వరంగల్

చెరువుల్లోకి గోదావరి జలాలు తెప్పిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, అక్టోబర్ 17: నియోజక వర్గంలోని చెరువులన్నింటిలోకి గోదావరి నీటితో నింపి రైతులకు రెండు పంటలకు కావాల్సిన సాగునీటిని అందస్తానని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి ధయాకర్‌రావు అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ రిజర్వాయర్ నుండి వచ్చిన నీటితో మాధాపురం చెరువు నిండగా ధయాకర్‌రావు మంగళవారం ఆ చెరువులోని నీటిని విడుదల చేశారు. అక్కడినుండి తమ పార్టీ నాయకులు, కార్యర్తలతో కలిసి మూడు కిలోమీటర్లు పాదయాత్ర చేసి కడవెండికి చేరుకున్నారు. తాళ్ల చెరువు మత్తడి వద్ద గోదావరి జలాలతో పూజలు చేసారు. అనంతరం కడవెండి, సితారాంపురం, నిర్మాళ గ్రామాల్లో పర్యటించి కార్యకర్తలను కలిసారు. ప్రైవేటు సంస్థ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిభిరాన్ని ప్రారంభించి వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతంర కొడకండ్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. మాధాపురం, కడవెండి గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కొద్ది రోజుల్లోనే నియోజక వర్గ చెరువులన్ని దేవాదుల నీటితో నింపుతూ కళకళలాడేలా చేస్తానని హామీ ఇచ్చారు. చెరువుల్లో నీళ్లు ఉన్నప్పుడే గ్రామాల్లో అన్ని కులవృత్తుల ప్రజలకు బతుకు దెరువు దొరుకుతుందని అన్నారు. భూగర్భ జలాలు పెరిగి బావులు, బోర్లల్లో నీరు సమృద్ధిగా లభించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ఇప్పటికే 9గంటల నాణ్యమైన విద్యుత్ వస్తుందని వచ్చే సంవత్సరం నుండి 24 గంటలు సరఫరా చేసేందుకు ముఖ్యమంత్రి కేసి ఆర్ సిద్దమవుతున్నారని అన్నారు. నవాబ్‌పేట రిజర్వాయర్‌లోకి 15రోజుల్లో నీరు వస్తుందని తద్వారా నియోజక వర్గంలోన పలు చెరువుల్లోకి నీరు చేరే వీలుందన్నారు. అంతే కాక మల్కాపురం గ్రామంలో సుమారు 10టిఎంసిల నీటి సామర్థ్యం కల ఈ ప్రాంతంలోనే అతిపెద్ద రిజర్వాయర్‌ను నిర్మించేందుకు సిఎం అనుమతి ఇచ్చాడని అన్నారు. ఆ రిజర్వాయర్ పూర్తయితే జనగామ జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజక వర్గాలలోని కాలువలు 365రోజులు పారి పైరు పంటలతో తులతూగే అవకాశం ఉందన్నారు. రానున్న రెండు సంవత్సరాలల్లో ఈ కల నెరవేరనుందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు అడ్డుపడుతున్నారని విమర్శించారు. ప్రజల మన్ననలను చురగొని మళ్లీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే బయంతోనే వారు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ నెల 22న వరంగల్‌లో నిర్వహించే సిఎం కేసిఆర్ బహిరంగ సభకు నియోజక వర్గం నుండి అధిక సంఖ్యలో తరలివెళ్లాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమాల్లో గిరిజన సహాకార సంఘం రాష్ట్ర చైర్మన్ మోహన్‌గాంధీ నాయక్, పార్టీ జిల్లా నాయకులు ఆంజనేయులు, రమేష్‌రెడ్డిలు, దేవరుప్పుల, కొడకండ్ల మండల పార్టీల అధ్యక్షుడు బస్వమల్లేశం, వెంకటేశ్వర్‌రెడ్డి, సర్పంచ్‌లు హనుమంత్, వజ్రమ్మ, నాయకులు రత్నాకర్‌రెడ్డి, ప్రసాద్, యాకన్న, జలేందర్‌లు పాల్గొన్నారు.

బహిరంగ సభ ఏర్పాట్లపై అధికారులతో కడియం సమీక్ష
* మూడువేల వాహనాలు.. రెండు లక్షల మంది ప్రజల సమీకరణ
సంగెం, అక్టోబర్ 17: రాష్టమ్రుఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఈనెల 22వ తేదీన శంకుస్థాపన చేసే మెగా టెక్స్‌టైల్ పార్క్ ప్రాంతంలో నిర్వహిస్తున్న బహిరంగ సభ ఏర్పాట్లను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపి పసునూరి దయాకర్, జిల్లాపరిషత్ చైర్‌పర్స్‌న్ పద్మ, రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్యే ధర్మారెడ్డి, నగర పోలీసు కమీషనర్ సుధీర్‌బాబు మంగళవారం పరిశీలించారు. సంగెం, గీసుకొండ మండలాల పరిధిలో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కలెక్టర్, పోలీస్ కమీషనర్, వివిధ శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి కడియం విలేకరులతో మాట్లాడుతూ సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా 18వందల ఆర్టీసి బస్సులను, ప్రైవేటు వాహనాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సభకు వచ్చే ప్రజలకు త్రాగునీరు సౌకర్యం కల్పించడంతో పాటు సభస్థలానికి ప్రజలందరు చేరుకునేలా సభ ప్రాంగణానికి కిలోమీటర్ దూరంలో పార్కింగ్ స్థలలను కేటాయిస్తున్నట్లు చెప్పారు. సభకు నాలుగు వైపులనుండి జనం తరలివస్తారని, ఉకల్, తీగరాజుపల్లి, రంగశాయిపేట, మచ్చాపూర్ రహదారుల నుండి సభకు వాహనాలు వస్తాయని అన్నారు. ఈ రహదారులకు ఇరువైపున చెట్లపొదలను తొలిగించి రోడ్ల మరమ్మతులు చేయాలని అధికారులకు అదేశించారు. వరంగల్ అర్బన్, రూరల్ జిల్లా కలెక్టర్లు సమన్వయంతో విధులు నిర్వహించి వెంటనే రోడ్లను వెడల్పు చేయాలని, రోడ్లు లేనిచోట రోడ్లను నిర్మించాలని సూచించారు. సభాస్థలం పక్కనే మంత్రుల,ఎమ్మెల్యేల, ఎమ్యెల్సీల, ఎంపిల, రాష్టస్థ్రాయి కార్పొరేషన్ చైర్మన్లకు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాన్ని కేటాయించాలని పోలీస్ కమీషనర్ సుధీర్‌బాబుకు అదేశించారు. హెలీప్యాడ్ నుండి సభాస్థలం వరకు బారికేడ్లతో ప్రత్యేకంగా రోడ్డును నిర్మించాలని కలెక్టర్‌కు అదేశించారు. నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కల్పించడానికే కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును నిర్మిస్తునట్లు ఆయన వెల్లడించారు. జిల్లా అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా సభ విజయవంతం కోసం బాధ్యతాయుతమైన అధికారులకు పనులు అప్పగించాలని కలెక్టర్‌కు సూచించారు. 365రోజులు నీటిని వినియోగించుకునే విధంగా దేవాదుల వద్ధ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసిందని, దేవాదుల ముడవదశ పనులను చేపట్టి పంటలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. డిబిఎమ్48, 38 కాలువలకు మరమ్మత్తులు చేపట్టి చివరి ఆయకట్టుకు నీరు అందిచడానికి నిధులను కేటాయించినట్లు చెప్పారు. మిషన్‌భగీరథ ద్వారా డిసెంబర్ 31వ తేదీనాటికి ఇంటింటికి త్రాగునీరు అందిస్తామని అన్నారు. రాష్ట్రప్రభుత్వం సేకరించిన 1200 ఎకరాలలో నిర్మించే కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో 12వేల కోట్లరూపాయలు పెట్టుబడులు వస్తాయని , వివిధ దేశాల నుండి టెక్‌టైల్స్ పార్క్‌లో పెట్టుబడులు పెట్టాడానికి పెద్దపెద్ద వ్యాపారవేత్తలు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఏర్పాటుపై విలేకరులు అడిగిన పశ్నకు కడియం శ్రీహరి స్పందిస్తు దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, రూరల్ జిల్లా ప్రజాపతినిధులతో చర్చించి ప్రజల అభిష్టం మేరకు జిల్లాకేంద్రాన్ని ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ హరిత, టిఎస్‌ఐఐటి చైర్మన్ బాలమల్లు, ఎండి నర్సింహ్మారెడ్డి, జోనల్ మెనేజర్ రతన్థ్రోడ్, సంగెం, గీసుకొండ జడ్పీటిసిలు, ఎంపిపిలు, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.