వరంగల్

గులాబిలో ఎవరి గుంపు వారిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, అక్టోబర్ 22: ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వరంగల్ టెక్స్‌టైల్ పరిశ్రమ ప్రారంభోత్సవ సభ సాక్షిగా మరోసారి డోర్నకల్ నియోజకవర్గంలోని తెరాస పార్టీ వర్గవిభేదాలు బట్టబయలయ్యాయి. ఎమ్మెల్యే రెడ్యానాయక్, మాజీ ఎమ్మెల్యే సత్యావతి రాథోడ్‌ల మధ్య కొనసాగుతున్న విభేదాలు ఆదివారం ప్రత్యక్షంగా కనిపించాయి. ముఖ్యమంత్రి సభకు భారీగా జనసమీకరణ చేసే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రెడ్యానాయక్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తన నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో గ్రామగ్రామాన పెద్ద ఎత్తున వాహనాలు ఏర్పాటు చేసి కార్యకర్తలను తరలించారు. తెరాస తరపున పోటీచేసి ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే సత్యావతి వర్గీయులు ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన వాహనాల్లో కాకుండా సత్యావతి రాథోడ్ నాయకత్వంలో ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసుకొని సభకు బయలుదేరి వెళ్లారు. దీంతో డోర్నకల్ నియోజకవర్గంలో పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే తరహాలో కొనసాగుతున్న తెరాస గ్రూపు విభేదాలు బట్టబయలయ్యాయి. కాంగ్రెస్ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా విజయం సాధించిన రెడ్యానాయక్ నియోజకవర్గ వర్గ అభివృద్ధి నినాదంతో తెలంగాణ రాష్టస్రమితిలోకి వచ్చారు. అంతేగాక తెరాస ముఖ్య నాయకులుగా కొనసాగిన సత్యావతి రాథోడ్, నూకల నరేష్‌రెడ్డిల కంటే వేగంగా ఎమ్మెల్యే రెడ్యానాయక్ ముందుకు కదిలారు. దానికి తోడు నియోజకవర్గంలో ప్రతి పనికి ఎమ్మెల్యేకే ప్రాధాన్యత అనే కెసిఆర్ నినాదంతో నియోజకవర్గంలో తెరాసలో పూర్తి ఆదిపత్యం సాధించారు. గ్రామ, మండల కమిటీలతోపాటు ఇటీవల ఏర్పాటు చేసిన రైతు సమన్వయ కమిటీల్లో కూడా పూర్తిగా తన అనుచరులకే పదవులు కట్టబెట్టడంతో డోర్నకల్ నియోజకవర్గ తెరాసలో తిరుగులేని నాయకునిగా మారారు. రెడ్యానాయక్ పార్టీలోకి వచ్చినప్పటి నుండి అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్న నరేష్‌రెడ్డి, సత్యావతి రాథోడ్‌లు గత కొంతకాలంగా నియోజకవర్గ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల సత్యావతి రాథోడ్‌కు, నరేష్‌రెడ్డికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా పదవులు రావడంతో మరోసారి వీరిరువురు ప్రత్యక్ష రాజకీయాల్లో చురుకుగా పావులు కదుపుతున్నారు. సత్యావతి రాథోడ్ అనుచరులు ప్రతి మండలంలోనూ ఉండగా వారికి ప్రస్తుతం తెరాసలో ఎటువంటి ప్రాధాన్యత లేదని చెప్పవచ్చు. కొంతకాలంగా వౌనం వహించిన సత్యావతి ఇటీవల కాలంలో తన అనుచరుల ద్వారా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి కేవలం తన వర్గం వారిని మాత్రమే సభకు తరలించారు.
ఒకే నియోజకవర్గంలో రెండు గ్రూపులుగా ముఖ్యమంత్రి సభకు తెరాస నాయకులు తరలివెళ్లడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. మరో ముఖ్యనేత నూకల నరేష్‌రెడ్డి మాత్రం పక్కనే ఉన్న మానుకోట నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా పూర్తిసమయాన్ని గత వారం రోజులుగా అక్కడే కేటాయిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర లోపే గడువు ఉన్న ఈ పరిస్థితుల్లో పార్టీ పురోగతికి ఈ విభేదాలు శ్రేయస్కరం కాదనే భావన సీనియర్ నాయకుల్లో కనిపిస్తుంది. ఇటీవల రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరిని మర్యాదపూర్వకంగా కలిసేందుకు సత్యావతి రాథోడ్ వెళ్లిన సమయంలో వీరు, రెడ్యానాయక్ ఎవరి దారి వారే అన్నట్లుగా ఉంటే మూడవ వారికి మేలౌతుంది జాగ్రత్త అని, అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని సున్నితంగా చర్చించి పంపినట్టు తెలుస్తుంది.
విభేదాలు మరింత ముదిరి గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి దాకా గులాబి తమ్ముళ్లు గ్రూపులు కట్టక ముందే అందరిని ఒకటి చేసే చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు.