వరంగల్

ఒకేచోట అన్ని పథకాల శంకుస్థాపనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 17: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వరంగల్ పర్యటన సందర్భంగా వివిధ పథకాల శంకుస్థాపనలు ఒకేచోట జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈనెల 20వ తేదీన ముఖ్యమంత్రి కెసిఆర్ వరంగల్ పర్యటనకు రావలసి ఉండగా, దీపావళి పండుగ నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లకు, జనాల తరలింపునకు ఇబ్బందులు కలుగుతాయనే అభిప్రాయం ఇటు అధికారులలో, అటు పార్టీ నాయకుల్లో ఏర్పడింది. ఈ విషయాన్ని పార్టీ ముఖ్యుల దృష్టికి తీసుకువెళ్లటంతో ముఖ్యమంత్రి పర్యటనను 22వ తేదీకి వాయిదా వేసారు. మొదటి విడతగా సుమారు ఏడువందల కోట్ల రూపాయల వ్యయంతో వరంగల్ రూరల్ జిల్లా పరిధిలోని సంగెం, గీసుకొండ మండలాల పరిధిలో ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు నిర్మాణానికి ముఖ్యమంత్రితో శంకుస్థాపన చేయించేందుకు ఏర్పాట్లు యుద్దప్రాతిపదికన జరుగుతున్నాయి. అదే విధంగా అర్బన్ జిల్లా పరిధిలోని వరంగల్ నగర శివారులో ఔటర్ రింగురోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం కూడా ఖరారు అయింది. ఇదే అవకాశంగా ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి చొరవతో తాజాగా మంజూరైన రాష్ట్రప్రభుత్వ నిధులతో చేపట్టే కాజీపేట రెండవ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి, మడికొండ ఇండస్ట్రియల్ పార్కు విస్తరణ పనులకు కూడా ముఖ్యమంత్రితో శంకుస్థాపన జరిపించాలని నిర్ణయించారు. మొదట్లో ఈ నిర్మాణాల శంకుస్థాపనలు ఎక్కడికక్కడే నిర్వహించాలని బావించారు. కానీ భారీ వ్యయంతో నిర్మించే ముఖ్యమైన ఈ పథకాలకు వేరువేరుగా శంకుస్థాపనలు చేయిస్తే ఏర్పాట్లతోపాటు జనసమీకరణకు ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశ్యంతో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు శంకుస్థాపన జరిగే చోట ముఖ్యమంత్రితో మిగతా పథకాలకు శంకుస్థాపన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని మంగళవారం మెగా టెక్స్‌టైల్ పార్కు నిర్మాణ స్థలాన్ని సందర్శించిన ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్వయంగా వెల్లడించారు. గతంలో జరిగిన వివిధ కార్యక్రమాల సందర్భంగా ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని 22న జరిగే కార్యక్రమాలకు ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వివిధ శాఖల అధికారులను కడియం ఆదేశించారు.