వరంగల్

ఫరూక్ అబ్దుల్లాను బహిరంగంగా ఉరి తీయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, నవంబర్ 16: భారత దేశంలో ఉంటూ, భారతదేశం గాలి పీలుస్తూ పరాయి దేశమైన పాకిస్తాన్‌కు అనుకూలంగా భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాను బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడు కానుగుల గోపీనాథ్ ఆధ్వర్యంలో ఫరూక్ అబ్దుల్లా దిష్టిబొమ్మను గురువారం పరకాలలో దహనం చేశారు. ఈ సందర్భంగా బిజెపి నేతలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు మేకల రాజవీరు మాట్లాడుతూ ఫరూక్ అబ్దుల్లా పాక్ అక్రమిత కాశ్మీర్ ఎన్నటికైనాపాకిస్తాన్‌దే అని అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచ దేశాలలో భారతదేశం ప్రతిష్టను పెంపొందింస్తూ పోతుంటే భారతదేశంలో ఉంటూ భారతదేశం అన్నం తింటున్న జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ దేశ సరిహద్దులో ఉన్న భారత ఆర్మి జవాన్లపై పాకిస్తాన్ వాళ్ల కాల్పులు జరుపుతూ ఎంతో మందిని బలి తీసుకుంటుంటే అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఫరూఖ్ అబ్దుల్లా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కాచం గురుప్రసాద్, గండ్ర జయపాల్‌రెడ్డి, ఆర్‌పి జయంతిలాల్, కుక్కల విజయ్, ప్రవీణ్, రంజిత్, ఆర్‌పి సంగీత, కక్కు రాజు, అశోక్, శ్రీనివాస్, శంతన్‌రెడ్డి, శివప్రసాద్, తిరుపతి పాల్గొన్నారు.

బాక్సింగ్ పోటీలకు కాకతీయ జట్టు
కెయు క్యాంపస్, నవంబర్ 16: చండీగఢ్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయంలో ఈ నెల 18నుండి 23వ తేదీవరకు నిర్వహించే ఇంటర్ యూనివర్సిటీ బాక్సింగ్ పోటీలకు కాకతీయ పురుషులు జట్టు పాల్గొంటుందని స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్డర్ గాదె పాణి తెలపారు. ఈ జట్టులో తోయజ్ కుమార్(విట్స్), ప్రభుదాస్, వినోద్ కుమార్( ఆర్ట్స్,సైన్స్ కళాశాల), జ్యోతికుమార్ (్భవిత డిగ్రీకళాశాల,బెల్లంపల్లి), రంజీత్(మాస్టర్జీ డిగ్రీకళాశాల), వినయ్ (మహర్షి డిగ్రీకళాశాల, ములుగు), వివేక్, సాయి ప్రసాద్, అదర్శ్(విమ్స్ డిగ్రీ కళాశాల, మంచిర్యాల) కాకతీయ యూనివర్సిటీ జట్టు తరుపున పాల్గొంటారని చెప్పారు. యూనివర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ సురేందర్ కోచ్ కం మేనేజర్‌గా వ్యవహరిస్తారని తెలిపారు.
స్వచ్ఛ్భారత్‌లో సమన్వయంతో పనిచేయాలి
వర్ధన్నపేట, నవంబర్ 16: స్వచ్ఛ్భారత్ కార్యక్రమంలో నూరు శాతం ఫలితాలను సాధించడానికి సమన్వయంతో అధికారులు, ప్రజాప్రతినిధులు పనిచేయాలని వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన సమీక్షా సమావేశానికి ముఖ్యఅతిధిగా అయన హాజరయ్యారు. వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి, ఐనవోలు మండలాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామాభివృద్ధి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్‌అసిస్టెంట్లతో సమీక్షా కార్యకమాన్ని నిర్వహించారు. మండలంలోని ప్రతి గ్రామంలో స్వచ్ఛ్భారత్ కార్యక్రమానికి సంబంధించిన ప్రస్తుత పరిస్థితులు, పురోగతిపై స్వయంగా అడిగి తెలుసుకున్న కలెక్టర్ పలు సూచనలు చేశారు.
డిసెంబర్ 31నాటికి నూటికి నూరుశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేసి బహిరంగ మలవిసర్జనరహిత మండలాలుగా నమోదు చేయాలని, అందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు సరైన అవగాహన కల్పించాలని తెలిపారు. పురోగతి సాధించని ఇన్‌చార్జ్ అధికారులపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేస్తూ మందలించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ శేఖర్‌రెడ్డి, వర్ధన్నపేట ఎంపిపి రవీందర్‌రావు, జెడ్పీటీసీ సారంగపాణి, సంపత్‌రెడ్డి, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

ఒకే ప్రాంగణంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు

వెంకటాపురం(నూగూరు), నవంబర్ 16: ఉన్నత పాఠశాల పక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాలలను ఒకే ప్రాంగణంగా గుర్తించి రెండు పాఠశాలలు ఒకే యాజమాన్యం కింద తరగతులు నిర్వహించనునట్టు ములుగు సబ్ కలెక్టర్ గౌతమ్ తెలిపారు. గురువారం మండలంలోని అలుబాక, మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలను ఆయన పరిశీలించి విద్యార్థులకు ఉన్న సౌకర్యాలు, భవనాల స్థితిగతులను, మంచినీటి సదుపాయం, మధ్యాహ్న భోజనం, మరుగుదొడ్లు తదితర అంశాలను పాఠశాల ఉపాద్యాయులు, తల్లిదండ్రులతో సమీక్షించారు. అలుబాక గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాఠశాలకు తల్లిదండ్రులు, గ్రామస్తుల నుండి విరాళాలను సేకరించాలని, వారు ఇచ్చే విరాళాలకు తొమ్మిది రెట్లు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని చెప్పారు. ఆ నిధులు పాఠశాల అభివృద్ధికి ఖర్చు చేయాలని సూచించారు. పాఠశాల అభివృద్ధి కోసం 15మంది సభ్యులతో కమిటీ ఏర్పాటుచేయాలని ప్రధానోపాధ్యాయుడు వీరభద్రరావును ఆదేశించారు. వెంకటాపురం హైస్కూల్‌లో శిథిల భవనాలను తొలగించాలని, పాఠశాల భవనాలకు మరుమ్మతులు, తరగతి గదులలో విద్యుత్‌లైట్లు, ఫ్యాన్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంఇఓ వీరభద్రరావు, తహసీల్దార్ బిక్షం, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

కళా ప్రదర్శనలతో మరుగుదొడ్ల ప్రాముఖ్యత వివరించాలి
భూపాలపల్లి రూరల్, నవంబర్ 16: జిల్లాలోని ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి నిర్మించుకుని ఉపయోగించేలా కళాకారులు కళాప్రదర్శనల ద్వారా ప్రజలకు తెలియపరచాలని జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి ఆన్నారు. మరుగుదొడ్ల నిర్మాణం, పరిసరాల పరిశుభ్రతపై కళా ప్రదర్శనల అంశంపై గురువారం సింగరేణి క్లబ్‌హౌస్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, సమాచార శాఖ ఆధ్వర్యంలో కళాకారులకు ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జయశంకర్ జిల్లా కళాకారులకు నెలవని, తెలంగాణ ఉద్యమ సమయంలో కళాప్రదర్శనల ద్వారా చూపించిన పోరాట పటిమను స్వచ్ఛ జిల్లాగా మార్చటంలో చూపించి ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి నిర్మించుకునేలా చేయాలని ఆన్నారు. జిల్లాలో మరుగుదొడ్ల ఉపయోగంపై సగంమంది జనాభాకు మాత్రమే అవగాహన ఉందని, జిల్లాలోని తొమ్మిది వందల ఆవాసాల్లో కళాప్రదర్శనల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా 20 కళాబృందాల ద్వారా ప్రదర్శన నిర్వహిస్తామని, మరుగుదొడ్ల నిర్మాణం వాడకం, వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతపై ముందుగా రచయితలతో పాటలు, నాటకాలను సిద్ధం చేయిస్తామని చెప్పారు.
ఈ నెల 25, 26వ తేదిల్లో తాడ్వాయిలో రచయితలతో వర్కషాప్ నిర్వహిస్తామని అన్నారు. బహిరంగ మలవిసర్జన వలన కలిగే అనర్ధాలు, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై ఆసక్తి ఉన్న రచయితలు పాటలు, నాటికాలు రాసి జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో ఈ నెల 22లోగా అందజేస్తే అత్యుత్తమమైన రచనకు నగదు బహుమతి అందిస్తామని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం ఐడిడిఎ పిఓ చక్రధర్‌రావు, డిఆర్‌డిఎ పిడి చంద్రవౌళి, జిల్లా పౌర సంబంధాల అధికారి రవికుమార్, జిల్లా ఇంజనీరింగ్ కన్సల్టెంట్ చంద్రశేఖర్, నైమున్సీసా పాల్గొన్నారు.

సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరువయ్యేలా చూడాలి
కమలాపుర్, నవంబర్ 16: ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరువయ్యేలా ప్రజాప్రతినిధులు చూడాలని కరీంనగర్ ఎంపి బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. గురువారం కమలాపుర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేయకపోయినా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పేదకుటుంబాల కష్టాన్ని గమనించి వారి ఆడపిల్లల వివాహాలకు చేదోడువాదోడుగా ఉండడానికి ఈ పథకాన్ని ప్రారంభించారని అన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలతో పాటు మిగతా అందరూ ప్రజాప్రతినిధులు ప్రజలకు చేరేలా చూడవలసిన బాధ్యత ఉందని అన్నారు. అనంతరం మండలంలోని పలు గ్రామాలకు చెందిన 120మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి లక్ష్మణరావు, జడ్పీటీసీ నవీన్‌కుమార్, తహసీల్దార్ సత్యనారాయణ యాదవ్, ఎంపీడీఓ పద్మావతి, సింగల్ విండో చైర్మన్ సంపత్‌రావు తదితరులు పాల్గొన్నారు.
రైతులకు బీమా అందించాలి
కమలాపుర్: వరి, పత్తిపంటలు నష్టపోయిన రైతులకు బీమా కింద పరిహారం అందించేలా చూడాలని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎంపీపీ లక్ష్మణరావు అధ్యక్షత వహించారు. మొదట వ్యవసాయ అధికారి రాజ్‌కుమార్ మాట్లాడుతుండగా మండల సభ్యులు అడ్డుకుని వ్యవసాయ అధికారులు పంటనష్ట పోయిన రైతులకు నష్టపరిహారం ఇస్తారా, లేదా అని ఆయనను ప్రశ్నించారు.
వ్యవసాయ రుణాల మంజూరు సందర్భంగా పంటల ఇన్సూరెన్స్ కోసం డబ్బులు బ్యాంక్ వారు మినహాయించుకున్నారని తెలపగా, ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి పంట నష్టపరిహారం అందేలా చూస్తానని ఎంపి పేర్కొన్నారు. కమలాపుర్ ఎంపీటీసీ సభ్యుడు మాట్లాడుతూ కురుమ, యాదవ కులస్తులకు ప్రభుత్వం అందజేసిన గొర్రెల పెంపకం పథకంలో సగం వరకు గొర్రెలను అమ్మినట్టు ఆరోపించారు. దీనిపై ఎంపి స్పందిస్తూ గొర్రెలను అమ్మినవారిపై కఠినచర్యలు తీసుకోవాలని ఎంపీ అధికారులకు సూచించారు. కమలాపుర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన 30పడకల ఆసుపత్రిలో ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్, గునిపర్తి ఏఎన్‌ఎంలు సక్రమంగా విధులకు హాజరు కావడం లేదని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేయగా ఎంపిపి వారిని డిఎంఅండ్‌హెచ్‌ఓకు సరెండర్ చేసేందుకు తీర్మానం చేశారు. అదేవిధంగా ఆసుపత్రిలో ఇన్‌చార్జ్‌గా ఉన్న వైద్యురాలిని తొలగించి పూర్తి బాధ్యతలతో వైద్యాధికారిణి నియమించాలని ఉన్నతాధికారులను కోరుతూ తీర్మానం చేశారు.