వరంగల్

ఇలా జరుగుతుందేంటీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 17: ఉమ్మడి వ రంగల్ జిల్లాకు చెందిన టిఆర్‌ఎస్ ము ఖ్యులపై అవినీతి ఆరోపణలు రావటం పార్టీశ్రేణులకు ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు ప్రతిపక్ష పార్టీల నాయకులు తెరాస ముఖ్యులపై ఆరోపణలు చేయగా, తాజాగా అధికార పార్టీ నా యకులు కూడా గళం విప్పటం పార్టీకి ఇబ్బంది కలిగించే అంశంగా మారింది. పార్టీలో సీనియర్లుగా పేరున్న ముఖ్యనాయకులు ఏకపక్ష దోరణితో వ్యవహరించటం, పార్టీశ్రేణులను పట్టించుకోని కారణంగా ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయి. పార్టీ అధినేత కెసిఆర్‌తో పా టు జిల్లాకు చెందిన ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పలు సందర్భాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యనేతలకు హెచ్చరికలతో కూడిన జాగ్రత్తలు చేసినా ఫలితం ఉండటం లేదని పార్టీ క్యాడర్ చెబుతోంది. ఉద్యమ సమయంలో అందరితో కలివిడిగా ఉన్న కొందరు ముఖ్యనాయకుల వ్యవహారశైలి పార్టీ అధికారంలోకి వచ్చాక పూర్తిగా మారిపోయిందని ఆయా నియోజకవర్గాల నాయకులు చెబుతున్నారు. ముఖ్యంగా టిఆర్‌ఎస్ ప్రభు త్వం ఏర్పడిన కొన్ని నెలలకే మంత్రి చందూలాల్, పరకాల ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వ్యవహారశైలిపై విమర్శలు వచ్చాయి. మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న చందూలాల్ తన సొంత నియోజకవర్గం వ్యవహారాలను పూర్తిగా తన కుటుంబ సభ్యుల చేతికి ఇచ్చివేసారని, చందూలాల్ కుమారుడు పార్టీ విషయంలో, పాలనా వ్యవహారాల్లో ఉద్యమ సమయంలో పనిచేసిన సీనియర్లను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల మంజూరులో తాను చెప్పిందే వేదం అనేలా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఒక సందర్భంలో జిల్లాకు చెందిన ముఖ్యనాయకుడు మంత్రి చందూలాల్ తనయుడిని పిలిపించి రాజకీయ భవిష్యత్తు చాలా ఉందని, పార్టీక్యాడర్‌తో సన్నిహితంగా మెలగాలని, ఆరోపణలకు ఆస్కారం లేకుండా వ్యవహరంచాలని సుతిమెత్తగా హెచ్చరికలు కూడా చేసినా పద్దతి మారలేదని పార్టీవర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గ వ్యవహారాలను మంత్రి చందూలాల్ పెద్దగా పట్టించుకోకపోవటం పార్టీక్యాడర్‌కు ఇబ్బందికరంగా మారింది. ఇకపోతే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వ్యవహారశైలి పార్టీకి మ రీ ఇబ్బందికరంగా మారిందని కొం దరు నాయకులు వాపోతున్నారు. ఎన్నికల్లో గెలిచిన నాటినుంచి తన పద్దతే వేరు అనే విధంగా ముత్తిరెడ్డి వ్యవహరిస్తున్నారని, దీనివల్ల ఇటు పార్టీక్యాడర్, అటు పాలనాయంత్రాంగం ఇబ్బందులకు గురికావలసి వస్తోందనే అభిప్రాయం గత కొంతకాలం నుంచి వినిపిస్తోంది. తాజాగా జనగామ పట్టణంలోని చెరువు భూమిని ఆక్రమించారనే ఆరోపణ పార్టీని కుదిపేసింది. ఆరోపణ చేసింది ఎవరో ప్రతిపక్ష నాయకుడు కాకుండా ఏకంగా జిల్లా కలెక్టర్ భూఆక్రమణపై బహిరంగ వ్యాఖ్యలు చేయ టం కలకలం సృష్టించింది. గతంలో ముత్తిరెడ్డి వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి స్వయంగా మందలించినట్లు ప్రచారం జరుగగా, ఇటీవలి కలెక్టర్ ఆరోపణలపై సిఎం సీరియస్‌గా ఉన్న ట్లు పార్టీవర్గాల చెబుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే.. భూపాలపల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభాపతి మధుసూధనాచారిపై, ఆయన కుటుంబ సభ్యులపై అధికార పార్టీకి చెందిన నాయకులు ఆరోపణ లు చేయటం పార్టీలో కలకలం లేపిం ది. శాసనసభాపతిపై పరకాల మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్థికపరమైన ఆరోపణలు చేయటంతోపాటు ఆయన కుమారులపైన కూడా విరుచుకుపడటం పార్టీకి మింగుడుపడని వ్యవహారంగా మారింది. భూపాలపల్లి నియోజకవర్గంలో స్పీకర్ కుమారుల పెత్తనం మితిమీరిపోయిందని, ప్రతి పనుల్లో పర్సంటేజీలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు గత కొంతకాలంగా వినిపిస్తుండగా, తాజాగా అధికార పార్టీ ప్రజాప్రతినిధే ఆరోపణలు చేయటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్సీ, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారనే విమర్శలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. పార్టీలో సీనియర్లుగా పేరున్న కొం దరు నేతలు నియోజకవర్గాలపై దృష్టి పెట్టకుండా కుటుంబ సభ్యులకు బాధ్యతలు అప్పగించటం, మరికొందరు నేతలు పార్టీక్యాడర్‌ను దూరం పెడుతు ఏకపక్షంగా వ్యవహరించటం సమస్యలకు ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ అధినేత జోక్యం చేసుకోకుంటే ముందుముందు మరికొందరు ముఖ్యులపై ఆరోపణల పరంపర తప్పదనే అనుమానాలు పార్టీశ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి.

రైతు సంక్షేమానికి పెద్దపీట
* సిసిఐ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
కేసముద్రం, అక్టోబర్ 17: రైతు సంక్షేమమే లక్ష్యంగా సిఎం కెసిఆర్ పనిచేస్తున్నారని, పండించిన పంటకు గిట్టుబాటు ధర, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించే విధంగా కృషి చేస్తున్నారని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. మంగళవారం కేసముద్రం మార్కెట్ యార్డులో కాటన్ కార్పోరేషన్ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రంలో వ్యవసాయమే ప్రధాన వృత్తి కావడంతో సిఎం కెసిఆర్ వ్యవసాయాభివృద్ధితోనే బంగారు తెలంగాణ సాధ్యమని గ్రహించి ఆ మేరకు వ్యవసాయాభివృద్ధికి అవసరమైన సాగునీటి కోసం అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని కొనియాడారు. వేల కోట్ల రూపాయలతో గోదావరి నదిపై ప్రాజెక్టులు నిర్మించడంతో పాటు వృధాగా సముద్రంలో కలుస్తున్న నీటి వినియోగానికి భగీరథ యత్నాలు చేస్తున్నారన్నారు. ఇప్పటికే పలు ప్రాజెక్టులు పూర్తయ్యాయని, మరికొన్ని త్వరలో పూర్తి చేయడం జరుగుతుందన్నారు. రైతులు తాము పండించిన పంటలను ప్రభుత్వం సూచించిన విధంగా నాణ్యత ప్రమాణాలు పాటించి మార్కెట్లలో విక్రయించుకొని మద్ధతు ధర పొందాలన్నారు. పత్తిని బస్తాల్లో కాకుండా విడిగా తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్‌రెడ్డి, మాజీ కార్యదర్శి బీరవెళ్లి భరత్‌కుమార్‌రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మెన్ ఓలం చంద్రమోహన్, కార్యదర్శి అంజిత్‌రావు, సిసిఐ పర్చేజింగ్ ఆఫీసర్ నితిన్, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మాచర్ల రమేష్, వైస్ ఎంపిపి అనంతరాములు, మాజీ జడ్పిటిసి కదిరె సురేందర్, సింగిల్‌విండో చైర్మెన్ గడ్డం యాకమూర్తి, నాయకులు నజీరహ్మద్, జాటోత్ హరీష్‌నాయక్, మోడెం రవీందర్‌గౌడ్, కొమ్మన్న, కదిరె ప్రకాష్, బానోత్ వెంకన్న, రవినాయక్ పాల్గొన్నారు.