వరంగల్

ఇది నియంతృత్వ ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 23: రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం నిరంకుశంగా, నియంతృత్వంగా వ్యవహరిస్తోందని బిజెపి అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, బిజెపి రాష్ట్ర అధికారి ప్రతినిధి రాకేష్‌రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి పర్యటిస్తున్నారనే కారణంగా జిల్లావ్యాప్తంగా అన్ని పార్టీల నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్లకు తరలించటం అరాచకమని అన్నారు. సోమవారం జిల్లా బిజెపి కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతు కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు వాస్తవంగా అర్బన్ జిల్లా పరిధిలోని ధర్మసాగర్ మండలంలో ఏర్పాటుచేయవలసి ఉండగా కొందరు అధికారపార్టీ నాయకుల రాజకీయ స్వార్థం కోసం వరంగల్ రూరల్ జిల్లాకు మార్చారని అన్నారు. ప్రస్తుతం టెక్స్‌టైల్ పార్కు కోసం ఎంపిక చేసిన స్థలం సారవంతమైన వ్యవసాయ భూములని, దీనివల్ల రైతులు ఆర్థికంగా భారీగా నష్టపోతారని అన్నారు. దీనికితోడు ఈ ప్రాంతానికి సరైన రవాణా సౌకర్యాలు లేవని చెప్పారు. మెగా టెక్స్‌టైల్ పార్కులో యూనిట్ల ఏర్పాటు పేరిట ఆదివారం జరిగిన ఎంఓయుల కార్యక్రమం అంతా బోగస్ అని, ఒప్పందాలు చేసుకున్న కంపెనీలలో కొన్ని నిర్వహణ లోపాల కారణంగా ఇప్పటికే నష్టాలతో ఉన్నాయని తెలిపారు. యూనిట్లు ఏర్పాటుచేస్తారంటూ తమకు అనుకూలురకు భూపందారం జరిపేందుకు చేస్తున్న ప్రయత్నంగా ఆరోపించారు. గ్రామపంచాయతీలకు, మున్సిపాలిటీలకు కేంద్రం ఇప్పటికే భారీగా నిధులు మంజూరు చేస్తుంటే, వీటిని కరంటు, తదితర పాత బకాయిల కింద జమ చేసుకుంటున్న రాష్ట్రప్రభుత్వం ఇప్పుడు వీటికి భారీగా నిధులు ఇస్తామని నమ్మబలుకుతోందని ఎద్దేవా చేసారు. డబుల్ బెడ్‌రూంలు ఇస్తారనే ఆశతో పేదలు తాము ఉంటున్న గుడిసెలను కూల్చివేసుకుంటున్నారని, కానీ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇళ్ల విషయంలో ఉదాసీనతతో వ్యవహరిస్తున్న కారణంగా పేదలు రోడ్డున పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసారు.
30వేల ఇళ్లు మంజూరు అయిన వరంగల్ నగరంలో ఇప్పటి వరకు ఎన్ని ఇళ్లు పూర్తిచేసారని ప్రశ్నించారు. వరంగల్ నగరాన్ని వాటికన్ నగరంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటిస్తే, నగరపాలక సంస్థ పాలకవర్గం చేతకానితనంతో నగరం మురికికూపంగా మారిపోతోందని తెలిపారు. రాష్ట్రంలో వివిధ పథకాలకు కేంద్రం భారీగా నిధులు ఇస్తుంటే, ఇవేవో తమ సొంత పథకాలుగా రాష్ట్రం చెప్పుకోవటం సిగ్గుచేటని అన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు విజయలక్ష్మి, రాంమాధవ్ తదితరులు పాల్గొన్నారు.