వరంగల్

కేసు నీరుగారుస్తున్నారంటూ.. గిరిజనుల రాస్తారోకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసముద్రం, అక్టోబర్ 23: కేసముద్రం (స్టే) గిర్నితండాకు చెందిన ఓ యువకుడు ఇటీవల బావిలో పడి అనుమానాస్పద స్థితిలో మృతిచెందగా, ఆ యువకున్ని కొందరు హత్యచేసి బావిలో వేశారని, అయితే పోలీసులు ఈ కేసులో నిందితుల పక్షాన నిలిచి కేసు నీరుగారుస్తున్నారని ఆరోపిస్తూ కేసముద్రం పోలీస్‌స్టేషన్ ఎదుట రోడ్డుపై గిరిజనులు సోమవారం రాస్తారోకో చేశారు. బాధితుల కధనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. జూలై 22న గిర్నితండాకు చెందిన ఆంగోత్ గణేష్ అనే యువకుడు తండా సమీపంలోని వ్యవసాయ బావిలో మృతిచెంది కనిపించాడు. అయితే తన కొడుకు ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోలేదని, కొందరు కొట్టిచంపి బావిలో పడేశారని మృతుని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపధ్యంలో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసులో కీలకమైన నిందితుడిగా మృతుని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్న ఓ వ్యక్తి తండాకు రాగా మృతుని బంధువులు ఆ వ్యక్తిని చుట్టుముట్టడంతో ఈ విషయం కొందరు 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వగా పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటన జరిగి మూడు మాసాలు దాటుతున్నా పోలీసులు కేసు దర్యాప్తులో జాప్యం వహిస్తున్నారని, కేసును నీరుగార్చే యత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ పోలీస్‌స్టేషన్ ఎదుట కేసముద్రం - తొర్రూర్ ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగారు. దీంతో దాదాపు అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నీరుగార్చడం లేదని, అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని మృతుడి తల్లితండ్రులు హేంలా, నమ్ములకు నచ్చజెప్పి శాంతింపజేసి రాస్తారోకో విరమించేలా చేశారు. ఈ విషయంపై మహబూబాబాద్ రూరల్ సిఐ లింగయ్యను వివరణ కోరగా యువకుడి మృతిపై హత్య కేసు నమోదు చేయాలని బంధువులు కోరారని, అయితే యువకుడి శరీరంపై ఎలాంటి గాయాల్లేక పోవడంతో శాస్ర్తియ కోణంలో విచారణ జరుపుతున్నామని, కొన్ని రిపోర్టులు వచ్చాయని, ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్ తుది రిపోర్టు రావాల్సి ఉందని, ఒకటి..రెండు రోజుల్లో రిపోర్టు రాగానే కేసు వివరాలు వెల్లడిస్తామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

నర్సంపేట, అక్టోబర్ 23: పెండింగ్ స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నర్సంపేట ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పట్టణంలోని ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయం నుండి ప్రభుత్వ దిష్టిబొమ్మతో వరంగల్ రోడ్ కూడలి వరకు శవయాత్ర నిర్వహించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈసందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రూరల్ జిల్లా ఉపాధ్యక్షుడు ఏనుగుతల నరేష్, జిల్లా నాయకుడు యార ప్రశాంత్ మాట్లాడుతూ పెండింగ్ స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో ఉన్నత కళాశాలల్లో చదివే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఇదే సమయంలో ప్రైవేట్ విద్యాసంస్థల యజమానులు ఫీజుల కోసం విద్యార్థులపై వత్తిడి పెంచారని అన్నారు. తమ మార్కులు, టిసి ఇతర సర్ట్ఫికెట్లు ఇవ్వాలని కళాశాలల యజమానులను కోరితే తమకు పెండింగ్ స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ రాలేదని చెబుతూ నిరాకరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న 17 వందల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయకుండా నిర్వీర్యం చేసే విధానాలకు రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలకాలన్నారు. ఈకార్యక్రమంలో ఆ సంఘం నాయకులు అజ్మీర వెంకన్న, గుగులోతు కుమార్, శీరీష, అనూష, కవిత తదితరులు పాల్గొన్నారు.