వరంగల్

స్వయం ఉపాధి కల్పనకు ప్రభుత్వం చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, అక్టోబర్ 20: జిల్లాను గుడుంబారహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో సహకరిస్తున్న వారందరికి స్వయం ఉపాధి కల్పన కింద ప్రభుత్వం చేయూతను అందిస్తుందని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం హన్వాడ మండల పరిధిలోని తిరుమలగిరి గ్రామంలో మిషన్‌కాకతీయ పనుల్లో భాగంగా చెరువు పనులను ప్రారంభించారు. అదేవిధంగా హన్వాడ గ్రామంలో గుడుంబా విక్రయాలను మానివేసిన వారికి అబ్కారిశాఖ ఆద్వర్యంలో స్వయం ఉపాధి కల్పన కింద కల్పించిన దుకాణాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ఎంతో శ్రద్ద కనబరుస్తుందని కల్తీసారాతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని గ్రహించి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి ప్రజలను గుడుంబా తాగడానికి దూరం చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఎవరైతే గుడుంబాను తయారు చేస్తున్నారో వాటిని విక్రయిస్తున్న వారిలో కూడా మార్పు తీసుకువచ్చి పూర్తిగా గుడుంబా తయారీకి, విక్రయాలకు ప్రభుత్వం దూరం చేసిందన్నారు. అలాంటి వారిని ప్రభుత్వం చేయూతను అందించేందుకు వివిధ సంక్షేమశాఖల ఆద్వర్యంలో ఉపాధి కల్పన కింద రుణాలు ఇచ్చి వారికి జీవనోపాధి కల్పించడం జరిగిందన్నారు. ప్రజలందరు గుడుంబారహిత జిల్లా నిర్మాణంలో బాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా హన్వాడ మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే మండలంలో వందకోట్లకుపైగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని కొన్ని గ్రామాలకు ఇప్పటికే కోయిల్‌సాగర్ బ్యాక్ వాటర్ నుండి మిషన్‌భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీటి సౌకర్యం కల్పించే పథకం పూర్తి అయ్యిందన్నారు. అందులో భాగంగా హన్వాడ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలకు మంచినీరు చేరుకుందని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. అభివృద్ధిలో అందరు బాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో హన్వాడ సర్పంచు వెంకటమ్మ, తెరాస నాయకులు కొండ బాలయ్య, లక్ష్మయ్య, జంబులయ్య, బాలరాజు, కృష్ణయ్యగౌడ్, అన్వర్ హుస్సెన్, అంజనేయులు, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.