వరంగల్

రక్తదానంపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, అక్టోబర్ 20: రక్తదానంపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఎంతైన ఉందని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ అనురాధ అన్నారు. పోలీస్ అమరవీరుల దినోత్సవ వారోత్సవాల సందర్భంగా శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎస్పీ అనురాధ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ అనురాధ మాట్లాడుతూ రక్తదానం చేయడంతో ఒకరి ప్రాణాన్ని రక్షించినవారు అవుతారని తెలిపారు. రక్తదానం చేయడం పట్ల ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందని ముఖ్యంగా యువతి, యువకులు జిల్లాలో పలు మహానుబావుల జన్మదినాలు, వర్థంతుల సమయాల్లో రక్తదానాలు చేయడానికి ముందుకు రావాలన్నారు. అందులోభాగంగా పోలీస్ ఆమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వారోత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలతో వివిధ క్రీడలను నిర్వహించడం జరిగిందన్నారు. వారికి బహుమతుల ప్రదానం కూడా చేస్తున్నామని బహుమతులు చిన్నవైనప్పటికిని అందులో ప్రెండ్లీ పోలీసింగ్ విధానం అంశం ఉందని అంతేకాకుండా సమాజంలో శాంతిని నెలకొల్పడంలో ఎందరో పోలీసులు ఆమరులు అయ్యారని అన్నారు.