వరంగల్

అష్ట ఐశ్వర్యాలను కలిగించే మహాలక్ష్మీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కలగుట్ట, సెప్టెంబర్ 24:చరిత్ర ప్రసిద్ది గాంచిన వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళి దేవస్థానంలో అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్న దేవీ నవరాత్రి ఉత్సవాలు నాలుగవ రోజుకు చేరుకున్నాయి. నాలుగవ రోజు శరన్నవత్రులలో భాగంగా భద్రకాళి అమ్మవారిని మహాలక్ష్మీ అమ్మవారిగా అలంకరించారు. నవదుర్గా క్రమంలో నాలుగవదైన చంద్రఘంటా దుర్గా క్రమంలో బోధాయన ప్రొక్తదేవ పూజను అనుసరించి గిరిజాదుర్గ క్రమంలో అమ్మవారిని ఉదయం సూర్యప్రభ, సాయంత్రం హంస వాహనంపై తిరువీధులలో శోభాయమానంగా ఊరేగించారు. ఈ సందర్బంగా ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకుంటే సకల ఆపదలు తొలగిపోతాయని తెలిపారు. ముఖ్యంగా మహాలక్ష్మీ అమ్మవారిని మహిళలు పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని అన్నారు. ఈ రోజు ఆదివారం కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా రావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.
ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను భక్తులను ఎంతగానో అలరించాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి సునీత, సిబ్బంది అలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా పర్యవేక్షించారు.

టిడిపి కమిటీలలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు పెద్దపీట
* కేంద్ర కమిటీలో ముగ్గురికి అవకాశం * రాష్టక్రమిటీలో పలువురికి ప్రాతినిధ్యం
* 2019 ఎన్నికల లక్ష్యంగా నియామకాలు

వరంగల్, సెప్టెంబర్ 24: తెలుగుదేశం కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీలలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు భారీ ప్రాతినిధ్యం లభించింది. జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావుకు కేంద్ర కమిటీలో ఉపాధ్యక్ష పదవి లభించగా, ఇప్పటి వరకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రేవూరి ప్రకాష్‌రెడ్డికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సీతక్కకు పొలిట్‌బ్యూరో సభ్యులుగా ప్రమోట్ అయ్యారు. ఇకపోతే రాష్ట్ర కమిటీలో మాజీ ఎంపి చాడా సురేష్‌రెడ్డిని ఉపాధ్యక్షునిగా నియమించారు. గత కమిటీలో ప్రధాన కార్యదర్శులుగా వ్యవహరించిన వేం నరేందర్‌రెడ్డి, ఈగ మల్లేశంలకు మరోసారి అదే పదవులు దక్కాయి. కొత్తగా ఏర్పడిన భూపాలపల్లి జిల్లానుంచి చెందిన అజ్మీరా రాజునాయక్, జనగామ జిల్లా నుంచి గట్టు ప్రసాద్‌బాబును, మహబూబాబాద్ జిల్లా నుంచి గండు సావిత్రమ్మను కార్యనిర్వాహక కార్యదర్శులుగా నియమించారు. వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన పుల్లూరి అశోక్, రూరల్ జిల్లాకు చెందిన దొనికెల మల్లయ్య, జనగామ జిల్లాకు చెందిన జాటోతు ఇందిర, మహేందరర్‌గౌడ్, భూపాలపల్లి జిల్లాకు చెందిన రవీందర్‌గౌడ్‌లను కార్యదర్శులుగా నియమించారు. కొత్తగా కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీలకు నియమితులైన నాయకులు ఇప్పటికే జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయిలో పదవులు నిర్వహించిన వారే. 2019లో జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని కొత్త జిల్లాలకు, పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్న నాయకులకు పదవులు కట్టబెడుతు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారు.