వరంగల్

బిర్యానీ వండటం రాదని భార్యను వెళ్లగొట్టాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్ధన్నపేట, నవంబర్ 16: నిండునూరేళ్లు చిలకా గోరింకల్లా కలసిమెలిసి కాపురం చేయవలసిన భార్యాభర్తలు బజారుకెక్కిన సంఘటన ఇది. భార్యకు బిర్యానీ వండటం రాదనే నెపంతో పెళ్లయిన రెండునెలలకే భార్యను పుట్టింటికి పంపిన సంఘటన ఇల్లంద గ్రామంలో జరిగింది. బాధితురాలు మానస కథనం ప్రకారం వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన కూరపాటి రాజేంద్రప్రసాద్‌తో 11నెలల క్రితం ఘనంగా వివాహం పెద్దల నిశ్చయం మేరకు జరిగింది. మానసకు తండ్రి లేకపోయినా ఆమె తల్లి కూతురు మానసకు ఎనిమిది లక్షల కట్నం ఇచ్చి వివాహం జరిపించింది. బిర్యానీ వండటం రాదనే నెపంతో పెళ్లయిన రెండు నెలలకే మానసను భర్త పుట్టింటికి పంపించాడు. రోజులు గడుస్తున్నా మానసను తిరిగి తీసుకెళ్లకపోవడంతో గురువారం మానస అత్తవారింటి ముందు దీక్షకు దిగింది. కాగా పెళ్లి అయిన తర్వాత కూడా కట్నం కోసం భర్త ఇబ్బంది పెట్టేవాడని, తన అత్త, ఇతర కుటుంబసభ్యులు కూడా భర్తకు సహకరించేవారని మానస వాపోయింది. న్యాయం జరిగేంత వరకు దీక్ష కొనసాగిస్తానని మానస తెలిపింది.

డెంగ్యూతో మహిళ మృతి

మహాముత్తారం, నవంబర్ 16: మహాముత్తారం మండల కేంద్రానికి చెందిన బోడ ప్రమీల అలియాస్ గుంపుల పోషక్క(35) అనే మహిళ డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ గురువారం మృతిచెందింది. వారం రోజులగా జ్వరం రావడంతో స్థానిక అర్‌ఎంపిల వద్ద వైద్యం చేయించుకోగా జ్వరం తీవ్రత పెరగడంతో హన్మకొండలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో రక్తపరీక్షలు చేయించుకుంది. రక్తకణాలు తగ్గిపోయినట్లు అక్కడ నిర్ధారించగా ఎంజిఎం అసుపత్రికి చికత్స కోసం తరలించారు. ఎంజిఎంలో చికిత్స పొందుతూ పోషక్క గురువారం మృతిచెందింది.
విజృంభించిన విషజ్వరాలు
మహాముత్తారం మండల కేంద్రంలో వారం రోజులగా విషజ్వరాలు విజృంభించాయి. విషజ్వరాలు అధికంగా ఉన్నా ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన వైద్యసిబ్బంది స్పందించడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. స్థానిక వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం చేస్తున్నట్లు తెలిపారు. దాంతో విషజ్వరాలతో ఆర్‌ఎంపిల వద్ద చికిత్స పొందుతూ ప్రాణాల మీదకు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య అధికారి స్పందించి గ్రామంలో ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేయాలని జ్వర పీడితులు వేడుకుంటున్నారు.