వరంగల్

పోలీసుల త్యాగాలు మరువలేనివి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాటారం, అక్టోబర్ 17: పోలీసుల త్యాగాలు మరువలేనివని కాటారం డీఎస్పీ కే ఆర్ కే ప్రసాదరావు అన్నారు. మంగళవారం కాటారం పోలీసుల అధ్వర్యంలో పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీసు ఠాణాలో ఓపెన్ హౌజ్ కార్యక్రమం నిర్వహించారు. మండల కేంద్రమైన గారెపల్లి అంబేద్కర్ విగ్రహం ముఖ్య కూడలి నుంచి పోలీసు స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆదర్శ, వివేకానంద, కస్తూర్భా గాంధీ గురుకులం, ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు డీ ఎస్పీ ప్రసాదరావు సమాధానమిచ్చారు. తుపాకుల పనితీరును సమగ్రంగా వివరించారు. తుపాకులలోని రకాలను ప్రదర్శన రూపంలో చూపించారు. విద్యార్థులు తుపాకులను తమ చేతులతో తాకడం పట్ల అనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాటారం సర్కిల్ ఇన్స్‌పెక్టర్ చింతల శంకర్ రెడ్డి, కాటారం ఎస్‌ఐ తెలబోయిన కిరణ్, ఏఎస్‌ఐలు రాధాకిషన్, రవూఫ్, హెడ్ కానిస్టేబుళ్లు సుదర్శన్, మల్లేశం, కానిస్టేబుళ్ళు, సీఆర్‌పిఎఫ్ జవాన్లు పాల్గొన్నారు.
మహాదేవపూర్‌లో...
పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా మంగళవారం నాడు మహాదేవపూర్‌లో పోలీసుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్ కూడలిలో మానవహారంగా ఏర్పడి, నినాదాలు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులను అందించారు. అనంతరం ప్రభుత్వ అసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలలో మహాదేవపూర్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ ఓ రమేష్, పలిమెల ఎస్‌ఐ నరేష్, ఎఎస్‌ఐ చక్రపాణి, ఆసుపత్రి వైద్యులు గంట చంద్రశేఖర్, సత్యవిద్యా సాగర్‌లు పాల్గొన్నారు.

నర్సంపేట తహశీల్ ఎదుట టిమాస్ కార్యకర్తల ఆందోళన
నర్సంపేట, అక్టోబర్ 17: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నర్సంపేట తహశీల్ కార్యాలయం ఎదుట టిమాస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈసందర్బంగా టిమాస్ ఫోరం జిల్లా నాయకుడు భూక్య సమ్మయ్య మాట్లాడుతూ ఎన్నికల ముందు తెలంగాణ సమాజానికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కెసిఆర్ సర్కార్ పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు. ప్రధానంగా నిరుపేదలకు డబుల్ బెడ్ రూంలు, దళితులకు మూడు ఎకరాల సాగు భూమి, కెజి టూ పిజి ఉచిత విద్య అమలు తదితర పథకాలేవి అమలుకు నోచుకోలేదని వాపోయారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాబోయే రోజుల్లో టిమాస్ ఫోరం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనా కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన మెమోరాండాన్ని నాయబ్ తహశీల్దార్ వివేక్‌కు నాయకులు అందజేశారు. ఈకార్యక్రమంలో సిపిఎం పట్టణ అధ్యక్షుడు హన్మకొండ సంజీవ, టిమాస్ ఫోరం రూరల్ జిల్లా కన్వీనర్ కోరబోయిన కుమారస్వామి, టిమాస్ ఫోరం నాయకులు వంగాల రాగసుధ, షేక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.