వరంగల్

మాటలతో ప్రజలను మాయ చేస్తున్న కెసిఆర్ ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లబెల్లి, సెప్టెంబర్ 24: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మోసపూరిత మాటలు చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆరోపించారు. నల్లబెల్లి మండలం మేడపల్లి, రాంపూరం జంట గ్రామాల్లో ఆదివారం ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆ పార్టీ మండల అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే మాధవరెడ్డి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. జంట గ్రామాల నుండి 200మంది టిఆర్‌ఎస్ కార్యకర్తలు పార్టీకి రాజీనామ చేసి దొంతి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరగా వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి అహ్వనించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చటంలో విఫలమయ్యారని ఆరోపించారు. దీనికితోడు మాయమాటలతో అమాయక ప్రజలను మోసగిస్తున్నారని అన్నారు. తెలంగాణలో మహిళల సద్దుల బతుకమ్మ పండుగ కానుకగా సిరిసిల్ల చేనేత కార్మికులు నేసిన చీరలను అందిస్తామని ముఖ్యమంత్రి కెటిఆర్ ప్రకటించి తీరా చీరెల పంపిణీ నాటికి మాట నిలుపుకోవటంలో విఫలమయ్యారని చెప్పారు. బతుకమ్మ చీరెల పేరిట ప్రభుత్వం అందించే చీర ధర వందరుపాయలు కూడా ఉండదని అన్నారు. చీరెలు నాసిరకంగా ఉండటంతో చీరలను తీసుకున్న మహిళలు నడిరోడ్డుపై పంపిణీ చేసిన చీరలను తగులబెడితే అధికార పార్టీ నాయకులు కాంగ్రెస్‌పై బురదజల్లుతున్నారని అన్నారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నమంటున్న ముఖ్యమంత్రి సమగ్ర సర్వే, సాదాబైనామాలు, రైతు సమన్వయ కమిటీ అంటూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రైతు సమన్వయ కమిలలో సామాన్య రైతులు లేకుండా అధికార పార్టీకి చెందిన నాయకులను, కార్యకర్తలను సభ్యులుగా నియమించటం ఎంతవరకు సబబని ఎమ్మెల్యే ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూమి ఎక్కడ పంపిణీ చేశారో చూపించాలని డిమాండ్ చేశాడు. కేవలం ప్రజలకు మయమాటలు చెప్పడమే పనిగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలతో ప్రజలు విరక్తిచెంది కాంగ్రెస్ పార్టీవైపు చూస్తున్నరని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు హింగె మురళీధర్, మండల యూత్ అద్యక్షుడు వైనాల అశోక్ పాల్గొన్నారు.
టిబిజికెఎస్ గెలుపుతోనే కార్మికుల నూతన హక్కుల సాధన
* ఎంపి బొయినపల్లి వినోద్‌కుమార్
భూపాలపల్లి రూరల్, సెప్టెంబర్ 24: సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులకు నూతనంగా హక్కులు సాధన గుర్తింపు సంఘం ఎన్నికల్లో టిబిజికెఎస్ గెలుపుతో సాధ్యమవుతుందని కరీంనగర్ ఎంపి బోయినపల్లి వినోద్‌కుమార్ ఆన్నారు. ఆదివారం భూపాలపల్లిలోని భారత్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన టిబిజికెఎస్ సభలో వివిధ సంఘాలకు చెందిన కార్మికులు అధికసంఖ్యలో టిబిజికెఎస్‌లో చేరాగా ఆయన కండువాలు కప్పి ఆహ్వనించారు. జాతీయ సంఘాలు నేతల చరిత్ర కార్మికులకు తెలుసని, నాడు కేంద్రంవద్ద కార్మికుల హక్కులను తాకట్టు పెట్టి, వారసత్వ ఉద్యోగాలు రద్దు నిర్ణయంపై సంతకం చేసారని చెప్పారు. తెలంగాణ ఏర్పడితే వారసత్వ ఉద్యోగాలు ఇస్తామన్న హామీని నేరవేర్చే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం వారసత్వ ఉద్యోగాల విధానాన్ని పునరుద్దరణకు చర్యలు తీసుకుంటే ప్రతిపక్షాలు కుట్రలు చేసి కోర్టుకు వెళ్లడంతో అలస్యం జరుగుతోందని తెలిపారు. రానున్న రోజుల్లో వారసత్వ ఉద్యోగాలు సింగరేణి కార్మికుల కుటుంబాలకు వస్తాయని, అందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో చిత్తశుద్దితో ముందుకు వెళుతుందని అన్నారు. సింగరేణిలో గుర్తింపు సంఘంగా టిబిజికెఎస్ కార్మికులకు తెలంగాణ ఇంక్రిమెంట్, సకల జనుల సమ్మె వేతనాల చెల్లింపు, లాభాల వాట 15 నుంచి 23శాతం పెంచడం, 3100మంది డిపెండెంట్లకు ఒకే దఫా ఉద్యోగాలు సాధించిందని, భూపాలపల్లిలో కార్మికులకు 10శాతం హెచ్‌ఆర్‌ఏ అధికంగా ఇప్పించిందని తెలిపారు. రానున్న రోజుల్లో సింగరేణిలో మరిన్ని అనుబంధ పరిశ్రమలు ఏర్పాటుచేయడం, కార్మికులకు సొంత ఇంటి పథకం, డిపెండెంట్ ఉద్యోగాల పునరుద్ధరణతోపాటు మరిన్ని కార్మికుల హక్కుల సాధన ప్రధాన లక్ష్యమని చెప్పారు. పౌర సరఫరాల సంస్థ చైర్మన్, భూపాలపల్లి సింగరేణి ఎన్నికల ఇన్‌చార్జ్ పెద్ది సుదర్శన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపి సీతారంనాయక్, టిబిజికెఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బడితల సమ్మయ్య, అప్పని శ్రీనివాస్, స్వామి తదితరులు పాల్గొన్నారు.
లలితాదేవి రూపంలో అమ్మవారు
మంగపేట, సెప్టెంబర్ 24 : శరన్నవరాత్రుల మహోత్సవాలు మండలంలో ఘనంగా జరుగుతున్నాయి. కమలాపురం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం అమ్మవారు లలితాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. మంగపేట శ్రీమాచంద్ర శేఖర స్వామి ఆలయంలో ఆలయ అర్చకులు విస్సావజ్జుల నరేష్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. కమలాపురం రామాలయంలో ఆలయ అర్చకులు ప్రతాపురం శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో అమ్మవారిని లలితాదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం పుణ్యస్ర్తిలచే అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించారు. సాయంత్రం నీరాజన మంత్ర పుష్పం, తీర్ధ ప్రసాద గోష్టి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా గ్రామాలలో ప్రతిష్టించిన దుర్గామాత విగ్రహాల వద్దకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాకులు ఏర్పాట్లు చేశారు.

కుల వృత్తులకు అండగా ప్రభుత్వం
*అభివృద్ధే ద్యేయంగా ముందుకు వెళతాం
*నగర మేయర్ నన్నపనేని నరేందర్
వడ్డేపల్లి, సెప్టెంబర్ 24:గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులకు అండగా ఉంటుందని, అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామని నగర పాలక సంస్థ మేయర్ నన్నపనేని నరేందర్ అన్నారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌తో కలిసి 35వ డివిజన్ కడిపికొండ పెద్ద చెరువు, 6వ డివజన్ తిమ్మాపూర్ చెరువులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేపల పెంపకంలో భాగంగా చేపపిల్లలను చెరువులలో వదిలారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మిషన్ కాకతీయతో గ్రామాలలోని చెరువులు నీళ్లతో కళకళ లాడుతున్నాయని, వాటిలో చేపపిల్లలను పెంచడంతో దానిపై ఆధారపడి జీవనం గడుపుతున్న మత్స్యకార, ముదిరాజ్ కుటుంబాలు ఆర్థికంగా ఎంతో ఎదుగుతాయని అన్నారు. గత పాలకులు పాలనలో కుల వృత్తులు మరుగున పడ్డాయని, వాటిని కాపాడడం కోసమే ముఖ్యమంత్రి విశేష కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలలో ప్రజలు భాగస్వాములు కావాలని, ప్రజల మద్యలో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని, అందుకే ముఖ్యమంత్రి కెసిఆర్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారని కొనియాడారు. విలీన గ్రామాలైన కడిపికొండ, తిమ్మాపూర్‌లలో అభివృద్దికి అన్ని విధాల సహకరిస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలోని యువకులు ఎదైన సమస్యలు ఉండే వాట్సప్ ద్వారా కూడా తమ దృష్టికి తీసుకుని రావచ్చునని, వాటి పరిష్కారానికి వెంటనే కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పోరేటర్ చింతల యాదగిరి, శ్రీలేఖ, టి ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వరంగల్‌ను వణికిస్తున్న స్వైన్‌ఫ్లూ

వరంగల్, సెప్టెంబర్ 24: ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలను స్వైన్‌ఫ్లూ వ్యాధి హడలెత్తిస్తోంది. ఈ రెండు వారాలలోనే ముగ్గురు వ్యక్తులు స్వైన్‌ఫ్లూతో మరణించగా, మరికొందరు ఈ వ్యాధితో వరంగల్ ఎంజిఎం ప్రభుత్వ ఆసుపత్రులో, మరికొందరు హైదరాబాద్‌లోని వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. స్వైన్‌ఫ్లూ వ్యాధి ముదురుతోందనే ప్రచారంతో జనాలు వణికిపోతున్నారు. రోడ్డువెంట జనాలు తుమ్మినా, దగ్గినా చుట్టుపక్కల వారు భయపడిపోతున్నారు. ముందుజాగ్రత్త చర్యగా కొందరు మాస్కులు ధరించి రోడ్లపైకి వస్తున్నారు. ఏ మాత్రం శరీరం అలసిపోయినట్లు అనిపించినా అనుమానంతో ఆసుపత్రులకు వెళ్లి డాక్టర్లను కలవటం, పరీక్షలు జరిపించుకుని స్వైన్‌ఫ్లూ లేదని తేలాక హమ్మయ్య అనుకుంటున్నారు. మూడు, నాలుగేళ్లుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు అవుతున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి స్వైన్‌ఫ్లూ బాధితులు, మరణాలు ఎక్కువేనని తెలుస్తోంది. 15రోజుల కిందట వరంగల్ పోలీసు కమీషనరేట్ పరిధిలోని వర్ధన్నపేట సబ్‌డివిజన్ ఏసిపి స్వైన్‌ఫ్లూతో మరణించాడు. ఈ సంఘటన జిల్లావ్యాప్తంగా జనాలను హడలెత్తించింది. స్వైన్‌ఫ్లూతో మరణించిన ఏసిపి దుర్గయ్య యాదవ్‌కు పోలీసుశాఖలో మంచిపేరుండటంతో ఆయన మృతి పోలీసుశాఖలో కలవరం కలిగించింది. వివిధ స్థాయిలలోని చాలామంది పోలీసు అధికారులతో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నా స్వైన్‌ఫ్లూ భయానికి చాలామంది దూరంగా ఉండిపోవటం పరిస్థితి తీవ్రతను, జనాల్లో ఏర్పడిన భయాన్ని స్పష్టం చేసింది. గడచిన వారం రోజుల్లో మరో ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్‌లో స్వైన్‌ఫ్లూతో మరణించారు. వరంగల్ ఎంజిఎం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వార్డులో నలుగురు వ్యక్తులు స్వైన్‌ఫ్లూతో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మరికొందరికి కూడా స్వైన్‌ఫ్లూ సోకటంతో హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌లో వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఇటు వైద్యులు, అటు సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సప్త్ధామంలో చండీ యాగం
నక్కలగుట్ట, సెప్టెంబర్ 24:ములుగు రోడ్డునందు గల గురుధామంలో పూజ్య గురువులు సద్గురు శివానందమూర్తి ఉపదేశానుసారంగా నిర్వహింపడుతున్న కార్యక్రమాలలో భాగంగా ఆదివారం సప్త్ధామంలో చంఢీయాగం నిర్వహించామని ట్రస్టు బాధ్యులు గోపీచంద్ తెలిపారు. భక్తులు ముందుగా శివానందమూర్తి శివైక్యం చెందిన ప్రదేశానికి వెళ్లి దర్శనం చేసుకుని, అనంతరం సప్త్ధామం చేరుకున్నారు. సప్త్ధామంలో గణపతిపూజ, మహంకాళిపూజ, నవగ్రహపూజ, మహాసరస్వతిపూజలను జరిపి, రుద్రహోమం, చంఢీహోమాలను దుర్గాసాయి, రాహుల్ ఏక, ద్విరాజ్ మహేందర్ వేదపండితులు పూజకార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సామూహిక కుంకుమార్చనలు జరిగాయి. ఈ సందర్బంగా గోపీచంద్ మాట్లాడుతూ పరమగురవులు శివానందమూర్తి బోధించిన మార్గంలోనే భక్తులు నడుస్తున్నారని, వారి బోధనలు మానసిక ప్రశాంతతకు నిలయాలని తెలిపారు. గురువులు శివైక్యం చెందిన వారి బోధనలను, వారి ఉపదేశాలను సమాజంలోకి తీసుకుని వెళ్లడమే శిష్యులు, భక్తుల కర్తవ్యం అని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు సుదర్శన్‌రావు, మల్లిఖార్జున్‌రావు, పద్మ, ట్రస్టీలు సామనారాయణ, రాంరెడ్డి, సదాశివుడు, చక్రపాణి, శార్వాణి తదితరులు పాల్గొన్నారు.

క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం కల్పిస్తాం
* ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్

వరంగల్, సెప్టెంబర్ 24: క్రీడాకారులకు అవసరమైన ప్రోత్సాహం, సౌకర్యాలు కల్పించటం ద్వారా ఆయా క్రీడాలలో రాణించేలా ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటామని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ అన్నారు. అక్టోబర్ మూడవ తేదీనుంచి ఆరవ తేదీ వరకు మంగోలియాలో జరిగే మిస్టర్ మంగోలియా బాడీ బిల్డింగ్ పోటీలలో భారతదేశం తరపున పాల్గొంటున్న వరంగల్ నగరంలోని కాజీపేట ప్రాంతానికి చెందిన రామకృష్ణకు ఆదివారం జవహర్‌లాల్ నెహ్రు స్టేడియంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కరీంనగర్ జిలాల ఓదెలకు చెందిన హనుమంతు ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ ద్వారా లక్షరూపాయల చెక్కును అందచేసారు. 33సంవత్సరాల రామకృష్ణ గడచిన 13సంవత్సరాలుగా బాడీ బిల్డింగ్ క్రీడలో సాధన చేస్తు అనేక అంతర్జాతీయ పోటీలలో పాల్గొని మెడళ్లు కైవసం చేసుకున్నారు. 2013లో ఆల్ ఇండియా జూనియర్ బాడీ బిల్డింగ్ పోటీలలో బంగారు పతకాన్ని, 2014, 2015లో సీనియర్స్ విభాగంలో రజిత పతకాలను సాధించాడు. మలేసియాలో జరిగిన సౌత్ ఆసియా బాడీ బిల్డింగ్ పోటీలలో నాలుగవ స్థానం కైవసం చేసుకున్నాడు. ప్రస్తుతం రైల్వేశాఖలో ఉద్యోగం చేస్తున్న రామకృష్ణ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీలకు హాజరవుతున్నారు. రామకృష్ణను ప్రోత్సహించేందుకు ఓదెలకు చెందిన హనుమంతు ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ ద్వారా లక్షరూపాయల చెక్కును అందచేసారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతు క్రీడాకారులకు వరంగల్ పుట్టినిళ్లు వంటిదని, ఎంతోమంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పాల్గొని గుర్తింపు పొందారని తెలిపారు. కొంతకాలంగా సరైన ప్రోత్సాహం, అవకాశాలు లేక క్రీడాపరంగా జిల్లా వెనకబడిపోయిందని చెబుతు జిల్లాకు పూర్వవైభవం దక్కేలా నగరంలో రాష్టస్థ్రాయి, జాతీయ, అంతర్జాతీయ క్రీడలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నగరంలోని జెఎన్ స్టేడియం, ఇండోర్ స్టేడియం, మిగతా స్టేడియంలను అభివృద్ధి చేయటం ద్వారా క్రీడాకారులకు సరైన అవకాశాలు లభించేలా చూస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి ధనలక్ష్మి, సమాచారశాఖ డిప్యూటీ డైరెక్టర్ జగన్ తదితరులు పాల్గొన్నారు.

ఫార్మసిస్టులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి
* రాష్ట్ర జౌషధ నియంత్రణ మండలి డిమాండ్
వడ్డేపల్లి, సెప్టెంబర్ 24: ప్రజారోగ్య సంక్షేమంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న ఫార్మసిస్టులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర జౌషధ నియంత్రణ మండలి సభ్యులు ఉప్పు భాస్కర్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఏర్పాటు సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫార్మసీ ఆక్టు ప్రకారం అర్హులైన నిరుద్యోగ ఫార్మసిస్టులకు ప్రభుత్వం స్వయం ఉపాధి పథకం కింద మెడికల్ దుకాణాలను ఏర్పాటు చేసుకునేందుకు, పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేందుకు బ్యాంకుల ద్వారా ఆర్థిక రుణాలను మంజూరు చేసి నిరుద్యోగులకు బాసటగా నిలవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం అడ్డగోలుగా ఫార్మసీ కళాశాలలకు పిసిఐ అనుమతులు ఇవ్వడంతో, వేలాది మంది విద్యార్థులు తమకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశతో ఫార్మసీ కోర్సులను పూర్తి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 50వేల మంది ఫార్మసిస్టులు ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎపి, తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ ఇంకా విభజన జరగకపోవడంతో ఎపిలోనే తెలంగాణ ఫార్మసిస్టులు రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్ లాంటి ఇతర సేవలను కొనసాగిస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో ఫార్మసీ కౌన్సిల్, జౌషధనియంత్రన శాఖలు సంయుక్తంగా కార్యాచరణతో సమన్వయంతో పనిచేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు నక్కలగుట్ట కాళోజీ కూడలి నుండి అర్బన్ కలెక్టరేట్ వరకు ర్యాలీని నిర్వహిస్తున్నామని, ఇందులో ఫార్మసీ కౌన్సిల్, ఫార్మసీ కళాశాలల విద్యార్థులు, డ్రగ్గిస్ట్ కెమిస్ట్, జౌషధనియంత్రణ శాఖ, ఇండియన్ ఫార్మా స్యూటికల్ అసోషియేషన్, హాస్పటల్ ఫార్మసిస్టుల అసోషియేషన్ పాల్గొంటాయని పేర్కొన్నారు.

బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన ఎంపిపి
నల్లబెల్లి, సెప్టెంబర్ 24: రాష్ట్రప్రభుత్వం మహిళలు అంత్యత వైభవంగా జరుపురునే బతుకమ్మ పండుగ వేడుకలకు గ్రామాలలో ప్రజాప్రతినిదులు ఘనంగా ఏర్పాట్లు చేయాలని నల్లబెల్లి ఎంపిపి బానోతు సారంగపాణి అన్నారు. ఆదివారం నల్లబెల్లి మండలంలోని ఎస్సీ కాలనీల్లో మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ బతుకమ్మ వేడుకలను జాగృతి ఆద్వర్యంతో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి కెసిఆర్ మహిళలకు చీరలను పంపిణీ చేపట్టడం జరిగిందని తెలిపారు. కానీ ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రాక్రమాన్ని రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. బతుకమ్మ పండుగ ఆటస్థలాల వద్ద అవసరమైన వసతులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్లబెల్లి సర్పంచ్ కోటిలింగాచారి, ఎంపిటిసి రాజారాం తదితరులు పాల్గొన్నారు.