వరంగల్

బెల్టు షాపులపై పోలీసుల దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏటూరునాగారం, నవంబర్ 16: మండల కేంద్రంలో అక్రమంగా నిర్వహిస్తున్న మద్యం బెల్టుషాపులపై బుధవారం రాత్రి పోలీసులు దాడులు నిర్వహించి 20వేల రూపాయల విలువ చేసే మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నా తెలిపారు. ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని ఓడగూడెం, ఎర్రమ్మవీధి, తాళ్లగడ్డ, క్రాస్‌రోడ్డు, ఆకులవారి ఘనపురం తదితర ప్రాంతాలలో అక్రమంగా నిర్వహిస్తున్న మద్యం బెల్టు దుకాణాలపై దాడులు జరిపారు. ఈ దాడులలో రూ.20వేల విలువచేసే మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, వాటిని విక్రయిస్తున్న గజ్జెల స్వరూప, ఆకుల సతీష్, కందికొండ రాజయ్య, ఎండి.హసీనా తదితరులను అదుపులోకి తీసుకుని ఎక్సైజ్ అధికారులకు అప్పగించామని చెప్పారు.
గుట్కా అమ్మితే పీడీ యాక్టు కింద కేసులు
నర్సంపేట, నవంబర్ 16: గుట్కా అమ్మితే సదరు వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని నర్సంపేట ఏసీపీ సునీతా మోహన్ హెచ్చరించారు. నర్సంపేట టౌన్ పోలీసుస్టేషన్‌లో గురువారం వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. గుట్కా, నల్లబెల్లం అమ్మకాలను చేపట్టవద్దని సూచించారు. గుట్కా, గుడుంబా వల్ల అనేక మంది మృత్యువాత పడుతున్నారని, ఫలితంగా అనేక కుటుంభాలు రోడ్డున పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యువత గుట్కాకు బానిసై తమ విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని వాపోయారు. అదేవిధంగా గుడుంబా సేవించడం వల్ల చిన్న వయస్సులోనే మహిళలు తమ భర్తలను కోల్పోయి దుర్భర జీవనం గడుపుతున్నారని చెప్పారు. డబ్బులు సంపాదించేందుకు అనేక మార్గాలు ఉన్నాయని, అయితే ప్రభుత్వం నిషేధించిన మత్తు పదార్ధాలను అమ్మవద్దని సూచించారు. గుట్కా అమ్మితే ఇక నుండి పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నర్సంపేట కిరాణా వర్తక సంఘం పరిధిలో ఉన్న తామంతా ఇక నుండి గుట్కా అమ్మమని పేర్కొంటూ చేసిన తీర్మానాన్ని ఏసీపీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట టౌన్ సీఐ కొత్త దేవేందర్ రెడ్డి, ఎస్సై నాగ్‌నాథ్, కిరాణా వర్తక సంఘం అధ్యక్షుడు దాసరి నర్సింహారెడ్డి, పుట్ట రామస్వామి, సోల్తి సాంబయ్య, బండి వేణు పాల్గొన్నారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అధికారం తథ్యం
భూపాలపల్లి రూరల్, నవంబర్ 16: రాష్ట్రంలో 2019లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి ఆన్నారు. గురవారం రేగొండ మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి చెందిన టీడీపీ, టీఆర్‌ఎస్‌లకు చెందిన పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి గండ్ర కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధరలేక పంటలు నష్టపోతున్నారని, వ్యవసాయకంగా అనేక సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతుంటే రాష్ట్రప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తోందని, రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. సమయం వచ్చినపుడు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ఓటమి తప్పదని ఆన్నారు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రెండులక్షల రూపాయల వ్యవసాయ రుణాలను ఏకకాలంలో మాఫీ చేస్తామని తెలిపారు. కాంగ్రెస్‌లో చేరిన వారిలో టీడీపీ, టీఆర్‌ఎస్ నాయకులు బండారి రాజు, గట్టు సురేష్, కందికొండ రమేష్, దైనపల్లి బిక్షపతి, సదానందం, ముష్క తిరుపతి తదితరులు ఉన్నారు.
చివరి ఆయకట్టుకు సాగునీరందించాలి
నర్సంపేట, నవంబర్ 16: నర్సంపేట నియోజకవర్గంలోని పాఖాల చెరువు కింద 25వేల ఎకరాల ఆయకట్టు సాగవుతుందని, చివరి ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు గురువారం అసెంబ్లీలో జీరో ఆవర్‌లో ఆయన మాట్లాడారు. అనంతరం స్థానిక విలేఖరులకు ఫోన్‌లో వివరాలను తెలిపారు.
పాఖాల చెరువుకింద అధికారికంగా 25వేల ఎకరాల ఆయకట్టు ఉందని, అయితే ఐదు ఉప కాల్వలలో గుర్రపు డెక్క, పిచ్చి చెట్లు మొలవడం వల్ల చివరి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదన్నారు. గత ఖరీఫ్ సీజన్‌లో రైతులు ఇబ్బందులు పడ్డారని, రైతులే తమ సొంత డబ్బులు వెచ్చించి కాల్వలను తాత్కాలికంగా శుభ్రం చేసుకున్నారని చెప్పారు. రబీలో పదివేల ఎకరాల ఆయకట్టు సాగయ్యే పరిస్థితి ఉందని, చివరి ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి హరీశ్‌రావు సానుకూలంగా స్పందించారని, కాల్వల మరమ్మతులను చేపడతామని హామీ ఇచ్చినట్లు ఆయన వివరించారు.