాణానికి ప్రాణమైన కూతురు తమ కళ్లేదుటే ప్రాణాలు వదలటంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. వారి దుఖఃన్ని చూసి గ్రామస్థులు కంట నీరు పెట్టలేక ఉండలేకపోయారు.