వరంగల్

సిఎం పర్యటన.. విద్యార్థి, వామపక్ష, జేఏసీ నేతల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, అక్టోబర్ 22: వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలంలోని చింతలపల్లి వద్ద కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ శంకుస్థాపన, బహిరంగసభలకు ఎలాంటి ఆటంకం కలిగించుకుండా ఉండేందుకు వీలుగా నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా జెఎసి, విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసారు. జెఎసి నాయకులు షేక్ జావీద్, పొలబోయిన లక్ష్మయ్య, ఎర్రబోయిన రాజేశేఖర్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు హన్మకొండ శ్రీ్ధర్, పరికిరి మధుకర్, అజ్మీర వెంకన్న, గుగులోతు కుమారస్వామి, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు దిడ్డి పార్ధసారధిలను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం అదుపులోకి తీసుకున్న వారందరినీ వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. జెఎసి, వివిధ విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టుల పర్వం నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగింది.
పరకాల: పరకాల పాత మండలాలతో కలిపిన రెవెన్యూ డివిజన్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్‌తో స్పష్టంగా ప్రకటింప చేయాలని పేర్కొంటూ ముఖ్యమంత్రి కెసిఆర్ బహిరంగ సభను అడ్డుకుంటామని అఖిలపక్ష నేతలు ప్రకటించడంతో పోలీసులు ముందస్తుగా ఆదివారం ఉదయం అఖిలపక్ష నేతలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కొలుగూరి రాజేశ్వర్‌రావు, పిట్ట వీరస్వామి, క్రిష్ణయ్య, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు పసుల రమేష్, బొచ్చు క్రిష్ణారావు, బండి సారంగపాణి, ఆర్‌పి జయంతిలాల్, కొయ్యడ శ్రీనివాస్, దేవునూరి మేఘనాధ్, కాచం గురుప్రసాద్, ఇంగిళి వీరేష్‌రావు, యాట నరేష్, శ్రీకాంత్, రవీందర్, చాడ రవీందర్‌రెడ్డి, నక్క చిరంజీవి, కానుగుల గోపినాధ్, దుప్పటి సాంబయ్య తదితర అఖిల పక్ష నేతలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరకాల ప్రజలు ముక్త కంఠంతో పాత తాలుకా మండలాలను కోరుకుంటే ఎమ్మెల్యే పరకాలను రెండు మండలాలుగా చేస్తామని ఏక పక్ష నిర్ణయంతో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను, ప్రజలను పక్కదొవ పట్టిస్తున్నాడని చెప్పారు. అందుకు నిరసనగా శనివారం పరకాల పట్టణ బంద్‌కు పిలుపు నివ్వగా ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని విజయవంతం చేశారని చెప్పారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇప్పటికైనా పరకాల పాత తాలుకా మండలాలతో కలిపిన రెవెన్యూ డివిజన్ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో జిఓ జారీ చేయించాలని డిమాండ్ చేశారు. వారితో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు దామ అనిల్, ఏకు సారయ్య, వైఎస్‌ఆర్‌సిపి మండల అధ్యక్షులు బొచ్చు భాస్కర్, కుక్కుల విజయ్, కక్కు రాజు, సర్వేశం తదితరులు పాల్గొన్నారు.
రెవెన్యూ డివిజన్ కోసం ఉద్యమించడం తప్పా?
పరకాల ప్రజల చిరకాల వాంఛైనా పరకాల పాత తాలుకా మండలాలతో కలిపిన రెవెన్యూ డివిజన్ అడగడం తప్పా అని పరకాల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఇనగాల వెంకట్రాంరెడ్డి ప్రశ్నించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం గత మూడున్నర సంవత్సరాల కాలంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని చెప్పారు. నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు లేవని, దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదని, రైతులకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్న మార్కెట్ ఇంటర్వేన్షన్ ఫండ్ కేటాయించలేదని రైతులపై మొసలి కన్నీరు కారుస్తూ మోసం చేస్తున్నారని ఆరోపించారు.
వడ్డేపల్లి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరంగల్ అర్బన్ జిల్లాలో కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్కు శంకుస్థాపనను అడ్డుకుంటారనే నెపంతో ముందస్తుగా విద్యార్థులను అరెస్టు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాటోత్ సంతోష్ నాయక్ అన్నారు. శనివారం రాత్రి టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాటోత్ సంతోష్ నాయక్‌తోపాటు విద్యార్థులను హన్మకొండ పోలీసులు పోలీసుస్టేషన్‌కు తరలించడం అప్రజాస్వామిక చర్య అని విమర్శించారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు శంకుస్థాపనకు వస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌ను అడ్డుకుంటామనే భయంతోనే పోలీసులు అర్థరాత్రి ఇళ్లలోకి చొరబడి దొంగలు, రౌడీలను తీసుకుని వచ్చినట్లుగా విద్యార్థి నాయకులను తీసుకుని రావడం దారుణమని మండిపడ్డారు. తెరాస ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో తమ పర్యటనలను ప్రజలు అడ్డుకుంటారనే భయం తెరాస నాయకులకు పట్టుకుందని, ప్రజారంజకంగా పాలన కొనసాగిస్తే ఎవరు అడ్డుకుంటారని ఎద్దేవా చేశారు. తాము కనీసం అడ్డుకుంటామని పత్రిక ప్రకటన కూడా ఇవ్వలేదని, అయినా తెరాస నాయకులకు ఎందుకు భయం పట్టుకుందో అర్ధం కావడం లేదని అన్నారు. పోలీసులు కూడా అధికారపార్టీకి తొత్తులుగా వ్యవహరించడం సబబు కాదని అన్నారు. అధికారంలో ఎప్పుడు తెరాస నాయకులు ఉండరని, అధికారం ఏ ఒక్కరికీ శాశ్వతం కాదని పేర్కొన్నారు. అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరనే విషయం తెరాస నాయకులు గ్రహించాలని, తాము అనుభవిస్తున్న అధికారం విద్యార్థుల బలిదానాల వలన కలిగిందనే విషయం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. అరెస్టు అయిన వారిలో దిలీప్, రాజేష్, అఖిల్, మణికుమార్, అక్రమ్ తదితరులు ఉన్నారు.
సంగెం: రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించే బహిరంగ సభను అడ్డుకొనకుండా ముందస్తుగా భూ-నిర్వాసితులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులను, రైతు సంఘం నాయకులను అదుపులోకి తీసుకొని సంగెం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సంగెం చింతలపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును శంకుస్థాపన చేయడానికి ఆదివారం వస్తున్న సందర్భంగా ప్రతిపక్షలు,రైతు సంఘాల నుండి నిరసనలు ఎదురుకాకుండా పోలీసులు ముందుస్తుగా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. సంగెం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తీగల రవీందర్ గౌడ్, జిల్లా రైతు సంఘం నాయకులు సోమిడి శ్రీనివాస్ భూ-నిర్వాసితులు రౌతు నాగయ్య, పుచ్చ రాజయ్య, వల్లపు మల్లేషం, నల్లకుంట సమక్క, పోలీసులు అదుపులోకి తీసుకొని సంగెం పోలీసు స్టేషన్‌కు తరలించారు.
జనగామ టౌన్: ముఖ్యమంత్రి కేసి ఆర్ వరంగల్ జిల్లాలో పర్యటనకు ముందస్తు జాగ్రత్తగా పోలీసులు జనగామలో పలువురి నాయకులకు అదుపులోకి తీసుకోవడం ఆందోళన నిరసనలకు దారితీసింది. వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్క్‌కు శంకుస్థాపన చేసేందుకు ఆదివారం సిఎం కేసిఆర్ వస్తున్న సందర్భంగా జనగామ పోలీసులు సిపిఎం, సిపిఐ, వైసిపి, జెఎసికి చెందిన పలువురు నాయకులను తెల్లవారు జామున వారి ఇళ్లకు వెళ్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆ పార్టీలకు చెందిన మరికొంత మంది నాయకులు జనగామ చౌరస్తాకు చేరుకొని రాస్తారోకో నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అదుపులోకి తీసుకున్న మాజీ ఎమ్మెల్యే రాజారెడ్డిని, జేఏసీ జిల్లా చైర్మన్ ఆకుల సతీష్, సిపిఎం నాయకులు బొట్ల శ్రీనివాస్, బూడిద గోపిలను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేస్తు చౌరస్తాలో రాస్తారోకోకు పూనుకున్నారు. సమాచారం అందుకున్న ఎస్సై పరమేశ్వర్ చౌరస్తాకు చేరుకొని వారిని నివారించే ప్రయత్నం చేశారు. అయినప్పటికి వారు ఎస్సై మాటలు వినకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తు చౌరస్తా సెంటర్‌లో బైటాయించారు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా వాహనాల్లొకి ఎక్కించి పోలీసు స్టేషన్‌కు తరలించారు. నిరసన కార్యక్రమంలో నాయకులు కనకారెడ్డి, మిద్దెపాక సుధాకర్, ఆర్ రాజు, బొట్ల శేకర్, ఆకుల లక్ష్మయ్య, మల్లేశం, పాము కృష్ణమూర్తి, సాంబరాజు దుర్గాప్రాద్, ఉపేందర్‌లు పాల్గొన్నారు. అలాగే నర్మెట మండలంలో వై ఎస్ ఆర్‌సిపి జిల్లా కార్యదర్శ గౌరబోయిన సమ్మయ్య, మండల శాఖ అధ్యక్షుడు మేకల రమేష్, జిల్లా రైతు విభాగం కన్వీనర్ మల్లారెడ్డి, సిపి ఎం మండల కార్యదర్శులు ప్రజ్ఞాపురం నర్సింహులు, నాయకులు పండుగ రాజారాం, బిజెపి నాయకులు చిట్యాల మహిపాల్‌రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకొని సాయంత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణలో అప్రజాస్వామిక, నియంతృత్వ, రాచరిక పాలన చేస్తున్నాడని విమర్శించారు. హక్కుల కోసం ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ప్రజలే ఆయనకు గుణపాఠం చెపుతారని అన్నారు. కాగా రఘునాథపల్లి మండలంలో కత్తుల రాజు, చీమల నాగరాజు, పిట్టల రాజశేఖర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకొని సాయంత్రం వ్యక్తిగత పూచిపై విడుదల చేశారు.
తెలంగాణ బంగారు తెలంగాణ రాష్ట్రంగా మరబోతుందని అంటూనే ప్రతిపక్షాల నాయకులను అరెస్టుచేసి సభలు జరుపుకోవడం ఏంటని సిపిఎం మండల కార్యదర్శి గొల్లపల్లి బాపురెడ్డి విమర్శించారు. ఆదివారం వరంగల్ సిఎం సభను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్, సిసిఎం, సిపిఐ నాయకులను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ప్రతిపక్షాలు సభలు ఏర్పాటుచేసుకుంటామంటే అనుమతులు ఇవ్వకుండా, తాము సభలు పెట్టుకుంటూ ప్రతిపక్ష పార్టీల నాయకులను అరెస్టు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలను సాగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు నిదర్శనం ప్రస్తుత అరెస్టులతోపాటు జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను గృహనిర్బంధం చేయడం, సమర శంఖారావం సభకు అనుతినిచ్చి నిరాకరించడం వంటివే అన్నారు. మేధావులు, విద్యావంతులు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు అరెస్టులను ఖండించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయనవెంట రంగు బాలకృష్ణ, రమేష్, రాము, కనకయ్య, వెంకటేష్, సత్తయ్య తదితరులు ఉన్నారు.

అసత్య ఆరోపణలతో రాజకీయం

కాటారం / మహాదేవపూర్, అక్టోబర్ 22: అధికార టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు అసత్య ఆరోపణలతో రాజకీయం చేస్తున్నారని కాటారం, మహాదేవపూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు. ఆదివారం కాటారం మండలం దామెరకుంటలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్ రెడ్డి, మహాదేవపూర్ మండలం ఐబి అతిథి గృహంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో పార్టీ అధ్యక్షుడు జవ్వాజి తిరుపతి మాట్లాడారు. మాజీ మంత్రి శ్రీ్ధర్‌బాబుకు ప్రజల్లో వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక అక్రమ కేసులు బనాయించడానికి పూనుకుంటున్నారని వారు విమర్శించారు. అక్రమ కేసులు బనాయించాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊరుకోరని వారు హెచ్చరించారు. ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు తమ విధానాలను మార్చుకోవాలని కాంగ్రెస్ నాయకులు సూచించారు.
ఈ సమావేశాలలో కాటారం మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చీమల సందీప్, మాజీ డిసిఎంఎస్ ఉపాధ్యక్షుడు దబ్బెట రాజేశ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు తెప్పల దేవేందర్ రెడ్డి, నాయకులు చీమల వెంకటస్వామి, సుందిళ్ళ ప్రభుదాస్, కొట్టె శ్రీశైలం, టివి రమణ, కొట్టె ప్రభాకర్, రామిల్ల కిరణ్, అంగజాల అశోక్, మడిపెల్లి కిరణ్, పల్లె శ్రీనివాస్, కేతిరి రాజయ్య, అకుల చందు, మహాదేవపూర్ మండలంలో సర్పంచ్ కోట రాజబాపు గౌడ్, యువజన కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఎరవెల్లి విలాస్‌రావు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కేదారి గీతాబాయి, మాజీ జడ్పిటిసి చల్ల తిరుపతిరెడ్డి, ఉపసర్పంచ్ షాహినుల్లాఖాన్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు సారయ్య తదితరులు పాల్గొన్నారు.

ఓంకార్ త్యాగాలు చిరస్మరణీయం

నర్సంపేట, అక్టోబర్ 22: బూర్జువా, భూస్వామ్య పెత్తందారీ పాలకవర్గ పార్టీలకు ప్రత్యామ్నాయంగా కమ్యూనిస్టు, వామపక్ష శ్రేణులన్నీ ఒకే తాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని ఎంసిపిఐ(యు) రాష్ట్ర నాయకుడు గోనె కుమారస్వామి అన్నారు. ఎంసిపిఐ(యు) వ్యవస్థాపకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత మద్దికాయల ఓంకార్ తొమ్మిదవ వర్ధంతి సభ పార్టీ మండల కార్యదర్శి కొత్తకొండ రాజవౌళి అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఓంకార్ చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా గోనె కుమారస్వామి మాట్లాడుతూ పేద ప్రజల బతుకులు మారాలని దేశ సంపద అందరికీ సమానంగా అందించాలని, కమ్యూనిస్టు ఉద్యమం కోసం భారత విప్లవోద్యమానికి వనె్న తెచ్చిన ఓంకార్ త్యాగం వెలకట్టలేనిదని అన్నారు. నిస్వార్ధ కమ్యూనిస్టుగా ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకున్న ఓంకార్ జీవితాన్ని, ఆయన నిజాయితీని నేటి పాలకులు, యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. నేటి పాలకులు దేశ సంపదను లూటీ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో కెసిఆర్ పాలన ఆడంబరాలకే పరిమితమైందని, హామీలు అమలు కావడం లేదని వాపోయారు. ఈ పరిస్థితుల్లో సిద్ధాంత విభేదాలతో విడిపోయిన వామపక్ష శ్రేణులు ఐక్యం కావాలని, ఆ ఆశయం కోసం ఓంకార్ చివరి వరకు కృషి చేశారని కొనియాడారు. అప్పుడు మాత్రమే ఈ దోపిడీ పాలకవర్గాలను కూకటి వేళ్లతో పెకిలించగలమని అన్నారు. కమ్యూనిస్టులను ఏకం చేసే కార్యక్రమంలో ఎంసిపిఐ(యు) ముందు వరుసలో ఉంటుందని స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో ఎంసిపిఐ(యు) రాష్ట్ర, జిల్లా నాయకులు కన్నం వెంకన్న, నాగెల్లి కొంరయ్య, కుసుంభ బాపురావు, ఎండి.మాషుక్, పిట్టల లక్ష్మీనారాయణ, రాజు, సదానందం, రాజాసాహెబ్, సీతారాములు, జగన్, మొగిళిచెర్ల సందీప్, దామ సాంబయ్య, మోతీలాల్, కౌసల్య తదితరులు పాల్గొన్నారు.