వరంగల్

కేటీఆర్ వరంగల్ పర్యటనకు అధికారుల విస్తృత ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, నవంబర్ 16: రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాలు, ఐటి శాఖల మంత్రి కె.తారకరామారావు పర్యటన కోసం జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. శనివారం జరిగే కెటిఆర్ పర్యటన సందర్భంగా వివిధ పథకాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ శనివారం ఉదయం వరంగల్ నగరానికి చేరుకున్న అనంతరం కలెక్టరేట్ వద్ద ఏర్పాటుచేస్తున్న బస్ బేకు శంకుస్థాపన చేస్తారు. నయాంనగర్ వద్ద అండర్‌గ్రౌండ్ గార్బేజ్ బిన్లను ప్రారంభిస్తారు.
ఆ తరువాత సమ్మయ్యనగర్ జంక్షన్ సమీపంలో నిర్మించే రెండు పడకల గదుల ఇళ్లకు శంకుస్థాపన చేస్తారు. ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన హామీల మేరకు మోడల్ డివిజన్ ఏర్పాటులో భాగంగా రెండేసి కోట్ల రూపాయలతో నిర్మించే పార్కు, గ్రేవ్‌యార్డు, రోడ్లు, సైడ్‌డ్రైన్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. 72లక్షల రూపాయలతో రోడ్డుకు ఇరుపక్కలా నిర్మించే ఫుట్‌పాత్‌లకు, 10కోట్ల రూపాయలతో నిర్మించే స్ట్రామ్ వాటర్ డ్రైన్లకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం అమ్మవారిపేటలో రెండుకోట్ల రూపాయలతో నిర్మించిన మానవ వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని, ఏడులక్షల రూపాయలతో నిర్మించిన షీ-టాయిలెట్లను ప్రారంభిస్తారు.
ములుగురోడ్డులోని వెంకటేశ్వర గార్డెన్‌లో జరిగే కార్యక్రమంలో చేనేత కార్మికుల కోసం అమలు చేయతలపెట్టిన ఇన్‌పుట్ సబ్సిడీ లింకేజీ పథకాన్ని ప్రారంభిస్తారు. స్మార్ట్ సిటీ పథకం కింద నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్మించే నాలుగులైన్ల రోడ్ల నిర్మాణానికి పద్మాక్షి గుడి కూడలి వద్ద శంకుస్థాపన చేస్తారు. స్మార్ట్ సిటీ పథకం కింద 13,50కోట్ల రూపాయలతో చేపట్టే వరంగల్‌లోని కాకతీయ మ్యూజికల్ గార్డెన్ పునరుద్ధరణ, అభివృద్ధి పనులకు, 11.50కోట్లతో హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. హన్మకొండ బస్‌స్టాండ్ సమీపంలోని అంబేద్కర్‌నగర్‌లో నిర్మిస్తున్న రెండు పడకగదుల అపార్ట్‌మెంట్లను తనిఖీ చేస్తారు. అనంతరం కాకతీయ డిగ్రీ కళాశాల గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. మంత్రి కేటీఆర్ పర్యటన కోసం జిల్లా యంత్రాంగం ఉరుకులు, పరుగుల మీద ఏర్పాట్లు చేస్తోంది. శంకుస్థాపనలకు, ప్రారంభోత్సవాలకు మంత్రి కేటీఆర్ నగరంలోని వివిధ ప్రాంతాలకు వెడుతున్న కారణంగా ఆయా మార్గాల్లోని రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు, పారిశుద్ధ్య కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన చేపడుతున్నారు. కెటిఆర్ పర్యటన సందర్భంగా చేయవలసిన ఏర్పాట్లు, తీసుకోవలసిన జాగ్రత్తలపై అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి గురువారం వరంగల్ మహానగర పాలక సంస్థ, కుడా, చేనేత శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.