వరంగల్

నడికూడతోనే పరకాలను రెవెన్యూ డివిజన్‌గా చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, అక్టోబర్ 23: కచ్చితంగా పరకాల మండలం నడికూడ గ్రామాన్ని మండలం చేసూడేనని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పరకాలను రెవెన్యూ డివిజన్‌గా చేస్తామని ప్రకటించడంతో సోమవారం పరకాల పట్టణంలో టిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ కార్యాలయం నుండి కార్యకర్తలు ప్రధాన రహదారి గుండా ర్యాలీని పరకాల బస్టాండ్ వరకు నిర్వహించారు. పరకాల అంబేద్కర్ సెంటర్‌లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం కార్యకర్తలు, ప్రజలనుద్దేశించి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ నడికూడ మండలంతోనే పరకాలను రెవెన్యూ డివిజన్‌గా చేస్తామని ప్రకటించారు. పరకాలను ఒంటరి పరకాల చేసింది ఎవరు అని ఆయన ప్రశ్నించారు. అవమానాలతోనే గెలుపు సాధ్యమన్నారు. నియోజకవర్గంలో టెక్స్‌టైల్స్ పార్క్ ఏర్పాటు చేయనీయకుండా ప్రతిపక్షాలు ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని చెప్పారు. అయినా కూడా రైతులు వారి మాటలను బేఖాతరు చేస్తూ తమ భూములను స్వచ్ఛందంగా ఇవ్వడానికి ముందుకు రావడంతో టెక్స్‌టైల్స్ పార్క్‌కు 1200 ఎకరాల భూమి సేకరించినట్టు చెప్పారు. తనకు డ్రామాలు రావని, ప్రజల ఆదరణ కోల్పోయి డ్రామాలు చేస్తున్న ప్రతిపక్షానికి పరకాల నియోజకవర్గ అభివృద్ధి కనిపించకపోవడం సిగ్గుచేటు అన్నారు.
ధర్మారెడ్డి లంచం తీసుకుంటే నిరూపించాలి...
చల్లా ధర్మారెడ్డి లంచం తీసుకుంటే నిరూపించాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సవాల్ చేశారు. పరకాలలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ పరకాల ప్రజల ఆకాంక్ష రెవెన్యూ డివిజన్ న్యాయమైన కోరిక అని ముఖ్యమంత్రి కెసిఆర్‌తో మాట్లాడితే హేళన చేయడం బాధాకరమన్నారు. వాట్సప్‌లో పోస్టు చేసే మిత్రులకు సవాల్ చేస్తున్న చల్లా ధర్మారెడ్డి లంచం తీసుకుంటే నిరూపించాలన్నారు. ఎవరినైనా ఇబ్బంది పెట్టి వసూలు చేస్తే మాట్లాడాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ దయ వల్ల పరకాలను రెవెన్యూ డివిజన్ చేసినట్టు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గల్లంతు అయిన పార్టీ అని, మునిగిపోయే నావ కాంగ్రెస్ పార్టీ అన్నారు. తెలంగాణలో ఎక్కడా తెరువని ఫైల్ తన విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి కెసిఆర్ పరకాల రెవెన్యూ డివిజన్ కోసం ఫైల్ ఓపెన్ చేయడం గమనించాలన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని నోరు దగ్గర పెట్టుకొని ఉండకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం...
పరకాలను రెవెన్యూ డివిజన్‌గా చేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించడం పట్ల సోమవారం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరకాల బస్టాండ్ కూడలిలో కార్యకర్తలతో కలిసి ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరకాల ప్రజల ఆకాంక్ష అయిన రెవెన్యూ డివిజన్ ఏర్పడడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి బహిరంగ సభకు పరకాల నియోజకవర్గం నుండి 60వేలకు పైగా ప్రజలు హాజరైనట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

చల్లంగ చూడు నాగన్నా..

కేసముద్రం, అక్టోబర్ 23: నాగుల చవితి వేడుకలను పురస్కరించుకొని భక్తులు సోమవారం మండల కేంద్రంలోని రామాలయం, బ్రహ్మంగారిగుడిలో ఉన్న పుట్టల్లో పాలు పోశారు. చల్లంగా చూడాలంటూ నాగన్నకు భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఆలాగే ఊసిరి, రావి చెట్లకు పూజలు చేశారు. భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి.
ఘనంగా నాగులచవితి
కురవి: వీరభద్ర స్వామి అంతరాలయమైన నాగుమయ్య దేవస్థానంలో నాగులచవితిని భక్తులు సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్తీక తొలి సోమవారం కావడంతో వీరభద్రుని ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో పూజలు నిర్వహించారు. కార్తీక మాసం ఆరంభం నాలుగవరోజు తిధి ప్రకారం నాగుల చవితిని నిర్వహించుకున్నారు. ఉదయం 4గంటల నుండే పాలుపోసేందుకు భక్తులు పోటీపడ్డారు. నాగులచవితి సందర్భంగా పుట్టలో ఓ ముస్లిం భక్తురాలు కూడా పాలుపోయడం విశేషం. కురవి ఎంపిపి బజ్జూరి ఉమ, జడ్పీటిసి కొణతం కవిత, ఆలయ చైర్మన్ సతీమణి బాదావత్ లక్ష్మి రాజ్‌లు పాలుపోసారు. ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి రాజేంద్రం తెలిపారు.